Monday, November 2, 2015

భారతరాజ్యాంగం & రాజనీతి శాస్త్రం

1. భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని వర్ణించింది ఎవరు?
1.కేసీ వేర్ 2.కేటీ షా 3.డీఎన్ బెనర్జీ 4.అంబేడ్కర్
జవాబు:3

2. "కుడి అరసు" [ప్రజల ప్రభుత్వం] అను తమిళ పత్రిక ప్రారంభించింది?
1.రామస్వామి నాయికర్/ పెరియార్ రామస్వామి 2. సుబ్రహ్మణ్య భారతియార్ 3.తిరుప్పుర్ కుమారణ్ 4.చిదంబరం పిళ్ళై
జవాబు:1


3. 
 SNDP [శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం] అనే సంస్థని 1903లో, కేరళ రాష్ట్రంలో స్థాపిoచింది ఎవరు?
[ఎజవా అను వెనుకబడిన తరగతికి చెందినవారి అభ్యున్నతికోసం]

1.పెరియార్ రామస్వామి 2.నారాయణగురు 3.త్యాగరాయ శెట్టి 4.టీ.ఎం నాయర్
జవాబు:2

4. స్థానిక ప్రభుత్వ లక్షణాలలో నిజం కానిది ఏది?
1.స్థానిక ప్రభుత్వాలు చట్టబద్ధమైన హోదా కలిగి ఉండాలి
2.ఈ ప్రభుత్వాలు శాసనసభ రూపొందించిన ప్రత్యేక చట్టంద్వారా ఏర్పడతాయి
3.కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ హోదాలకంటే తక్కువ హోదా కలిగి ఉంటాయి.
4.ప్రజలపైన, సంస్థలపైనా దావా చేయడానికి అధికారం కలిగి ఉంటాయి
జవాబు:4

5.61వ రాజ్యాంగ సవరణ జరిగిన సమయంలో భారత్ ప్రధానమంత్రి ఎవరు?
1.ఇందిరాగాంధి 2.రాజివ్ గాంధి 3.పీవీ నరసిమ్హారావు 4.మొరార్జీ దేశాయ్
జవాబు:2


6. "జై భీం" అంటే?
1.అంబేడ్కర్ ప్రేరణతో బౌద్ధ మతం స్వీకరించిన దళితులకి సంభంధించిన పదం
2.స్వాత్రంత్ర్యానంతరం అంబేడ్కర్ ష్తాపించిన మతం
3.కొమరం భీం స్మారకార్థం పేరు మార్చబడిన ఒక నీటిపారుదల ప్రాజెక్ట్
4.ఏదీ కాదు
జవాబు:1

7. పంచాయితీరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారి ప్రవేశ పెట్టబడింది ఎక్కడ?
1.నాగ్‌పూర్ 2.నాగౌర్ 3. శ్రీకాకుళం 4.జునాగడ్
జవాబు:2

8. పంచాయతీరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారిగా 1959, అక్టోబర్ 2న ఏ రాష్ట్రంలో అమలు చేయబడింది ?
1) ఆంధ్ర ప్రదేశ్ 2) మహారాష్ట్ర 3) రాజస్థాన్ 4) గోవా
జవాబు:3) రాజస్థాన్

9. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో "సామ్యవాద, లౌకిక" పదాలతో పాటూ చేర్చిన మరో పదం?
1.సమగ్రత 2.ఏకత 3.ఆర్థిక న్యాయం 4.సోదరభావం
జవాబు: సమగ్రత

10. భారత రాజ్యాంగం పైన వ్యాఖ్యానించే అధికారం ఎవరికుంది? 
[Group1, 1994]
1.రాష్ట్రపతి 2.పార్లమెంట్ 3.సుప్రీంకోర్ట్ 4.లోక్ సభ అధ్యక్షుడు
జవాబు: సుప్రీం కోర్టుకి ఉంది
రాష్ట్రపతి రాజ్యంగ అధిపతి.
రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఉంది.
ఆప్షన్స్ మళ్ళీ చూస్కొండి

11. భారతరాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు.
1) 63,96,729 2)1 కోటి 90 లక్షలు  3) 2 కోట్ల 2లక్షల 2వందలు 4) 3, 55, 676
[గ్రూప్2, 2003] [వివరణ:.ఈ కమిటీ 1946 లో ఇండియా సందర్శించి స్వాతంత్ర్యానంతరం తమను తాము పరిపాలించుకోడానికి అవసరమైన కమిటీ ఏర్పాటుపైన ప్రతిపాదన చేసింది.ఇదే ప్రశ్నని 2003 లోనే గ్రూప్2 బ్యాక్ లాగ్ పొస్టులు భర్తీ చేసేటప్పుడు వెరే లా అడిగారు."ప్రశ్నలో అడగబడ్డ కమిటీ ని ఇండియాకి పంపడంలో అసలు ఉద్దేశ్యం ఎమిటి అని అడిగారు" సమాధనం , "రాజ్యాంగ సమస్యకి సరైన పరిష్క

