2.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎమ్) కి సంభంధిచిన అవాస్తవం ఏది?
1.ఇది విపత్తుల కారణంగా దేశ జిడిపిపై ప్రభావం, దేశ సామాజిక ఆర్థిక జీవనం వంటి అంశాలపై పరిశోధనలు చేస్తోంది
2.విపత్తు నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది
3.విపత్తు నిర్వహణ చట్టం(2005) కింద దీన్ని ఏర్పాటు చేశారు
4.మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ & ఫారెస్ట్స్ డిపార్ట్‌మెంట్లలో ఒకటి
జవాబు:4
NDMA హోం మంత్రిత్వ శాఖ యొక్క ఏజెన్సీ
6.స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి ఎవరు?
1.మౌలానా అబ్దుల్ 2.పటేల్ 3.అంబేడ్కర్ 4.ఎవరూ కాదు
జవాబు:3
7.ఛత్తీస్‌గడ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేముందు ఏ రాష్ట్రంలో అంతర్భాగం?
1.బీహార్ 2.మధ్యప్రదేశ్ 3.గుజరాత్ 4.ఏదీ కాదు
జవాబు:2
8.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేముందు ఏ రాష్ట్రంలో అంతర్భాగం?1.బీహార్ 2.మధ్యప్రదేశ్ 3.గుజరాత్ 4.ఏదీ కాదు
జవాబు:1
11.ఒక ఎకరానికి ఎన్ని గజములు?
1.4800 2.4840 3.8440 4.ఏదీ కాదు
జవాబు:2
1 ఎకరం = 4840 స్క్వేర్ యార్డ్స్
గజం అంటే ఒక " స్క్వేర్ యార్డ్" [ఒక స్క్వేర్ యార్డ్ = 9 స్క్వేర్ ఫీట్ ]
12.సౌత్ రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?1.సికిందరాబాద్ 2.చెన్నై 3.యశ్వంతపూర్ 4.ఏదీ కాదు
జవాబు: 2
16 రైల్వే జోన్స్ ఉన్నాయి .
సౌత్ సెంట్రల్ రైల్వే = సికిందరాబాద్సౌత్ ఈస్ట్ సెంట్రల్ = బిలాస్పూర్
సౌత్ వెస్టర్న్ = హుబ్లి
13."ఝెంద్ అవెస్తా" మతగ్రంధం రాసింది? [రచయిత పేరు మీదుగానే ఈ మతం పేరు. ఈ పుస్తకం వాళ్ళ పవిత్ర గ్రంథం.]1.జొరాస్టర్ 2.కన్‌ఫ్యూజియస్ 3.లావోట్జి 4.ఏదీ కాదు
జవాబు:1
14.ప్రపంచయుద్దం-1 లో రష్యా ఎవరికి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల కూటమిలో చేరింది?1.జర్మనీ 2.చైనా 3.జపాన్ 4.ఏదీ కాదు
జవాబు:1
18.చిప్కో ఉద్యమాన్ని మొదలుపెట్టింది?[చిప్కో అంటే అతుక్కోవటం. ఈ ఉద్యమంలో అర్థం కౌగిలించుకో అని. పరిశ్రమల స్థాపనకి చెట్లు నరకడం కి వ్యతిరేక ఉద్యమం ఇది.]
1.సుందర్‌లాల్ బహుగుణ 2.వినొభా భావే 3.నెల్సన్ మండేలా 4.క్లింటన్
జవాబు:1
24.సత్యార్థ్ ప్రకాష్ రచయిత?1.స్వామీ వివేకానంద 2.స్వామీ రామా 3.స్వామీ దయానంద 4.ఎవరూ కాదు
జవాబు:3
1."ప్రపంచంలో ప్రజాస్వామ్య పరిరక్షణకోసం" అని జర్మనీ పైన యుద్దం చేసిన దేశం?1.ఆస్ట్రియా 2.డెన్మార్క్ 3.హంగరీ [హంగేరి అని రాస్తారు] 4.అమెరికా
జవాబు:4
2.నేపాల్ కరెన్సీ ఏంటి? [మన ఇక్కడి 100 రూపాయల విలువ నేపాల్ లో 160 రూపాయలు]
1.నేపాలీస్ రూపీ 2.నేపాలీస్ యెన్ 3.నేపాలీస్ 4.నేపాలీ రియల్
జవాబు:1
3.భారత్‌లోని మొదటి మున్సిపల్ కార్పొరేషన్?
1.బెంగళూరు 2.మద్రాస్ 3.ముంబాయ్ 4.కొల్‌కత
జవాబు: 2
4.
