1.బుద్ధుడు, మహావీరుడూ ఇద్దరూ సమకాలికులే. బుద్ధుడు BC 563 లో పుడితే మహావీరుడు 540 BC లో పుట్టాడు.
2.ఇద్దరూ పుట్టుకతో అత్యంత ధనవంతులు!
3.ఇద్దరికీ ఒకే భార్య .బుద్ధుడి కుమారుడు "రాహుల్" లేదా "రాహుల". మహావీరుడుకి మాత్రం కుమార్తె. మహావీరుడి మొదటి శిష్యుడు ఈయన అల్లుడే [పేరు జమేలి]
4.బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు, జ్ఞానం పొంది బుద్దుడైనాడు. మహావీరుడు వర్థమానుడు, జ్ఞానంపొంది జీనుడు/తీర్థంకరుడు అయినాడు.
5.బుద్ధమతంలో శాఖలు =2 హీనయానం, మహాయానం. జైనమతంలోనూ శాఖలు = 2 శ్వేతాంబర [వైట్ డ్రెస్], దిగంబర [దిగంబర=దిక్కులనే అంబరముగా చేస్కున్నవాడు]
6.బుద్ధుడు 35వ యేట జ్ఞానం పొందాడు, మహావీర కొంచెం లేటు వయసులో 42వ యేట జ్ఞానం పొందాడు.
1.బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థ, మహావీరుడి నాన్న పేరు సిద్ధార్థ
2.బుద్ధుడి భార్య పేరు యశోధర, మహావీరుడి భార్య పేరు యశోధ
3.బుద్ధుడు 29వ యేట మోక్షం కోసం ఇల్లువదిలివెళ్ళాడు, మహావీర 30 వ యేట ఇల్లు వదిలాడు
4.బుద్ధుడు తన సన్యాస జీవితంలో "అలార కలామ" అనే వ్యక్తి దగ్గర తపస్సు రహస్యాలు తెలుసుకున్నాడు, ఇతడే ఈయన గురువు. మహావీర తన సన్యాసజీవితంలో 'మఖలి గోసల" తో గడిపాడు ఇతను ఈయన గురువు కాకపోయినా "అజీవక శాఖ" అని ఒక శాఖ స్థాపించి చాలా మందికి గురువు అయ్యాడు.
5.బుద్ధుడు నిరంజన నదీ ఒడ్డున, రావిచెట్టుకింద జ్ఞానంపొందాడు.మహావీర రజపాలిక నదీ ఒడ్డున జ్ఞానం పొందాడు.
6.బుద్ధుడు 80వ యెట కుశీనగరంలో [ఉత్తరప్రదేశ్] శరీరత్యాగం చేశాడు. మహావీర 72వ యేట పావాపురి [బీహార్] లో శరీరత్యాగం చేశాడు.
7.బుద్ధుడు ఎన్నో జన్మలు ఎత్తాడు, బుద్దుడైనాడు.. ఇక జన్మలు లేవు..మహావీర 24వ తీర్థకరుడు.. ఈయనా చివరివాడే, 25వ తీర్థకరుడు ఎవరూ లేరు.
8.బౌద్ధమత పవిత్రగ్రంధం = "త్రిపీఠకాలు", జైన మతానికి పవిత్రగ్రంథం గా "కల్పసూత్ర" ని చెప్తారు.
9.బౌద్ధ కౌన్సిల్స్ 4 జరిగాయి. జైన కౌన్సిల్స్ 2 మాత్రమే


No comments:
Post a Comment