14. "ఆదేశిక సూత్రాలు ముందు తేదీ కలిగి ఉన్న చెక్కు లంటివి "అని వ్యాఖ్యానించింది? [A cheque on bank payable at the convenience of the bank]
1. కే.టీ షా 2.కే.సీ. వేర్ 3.నెహ్రూ 4.ఎం.ఎన్ రాయ్.
జవాబు:1. కే.టీ షా


15. భారత దేశంలో సర్వోన్నతమైనది గా దేనిని పేర్కొంటారు?
1.పార్లమెంట్ 2.భారత ప్రభుత్వం 3.రాజ్యాంగం 4.భారత ప్రజలు
జవాబు:3.రాజ్యాంగం


16. ఎన్నో షెడ్యూల్‌లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలను పేర్కొన్నారు ?
1) 2వ షెడ్యూల్ 2) 4వ షెడ్యూల్ 3) 6వ షెడ్యూల్ 4) 7వ షెడ్యూల్
జవాబు: 4) 7వ షెడ్యూల్
7వ షెడ్యూల్ లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలకు సంభంధించిన జాబితాలను ఇందులో పేర్కొన్నారు. ఆర్తికల్ 246 ఈ అంశాలను తెలుపుతుంది. కేంద్ర జాబితాలో 99 అంశాలు. రాష్ట్ర జాబితాలో 61 అంశాలు. ఉమ్మడి జాబితాలో 52 అంశాలుంటాయి

17. రాజ్యాంగంలో ఏ ప్రకరణ [ఆర్టికల్] జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోంది ? 
[అంబేద్కర్ గారు ఈ అర్టికల్ డ్రాఫ్ట్ చేయడానికి ఇష్టపదలేదనీ, తర్వాత గోపాల స్వామి అయ్యంగార్ గారు ద్రాఫ్ట్ చేసారనీ అంటారు.]
1)ప్రకరణ 370 2)ప్రకరణ 368 3)ప్రకరణ 375 4)ప్రకరణ 386
జవాబు:1

18. రాజ్యాంగం లోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపు నిరోదక సూత్రాలను తెలుపుతుంది? 
[1985 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోదక చట్టం చేస్తూ, 10వ షెద్యూల్ లొ చేర్చింది. రాజకీయ పార్టీ అనే పదం ఈ షెడ్యూల్ లో మాత్రమే ఉంది] 
[సివిల్స్ 2005 ప్రిలింస్ లో అడిగారు]
1.9వ 2.10వ 3.11వ 4.12వ
జవాబు:2.10వ
రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ని చేర్చింది. రాజకీయపార్టీల గుర్తుతో గెలిచిన వారు మరొక పార్టీలో చేరితే సభాధిపతులు వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.

19. భారత రాజ్యాంగం పైన వ్యాఖ్యానించే అధికారం ఎవరికుంది? 
[Group1, 1994]
1.రాష్ట్రపతి 2.పార్లమెంట్ 3.సుప్రీంకోర్ట్ 4.లోక్ సభ అధ్యక్షుడు
జవాబు:3.సుప్రీంకోర్ట్
రాజ్యాంగాన్ని అధికారకంగా వ్యాఖ్యానించే అధికారం సుప్రీం కోర్ట్ కి ఉంది.
రాష్ట్రపతి-రాజ్యాంగానికి అధిపతి.
పార్లమెంట్ - కి రాజ్యాంగ సవరణాధికారం ఉంది

20. 'చింతన, భావప్రకటన, విశ్వాసం, ప్రార్ఠనా స్వేఛ్చ ' అనే పదాలు రాజ్యాంగం లో ఏ భాగంలో ప్రస్తావించారు.[Grop2, 2000]
1.పీఠిక 2.కేంద్ర న్యాయస్థానం 3.ఆదేశిక సూత్రాలు 4.ప్రాథమిక హక్కులు.
జవాబు:1
పీఠిక : భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన (చింతన), భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల లోస్వాతంత్య్రాన్ని (ప్రార్థనా స్వేచ్చ. అందుకే మనది లౌకిక రాజ్యం. అధికార మతం అంటూ ఏదీ లేదు), అంతస్థుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాం

21. భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం?
1)11 నెలల 18 రోజులు 2)18 నెలల 11 రొజులు 3)11 నెలల 12 రొజులు  4) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
జవాబు:4

22. భారత్ రాజ్యంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విద్యుక్త అంశాలున్నాయి?
1)29 2)18 3)26 4)28
ఇది 2008 గ్రూప్2 లో అడిగిన ప్రశ్న.
జవాబు:1)29

23. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకి చట్టం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం ఉంది? (2008, Accounts officer exam, appsc)
1.6 2.5 3.4 4.3
జవాబు:4; Article 3

24. భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం?
1)11 నెలల 18 రోజులు
2)18 నెలల 11 రొజులు
3)11 నెలల 12 రొజులు 
4) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
జవాబు:4

25. భారత రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి?
1.రెండు  2.మూడు  3.నాలుగు  4.ఏదీకాదు
జవాబు:2. మూడు
రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు రాజ్యాంగంలో పొందుపరిచారు. అవి 3

1)జాతీయ అత్యవసరాలు 2)రాష్ట్రపతి పాలన 3)ఆర్థిక అత్యవసరాలు



1.జీరో అవర్‌ కాలపరిమితి ఎంత
1) నిర్ణిత కాలపరిమితి ఉండదు 2) ఒకగంట 3) 45 నిమిషాలు 4) అర్థగంట
జవాబు:1
ప్రశ్నోత్తరాల సమ్యం తర్వాత "జీరో అవర్" ఉంటుంది. 12 గంటలకి మొదలవటం వల్ల ఈ పేరు రావొచ్చు. స్పీకర్ కి సభ్యులు ముందే నోటిస్ ఇచ్చి, ఏ విషయం పైన మాట్లాడలుకుంటున్నారో క్లియర్ గా నోటిఫై చేస్తారు. ఇది పార్లమెట్ అధికారిక ప్రొసీజర్ గా గుర్తించబడనందున ఎన్ని విషయాలపైన, ఎంత సేపు మాట్లాడాలి అనే దానిపైన ఏ విధమైన రూల్స్ లేవు. [స్పీకర్ నిర్ణయం].

2.ఇటీవల నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఎన్ని సీట్లు రిజర్వ్‌ చేశారు
1) 111 2) 121 3) 131 4) 141
జవాబు:3
మొత్తం సీట్స్=543 [+2]
రిసర్వ్డ్ సీట్స్ = 131 [ముందు 120 ఉండేవి]
ఇందులో:
ఎస్.సీ = 84 [ముందు 79]
ఎస్.టీ = 47 [ముందు 41]
3.మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ ఆర్డినెన్సులు జారీ చేయటం ఏ రకమైన అధికారం
1) శాసన అధికారం 2) కార్యనిర్వహణ అధికారం 3) విచక్షణ అధికారం 4) అత్యవసర అధికారం
జవాబు: 1
రాష్ట్రశాసనసభ సమావేశంలో లేనపుడు, ప్రత్యేక అవసరాల్లో ప్రభుత్వ అవసరాల కోసం సీ.ఎం, మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. [ఆర్టికల్ 213].
ఈ ఆర్డినెన్స్ ని ఉభయసభలూ సమావేశం అయిన తర్వాత 6 వారాల్లో ఆమోదింపబడాలి లేదంటే, ఇది రద్దవుతుంది. ఈలోపు గవర్న్మెంట్ ఆర్డినెన్స్ స్థానంలో బిల్ ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ లో పేర్కొన్న అంశాలపైన శాసనసభ అమోదం పొందవచ్చు. ఈ ఆర్డినెన్స్ కి చట్టానికున్న హోదా, అధికారం ఉంటాయ్.
ఆర్డినెన్స్ జారీ చేయటం అనేది మంత్రిమండలి "సలహా" తోనే చేయటంవల్ల విచక్షణ అధికారంగా దీన్ని లెక్కలోకి తీస్కోవద్దు. "మంత్రి మండలి సలహాలు తీస్కోకుండా తీస్కొనేవి" విచక్షణాధికారాలు.[ఉదాహరణ: రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన కేంద్రానికి నివేదికలు పంపటం]
శాసన అధికారాలు = రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించినవి
కార్యనిర్వాహక అధికారాలు = పరిపాలన, నియామకాలు, తొలగింపులు మొదలైనవి.

4.అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానమంత్రి
1) ఇందిరాగాంధీ 2) మన్మోహన్‌సింగ్‌ 3) రాజీవ్‌గాంధీ 4) జవహర్‌లాల్‌ నెహ్రు
జవాబు:4
5.
 దేశంలో మొదటి మహిళా గవర్నర్‌
1) పద్మజానాయుడు 2) దుర్గాభారు దేశ్‌ముఖ్‌ 3) సరోజినీ నాయుడు 4)నయనతార సెహగల్‌
జవాబు:3

6.ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలోను, రాష్ట్రాల్లోను మంత్రి మండలి సభ్యుల సంఖ్యను లోక్‌సభ, విధానసభ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదనీ నిర్ణయించారు?
1) 90 వ సవరణ 2) 91వ సవరణ 3) 92వ సవరణ 4) ఏదీ కాదు
జవాబు:2
7.ఒక బిల్లు స్వభావాన్ని బట్టి నిబంధన 110 ప్రకారం బిల్లు సాధారణ బిల్లు లేదా ఆర్థిక బిల్లు అని ఎవరు నిర్ణయిస్తారు
1) రాష్ట్రపతి 2) కేంద్ర ఆర్థిక మంత్రి 3) లోక్‌సభ స్పీకర్‌ 4) అటార్నీ జనరల్‌
జవాబు:3
8.భారత్‌ రాజ్యాంగాన్ని అర్థ సమాఖ్యగా వర్ణించింది? [గ్రూప్2, 2003]
 
1.అంబేడ్కర్ 2.ఐవర్ జెన్నింగ్స్ 3.కేసీ వేర్ 4.ఎవరూ కాదు.
జవాబు:3
9.భారత్ వాస్తవానికి ఒక
1.వాస్తవిక సమాఖ్య వ్యవస్థ 2.అర్థ సమాఖ్య 3.కేంద్రీకృత ధోరణి గల సమాఖ్య 4.రాష్ట్రాల కలయిక
జవాబు:4
రాజ్యాంగం మొత్తం వెతికినా "సమాఖ్య" అనే పదం ఉండదు.ఆర్టికల్ 1, మనదేశాన్ని భారత్ అనీ, భారత్ అంటే రాష్ట్రాల కలయిక అనీ చెప్తుంది
10.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభంధించి రాజ్యాంగంలోని నిభంధనలని ఏవిధంగా సవరించవచ్చు?[సివిల్స్-1997]
1.పార్లమెంటుకు మెజారిటీ సభ్యులు హాజరై వారిలో 2/3 వంతు మెజారిటీతో అమోదించడం
2.మెజారిటీ రాష్ట్ర శాసన వ్య్వస్థలు అమోదించిన పార్లమెంట్ తీర్మానంతో
3.పార్లమెంట్ ఒక్కొక్క సభ సాధారణ మెజారిటితో 
4.పార్లమెంట్ ఒక్కొక్క సభ 3/4 వంతు మెజారిటీతో
జవాబు:3
11.కమ్యూనల్ ఎలెక్టొరేట్ పితామహుడు?
1. లార్డ్‌మింటో 2. చేమ్స్‌ఫర్డు 3.మాంటేంగ్‌ 4.ఎవరూ కాదు
జవాబు:1
1909 మింటో మార్లే సంస్కరణలు ముస్లిం వాళ్ళు ముస్లిం సభ్యులని ఎన్నుకొనే విధానం ని ప్రవేశ పెట్టాయి.
లార్డ్‌మింటో : ఈయన ఈ సంస్కరణల సమయంలో ఇండియాకి వైస్రాయి. అందుకే ఈ పేరు.

12.రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు దీనితో ప్రత్యేక సంభంధం ఉంది
1.మింటో మార్లే 2. క్యాబినెట్ ప్రతిపాదనలు 3. మౌంట్ బాటన్ ప్రతిపాదనలు 4.అట్లి ప్రకటన
జవాబు:2

13.రాష్ట్రపతి/గవర్నర్ పదవిలో ఉండగా నేర విచారణ జరుపరాదని అర్థం ఇచ్చే ఆర్టికల్ ఏది?
1.నేర విచారణకి అందరూ హాజరు కావాల్సిందే 2.ఆర్టికల్ 361 3.ఆర్టికల్ 308 4.ఏదీ కాదు.
జవాబు:2
14.కొత్తసంవత్సరం నాడు ప్రతిజ్ఞ చేసి తెల్లారే మరిచిపోయే "నూతన సంవత్సర నిర్ణయాలవంటివి" ఆదర్శసూత్రాలు అన్నదెవరు?
1.నసీరుద్దీన్ 2.కేటీ షా 3.కేసీ వేర్ 4.ఎవరూ కాదు.
జవాబు:1
15.ప్రాథమిక విధులని ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1.బల్వంతరాయ్ కమిటీ 2.స్వరణ్ సింగ్ కమిటీ 3.సర్కారియా కమీషన్ 4.వాంచూ కమిటీ
జవాబు:2
16.ఆదేశసూత్రాలన్నీ అమలైతే ఈ దేశం భూతల స్వర్గం అవుతుంది అన్నదెవరు.
1.ఎం సీ చాగ్లా 2.అంబేడ్కర్ 3.గంధీ 4.ఎవరూ కాదు.
జవాబు:1

1.రాష్ట్ర కంటిన్‌జెన్సీ నిధి [అనిశ్చయమైన నిధి] ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?
1.ముఖ్యమంత్రి 2.ఆర్థికమంత్రి 3.గవర్నర్ 4.హైకోర్ట్
జవాబు:3

2.లోక్‌సభ అమోదంపొందిన ద్రవ్య బిల్లు ఎన్ని రోజులలోపు రాజ్యసభలో అమోదం పొందాలి?
1.15 2.30 3.28 4.14
జవాబు:4

3.పంచాయితీరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారి ప్రవేశ పెట్టబడింది ఎక్కడ?
1.నాగ్‌పూర్ 2.నాగౌర్ 3. శ్రీకాకుళం 4.జునాగడ్
జవాబు:2

4.స్థానిక ప్రభుత్వ లక్షణాలలో నిజం కానిది ఏది?
1.స్థానిక ప్రభుత్వాలు చట్టబద్ధమైన హోదా కలిగి ఉండాలి
2.ఈ ప్రభుత్వాలు శాసనసభ రూపొందించిన ప్రత్యేక చట్టంద్వారా ఏర్పడతాయి
3.కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ హోదాలకంటే తక్కువ హోదా కలిగి ఉంటాయి.
4.ప్రజలపైన, సంస్థలపైనా దావా చేయడానికి అధికారం కలిగి ఉంటాయి
జవాబు:4

5.61వ రాజ్యాంగ సవరణ జరిగిన సమయంలో భారత్ ప్రధానమంత్రి ఎవరు?
1.ఇందిరాగాంధి 2.రాజివ్ గాంధి 3.పీవీ నరసిమ్హారావు 4.మొరార్జీ దేశాయ్
జవాబు:2
61వ సవరణ ద్వారా, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వయొజన ఓటుహక్కు వయస్సుని 18 తగ్గించారు.

6.చీఫ్ ఎలక్షన్ కమీషనర్
1.పార్లమెంట్ చే ఎన్నుకోబడతాడు 2.ప్రధానిచే నియమించబడతాడు 3.రాష్ట్రపతిచే నియమించబడతాడు 4.కేంద్ర హోం మంత్రిచే నియమించబడతాడు
జవాబు:3

7.రాష్ట్ర సంక్షోభ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు?
1.చీఫ్ సెక్రెటరి 2.చీఫ్ మినిస్టర్ 3.ఫైనాన్స్ మినిస్టర్ 4.ఫైనాన్స్ సెక్రెటరీ
జవాబు:1


8.
 "యు మే హావ్ ద బాడీ"/మనిషిని కోర్ట్ ముందు హాజరు పరచు అనేది ఏది?
1.హెబియస్ కార్పస్ 2.మాండమస్ 3.కో-వారంటో 4.సర్షియారో
జవాబు:1

9.స్వతంత్ర్య భారత్ 2వ రాష్ట్రపతి?
1.ఎస్.రాధాకృష్ణ 2.జాకిర్ హుస్సేన్ 3.హిదయతుల్లా 4.వెంకటగిరి
జవాబు:1

10.భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని వర్ణించింది ఎవరు?
1.కేసీ వేర్ 2.కేటీ షా 3.డీఎన్ బెనర్జీ 4.అంబేడ్కర్
జవాబు:3


11.భారత రాజ్యాంగం సమాఖ్య నమూనాని ఏ దేశం నుండి గ్రహించింది?
1.ఇంగ్లాండ్ 2.ఐర్లాండ్ 3.కెనడా 4.అమెరికా
జవాబు:3
ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీస్ కమీషన్ "డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్" ఎక్సాంలో అడిగిన ప్రశ్న.ఏపీపీఎస్సీ జవాబు3 కే మార్కులు ఇచ్చింది.
సమాఖ్యని ఇటు అమెరికా నుండి, అటు కెనడా[బలమైన ఏకకేంద్ర లక్షణాలున్న సమాఖ్య] నుండి కూడా తీస్కున్నారు . మన వ్యవస్థ అమెరికాకి దగ్గరగా లేదు.
అధికార విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగినప్పటికీ కేంద్రానికే ఎక్కువ అధికారాలున్నాయి [99]. ఇటు ఉమ్మడి జాబితాలో కూడా కేంద్రందే పైచేయి. 249 ఆర్టికల్ ప్రకారం కొన్ని సంధర్భాలలో రాష్ట్ర జాబితా పైన శాసనాలు చేసే ధికారం కూడా కేంద్రంకి ఉంది. అందుకే కేసీ వేర్ భారత రాజ్యాంగాన్ని అర్థసమాఖ్యగా వర్ణించాడు. అయితే కేంద్రం ' రాజ్యాంగ చట్ట పరిధిలో ' వ్యవహరించినపుడు అనేక సంధర్భాలలో రాష్ట్రప్రభుత్వాలమీద ఆధారపడి వాటి సహకారం కోరాలి. అందుకే ప్రొఫెసర్ డీఎన్ బెనర్జీ రాజ్యాంగాన్ని "సహకార సమాఖ్య" అన్నాడు.

12.స్థానిక ప్రభుత్వాలని ఏ జాబితాలో చేర్చారు?
1.ఉమ్మడి 2.కేంద్ర 3.రాష్ట్ర 4.ఏదీ కాదు
జవాబు:3

13.లోక్‌సభ స్పీకర్ ఏ రకమైన ప్రశ్నలకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు?
1.నక్షత్ర మార్క్ 2.నక్షత్రం గుర్తు లేనివి 3.స్వల్ప వ్యవధి 4.ఉపప్రశ్నలు
జవాబు:3

14.రాజ్యాంగసభ మొదటి సమావేశం జరిపిన ప్రాంతం?
1.ముంబాయ్ 2.కోల్‌కత 3.లాహోర్ 4.న్యూఢిల్లీ
జవాబు: 4

15."లిబర్టి, ఈక్వాలిటి, ఫ్రటర్నిటి" అనే పదాలు పీఠికలో చేర్చడానికి మూలం? [స్వేచ్చ,సమానత్వం,సౌభాభృత్వం]
1.రష్యన్ విప్లవం 2.ఫ్రెంచ్ విప్లవం 3.అమెరికా విప్లవం 4.1935 భారత ప్రభుత్వ చట్టం
జవాబు:2

16.రాజ్యాంగంలో "సామ్యవాదం" అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినప్పుడు భారత ప్రధానిగా ఎవరున్నారు?
 
1.జవహర్‌లాల్ నెహ్రూ 2.ఇందిరా గాంధీ 3.రాజీవ్ గాంధీ 4.మొరార్జీ దేశాయ్
జవాబు:2


17.
 న్యాయసమీక్షాధికారం [శాసన సభ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే రద్దు చేసే అధికారం] ఏ దేశపు రాజ్యాంగం నుండి గ్రహించారు??
1.అమెరికా 2.రష్యా 3.భారత రాజ్యాంగం-1935 4.కెనడా
జవాబు:1


18.
 "మనదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం ఉండదు" దీని అర్థం మన దేశం..?
1.గణతంత్ర్య దేశం 2.లౌకిక రాజ్యం 3.సార్వభౌమాధికారం కలిగిన దేశం 4.సామ్యవాద దేశం
జవాబు:3

19.రాజ్యాంగంలో 'మౌళిక స్వరూపం మారకుండా సవరణలు చేయొచ్చు' అనే అంశంతో సంభంధం ఉన్న కేసు? [రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా 368 అధికరణం ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగమైనా మార్చే అధికారం భారత పార్లమెంటుకు ఉంది]

1.గోలక్‌నాథ్‌ 2.కేశవానంద భారతి 3.మినర్వామిల్స్‌ 4.ఇందిరాసహానీ
జవాబు:2


20.
 రాజ్యాంగానికి ముందుమాట?
1.ప్రియాంబుల్ 2.సివిల్ రేట్స్ 3.సివిల్ డ్యూటీస్ 4.డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ
జవాబు:1

21."భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, _____, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యంగా నిర్మించుకోవడానికి.."
పైన ఇచ్చిన ఖాళీ ని పూరించేది కింది వాటిలో ఏది?
1.సమాఖ్య 2.లౌకిక 3.సామాజిక 4.అర్థ సమాఖ్య
జవాబు:2


22.
 1946 డిసెంబర్‌ 13న రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ ప్రవేశ పెట్టిన ఆశయాల తీర్మానమే రాజ్యాంగపరిషత్‌ అమోదం పొందిన తర్వాత [1947, జనవరి 22న] ఇలా పిలవబడుతుంది.
1.ఆదేశిక సూత్రాలు 2.పౌర విధులు 3.ప్రవేశిక 4.పౌర హక్కులు
జవాబు:3

23.రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకూ జరిగిన "సవరణలు/అమెండ్మెంట్స్ ఎన్ని?
1.సున్నా 2.ఒకే ఒక్క సవరణ 2.మూడు 4.రెండు
జవాబు:2


24.ఒక రాష్ట్ర గవర్నర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు గవర్నర్‌గా వ్యవహరించవచ్చు అని ఏ రాజ్యాంగ స వరణ తెలుపుతుంది ?
1. 1వ రాజ్యాంగ సవరణ 2. 7వ రాజ్యాంగ సవరణ 3. 21వ రాజ్యాంగ సవరణ 4. 42వ రాజ్యాంగ సవరణ
జవాబు:2
ఆర్టికల్ 153 ప్రతిరాష్ట్రానికీ ఒక గవర్నర్ ఉండాలని చెప్తుంది. 7వ సవరణ ద్వారా ఒక గవర్నర్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్ గా ఉండొచ్చు.

25.84వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ సంవత్సరం వరకు ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పు చేయరాదు
1) 2016 2) 2036 3) 2026 4) 2046
జవాబు:3


1. భారత్ రాజ్యంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విద్యుక్త అంశాలున్నాయి?
1)29 2)18 3)26 4)28
ఇది 2008 గ్రూప్2 లో అడిగిన ప్రశ్న.
జవాబు:1)29

2. క్విటిండియా ఉద్యమం నాటి వైస్రాయ్ ఎవరు?
1.లిన్లిత్‌గో   2.డల్‌హౌసీ  3.మౌంట్ బేటన్  4.వేవెల్
జవాబు: 1.లిన్లిత్‌గో

3. "లిబర్టి, ఈక్వాలిటి, ఫ్రటర్నిటి" అనే పదాలు పీఠికలో చేర్చడానికి మూలం? [స్వేచ్చ,సమానత్వం,సౌభాభృత్వం]
1.రష్యన్ విప్లవం 2.ఫ్రెంచ్ విప్లవం 3.అమెరికా విప్లవం 4.1935 భారత ప్రభుత్వ చట్టం
జవాబు:2

4. బ్రిటన్‌లో ఏ తరహా ప్రభుత్వం ఉంది?
1.ఏక కేంద్ర 2.సమాఖ్య 3.ఏక కేంద్ర,సమాఖ్య 4.ఏదీ కాదు.
జవాబు:1

5. "The Indian Constitution, Cornerstone of a Nation" రాసింది ?
1.ఐవర్ జెనింగ్స్ 2.ఏ ఓ హ్యూమ్‌స్ 3.ఎం ఎన్ రాయ్ 4.ఎవరూకాదు
జవాబు:4
గ్రాన్విల్ ఆస్టిన్

6. సమాఖ్య ప్రభుత్వ లక్షణాలలో కిందివాటిలో తప్పుగా జతచేయబడింది ఏది?
1.కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన 2.ద్విసభా విధానం 3.ధృఢమైన రాజ్యాంగ సవరణ విధానం 4. కేంద్ర, రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం
జవాబు:4

7. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు?
1.బాబూ రాజేంద్రప్రసాద్ 2.బీ ఎన్ రావ్ 3.H C ముఖర్జీ 4.జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:3

8. భారత ఉపరాష్ట్రపతి ఎవరిద్వారా ఎన్నుకోబడతాడు?
1.లోక్‌సభ, రాజ్యసభ సభ్యులచేత 2.రాష్ట్రపతి చేత 3.లోక్‌సభ సభ్యులచేత 4.రాజ్యసభలో అధిక మెజారిటీ ఉంటే చాలు.
జవాబు:1

9. భారత్ పార్లమెంట్ ఆర్థిక సంఘం ఏది?
1.గవర్న్‌మెంట్ అస్ష్యూరెన్స్ కమిటీ 2.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 3.లైబ్రరీ కమిటీ 4.ఏదీ కాదు
జవాబు:2

10. కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు?
1.పులికాట్ 2.రామప్ప 3.హంసల సరస్సు 4.కొల్లేరు
జవాబు:4

11."గట్టి బ్రేకులుండి ఇంజన్ లేని మిషిన్" అని నెహ్రూ తీవ్రంగా విమర్శించినది దేనిని?
1.క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2.వేవెల్ ప్రణాళిక 3.1935 భారత ప్రభుత్వ చట్టం 4.మౌంట్‌బేటన్ ప్లాన్
జవాబు:3



1.అంటరానితనం నిషేధం అని తెలిపే ఆర్టికల్?
1)17 2) 19 3)23 4)24
జవాబు:1


2. 
జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని రాజ్యాంగ పరిషత్‌ అమోదించిన తేదీ?
1. 1950 జనవరి 24 2. 1947 ఆగస్టు 15 3. 1950 జనవరి 26 4.1947జనవరి 22
జవాబు:1


3.
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఓటు హక్కుకు కావాల్సిన కనీస వయస్సు?
1.16 2.18 3.21 4.25
జవాబు:2


4.
"భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం" అన్నదెవరు?
1.గాన్‌విల్‌ఆస్టిన్‌ 2. ఐవర్‌ జిన్నింగ్‌ 3. ఠాకుర్‌దాస్‌ భార్గవ్‌ 4. కామత్‌
జవాబు:2

5. ఆర్టికల్ 14 దేనికి సంభంధించింది?
1.చట్టం ముందు సమానత్వం 2.మతస్వేచ్ఛ హక్కు 3.సాంస్కృతిక మరియు విద్యాహక్కు 4.రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:1

6. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
1.సుప్రీంకోర్ట్ జడ్జ్ 2.రాష్ట్రపతి 3.ముఖ్యమంత్రి 4.గవర్నర్
జవాబు:4

7. గవర్నర్ న్యాయాధికారాలకి [రాష్ట్రస్థాయిలో న్యాయస్థానాలు] సంభంధించి సరికానిది ఏది?
1.శిక్షలను తగ్గించవచ్చు
2.క్షమాభిక్ష ప్రసాదించవచ్చు
3.శిక్షను రద్దు చేయవచ్చు
4.ఉరిశిక్షను రద్దు చేయవచ్చు
జవాబు:4

8. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తారు
1. ఆర్టికల్ 155 2.ఆర్టికల్ 125 3.ఆర్టికల్ 133 4.ఆర్టికల్ 364
జవాబు:1


9. 
1956లో రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించిన రాజ్యాంగ సవరణ?
1. 4వ సవరణ 2. 7వ సవరణ 3. 8వ సవరణ 4. 11వ సవరణ
జవాబు:2

10.రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఓటు హక్కుకు కావాల్సిన కనీస వయస్సు?
1.16 2.18 3.21 4.25
జవాబు:3


11."భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం" అన్నదెవరు?
1.గాన్‌విల్‌ఆస్టిన్‌ 2. ఐవర్‌ జెన్నింగ్స్ 3. ఠాకుర్‌దాస్‌ భార్గవ్‌ 4. కామత్‌
జవాబు:2

12.జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని రాజ్యాంగ పరిషత్‌ అమోదించిన తేదీ?
1. 1950 జనవరి 24 2. 1947 ఆగస్టు 15 3. 1950 జనవరి 26 4.1947జనవరి 22
జవాబు:1

13.అంటరానితనం నిషేధం అని తెలిపే ఆర్టికల్?
1)17 2) 19 3)23 4)24
జవాబు:1

14.ఆర్టికల్ 14 దేనికి సంభంధించింది?
1.చట్టం ముందు సమానత్వం 2.మతస్వేచ్ఛ హక్కు 3.సాంస్కృతిక మరియు విద్యాహక్కు 4.రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:1

15.రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
1.సుప్రీంకోర్ట్ జడ్జ్ 2.రాష్ట్రపతి 3.ముఖ్యమంత్రి 4.గవర్నర్
జవాబు:4

17.గవర్నర్ న్యాయాధికారాలకి [రాష్ట్రస్థాయిలో న్యాయస్థానాలు] సంభంధించి సరికానిది ఏది?
1.శిక్షలను తగ్గించవచ్చు
2.క్షమాభిక్ష ప్రసాదించవచ్చు
3.శిక్షను రద్దు చేయవచ్చు
4.ఉరిశిక్షను రద్దు చేయవచ్చు
జవాబు:4

18.ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తారు
1. ఆర్టికల్ 155 2.ఆర్టికల్ 125 3.ఆర్టికల్ 133 4.ఆర్టికల్ 364
జవాబు:1

19.1956లో రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించిన రాజ్యాంగ సవరణ?
1. 4వ సవరణ 2. 7వ సవరణ 3. 8వ సవరణ 4. 11వ సవరణ
జవాబు:2

20. "లిబర్టి, ఈక్వాలిటి, ఫ్రటర్నిటి" అనే పదాలు పీఠికలో చేర్చడానికి మూలం? [స్వేచ్చ,సమానత్వం,సౌభాభృత్వం]
1.రష్యన్ విప్లవం 2.ఫ్రెంచ్ విప్లవం 3.అమెరికా విప్లవం 4.1935 భారత ప్రభుత్వ చట్టం
జవాబు:2

21.బ్రిటన్‌లో ఏ తరహా ప్రభుత్వం ఉంది?
1.ఏక కేంద్ర 2.సమాఖ్య 3.ఏక కేంద్ర,సమాఖ్య 4.ఏదీ కాదు.
జవాబు:1

22."The Indian Constitution, Cornerstone of a Nation" రాసింది ?
1.ఐవర్ జెనింగ్స్ 2.ఏ ఓ హ్యూమ్‌స్ 3.ఎం ఎన్ రాయ్ 4.ఎవరూకాదు
జవాబు:4
గ్రాన్విల్ ఆస్టిన్

23.సమాఖ్య ప్రభుత్వ లక్షణాలలో కిందివాటిలో తప్పుగా జతచేయబడింది ఏది?
1.కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన 2.ద్విసభా విధానం 3.ధృఢమైన రాజ్యాంగ సవరణ విధానం 4. కేంద్ర, రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం
జవాబు:4

24.రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు?
1.బాబూ రాజేంద్రప్రసాద్ 2.బీ ఎన్ రావ్ 3.H C ముఖర్జీ 4.జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:3

25.భారత్ పార్లమెంట్ ఆర్థిక సంఘం ఏది?
1.గవర్న్‌మెంట్ అస్ష్యూరెన్స్ కమిటీ 2.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 3.లైబ్రరీ కమిటీ 4.ఏదీ కాదు
జవాబు:2












No comments:

Post a Comment