రెయిన్‌బో విప్లవం దేనికి సంభంధించింది?1.కృత్రిమ వర్షం 2.వ్యవసాయ రంగం 3.పారిశ్రామిక రంగం 4.ఐటీ రంగం
జవాబు: 2
8.
ముల్ళ పెరియార్ డ్యాం సమస్య ఏ రష్ట్రాలది?1.తమిళనాడు-కేరళ 2.తమిళనాడు కర్ణాటక 3.కర్ణాటక-తమిళనాడు 4.కర్ణాటక-కేరళ
జవాబు:1
11.దేని తయారీలో కలపని[వుడ్] ముడిపదార్థంగా వాడతారు?
1.గన్‌పౌడర్ 2.ఇంక్ 3.కాగితం 4.రంగు
జవాబు:3
12.అణుశక్తి విభాగం ఎవరి నియంత్రణలో ఉంటుంది? [డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ]
1.ప్రధానమంత్రి 2.రాష్ట్రపతి 3.క్యాబినెట్ సచివాలయం 4.శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
జవాబు:1
13.బిగ్ ఆపిల్ గా పిలవబడే నగరం?
1.టోక్యో 2.లండన్ 3.న్యూయార్క్ 4.పారిస్
జవాబు:3
14.ప్రపంచంలో అతిపెద్ద "ద్వీపకల్పం"
1.బజ కాలిఫోర్నియా 2.అరేబియా 3.హార్న్ ఆఫ్ ఆఫ్రికా 4.దక్షిణ భారత్
జవాబు:2
15.
శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఏ రంగానికి చెందింది?1.జర్నలిజం 2.దూరదర్శన్ 3.శాంతి 4.శాస్త్ర సాంకేతికత
జవాబు:4
16.భారత్‌లో "నల్లవిప్లవం" [బ్లాక్ రివొల్యూషన్] దేనికి సంభంధించింది? [చాలా దేశాల్లో చాలా బ్లాక్ రివొల్యూషన్స్ ఉన్నాయ్.]
1.నూనె గింజలకి 2.పెట్రోల్/క్రూడ్ ఆయిల్ 3.ఎడిబుల్ ఆయిల్స్ 4.బొగ్గు ఉత్పత్తికి
జవాబు:2
17.నీతిశాస్త్రం రచించింది?1.అగస్త్య 2.మారన 3.కేతన 4.రుద్రదేవుడు
జవాబు: 4
18."నాషనల్ క్రైసిస్ మానెజ్మెంట్ కమీషన్" అధిపతి?1.ప్రధానమంత్రి 2.దేశీయాంగ 3.ఆర్థిక మంత్రి 4.క్యాబినెట్ కార్యదర్శి
జవాబు: 4
19.కిందివాటిలో కర్ణాటక సంగీత రూపం కానిది? [ఏపీపీఎస్‌సీ 2011]1.శ్లోకం 2.థిల్లానా 3.కీర్తి 4.తప్ప
జవాబు: 4
20.భారత్‌లో విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1.2003 2.2004 3.2005 4.2006
జవాబు:3
21.బాంబే స్టాక్ఎక్సేంజ్ ఎప్పుడు స్థాపించబడింది?
1.1875 2.1975 3.1948 4.1848
జవాబు:1
ఇటీవల ఇది 140 వసంతాలు పూర్తిచేస్కున్నది.
21.గాలిలోని తేమను కొలిచేందుకు ఉపయోగించే సాధనం?1) థర్మా మీటరు 2) బారోమీటరు3) హైడ్రోమీటరు 4) హైగ్రో మీటరు
జవాబు:4
22.NREGA [2005-06] ఎప్పటినుండి MGNREGS గా పిలవబడుతుంది?[మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం]
1.2007 2.2008 3.2009 4.ఏదీకాదు
జవాబు: 3
23.వేదాంగాలలో ఒకటైన "నిరుక్త" దేన్ని వివరిస్తుంది?
1.కర్మకాండలు 2.వ్యాకరణం 3.శబ్దాలు 4.ఛందస్సు
జవాబు: 3
25.జాతీయ సుపరిపాలనాదినం ఏది? [నాషనల్ గుడ్ గవర్నెన్స్ డే- ఇది వాజ్‌పేయి జన్మదినం]
1.జనవరి12 2.డిసెంబర్ 25 3.ఫిబ్రవరి14 4.ఏదీ కాదు.
జవాబు:2
1.లూనీ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?1.బిహార్ 2.ఉత్తర్‌ప్రదేశ్ 3.పంజాబ్ 4.రాజస్తాన్
జవాబు:4
2.
విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది?1.తిరువనంతపూర్,కేరళ 2.శ్రీహరికోట, నెల్లూర్ 3.అలహాబాద్, ఉత్తర్‌ప్రదేశ్ 4.యెంలూరు, బెంగళూరు
జవాబు:1
3."స్ట్రేంజర్" గ్యాస్ ఏది? [విచిత్రప్రవర్తన గలది]
1.నైట్రస్ ఆక్సైడ్ 2.గ్ఝినాన్ 3.నియాన్ 4.హీలియం
జవాబు:2
4.సెంటిగ్రేడ్ మరియు ఫారన్‌హీట్ ప్రమాణాలు రెండూ ఒకె రీడింగ్‌ని ఏ డిగ్రీల వద్ద చూపుతాయి?1.-32డిగ్రీలు 2.-40డిగ్రీలు 3.0డిగ్రీలు 4.101డిగ్రీలు
జవాబు:2
5.1బ్యారెల్ క్రూడ్ ఆయిల్ దేనికి సమానం? [దాదాపుగా] [APPSC-2012 A/C]
1.159 లీటర్స్ 2.100లీటర్స్ 3.1000లీటర్స్ 4.500 లీటర్స్
జవాబు:1
6.
ఆడి [Audi] అనే కార్ల తయారీ సంస్థ ఏ దేశానికి చెందింది?1.కొరియా 2.ఫ్రాన్స్ 3.అమెరికా 4.జర్మనీ
మనం చూసే అన్ని ఖరీదైన, ద బెస్ట్ అని చెప్పగలిగిన కార్ల సంస్థలన్నీ జెర్మనీ వాళ్ళవే.
జవాబు: 4
Audi
BMW
Ford Germany
Mercedes-Benz
Opel
Porsche
Volkswagen etc
7.భారతదేశ కంప్రోట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు?
1.వినోద్ రాయ్ 2.వినోద్ మెహతా 3.శశికాంత్ శర్మ 4.నరహరి రావ్
జవాబు: 3
8.ఇటీవల లింకా బుక్ ఆఫ్ రెకార్డ్స్ లో భాజపా పార్టీకి చెందిన ఏ నాయకురాలి పేరు నమోదు అయింది? [వరుసగా 8 సార్లు ఒకే పార్టీ టిక్కెట్ పై అదే లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన ఏకైక మహిళగా]
1.సుమిత్రా మహాజన్ 2.సుష్మా స్వరాజ్ 3.స్మృతి ఇరాని 4.మనెక సంజయ్ గాంధీ
జవాబు:1
2015 ఫిబ్రవరి మొదటి వారంలో లోక్ సభ స్పీకర్ పేరు లింకా బుక్‌లో పైన చెప్పిన కారణం వల్ల రికార్డ్ అయ్యింది. ఈమెది ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం
9.27వ మైసూర్ మహారాజుగా ఇటీవల పట్టభిషేకం పొందిన 'వొడెయర్' రాజవంశపు రాజు ఎవరు?
[వొడయర్ రాజవంశం 1399 నుండి 1947 వరకు మైసూరు రాజ్యంను పాలించింది. ఈ వంశంలో ఆఖరి రాజు జయచామరాజేంద్ర వడయార్. అతను 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు పాలించాడు]
1.యదువీర్ కృష్ణదత్త చామరాజ 2.శ్రీకంఠదత్త నరసింహరాజ 3. ఆది యదురాజ వొడెయర్ 4.తిమ్మరాజ వొడెయర్
[స్వతంత్య్ర భారత్‌లో ఈ పట్టాభిషేక కార్యక్రమం ప్యాలెస్‌కు సంబంధించిన వ్యవహారంగా కొనసాగుతూ వస్తుంది. 2013లో రాజు మరణం తర్వాత ఇతనికి పట్టభిషేకం జరిగింది. ఈ పట్టభిషేక కార్యక్రామన్ని మైసూర్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకంటే 41 సంవత్సరాల తర్వాత యువరాజు పట్టభిషేకం జరిగింది.కొందరు మైసూర్‌లో పుట్టినా కూడా వాళ్ళ జీవితంలో ఒకసారి అయినా పట్టభిషేకం చూడని వాళ్ళు ఉంటారు]
జవాబు:1
10.భారత్‌లో ఎక్కువ వరదలు ఈ నది వల్ల సంభవిస్తున్నాయి1.కావేరి 2.గోదావరి 3.బ్రహ్మపుత్ర 4.గోమతి
జవాబు:3
11.
ధ్వని కిందివాటిలో ఏ మార్గం ద్వారా తొందరగా ప్రయాణిస్తుంది.1.స్టీల్ 2.శూన్యం 3.గాలి 4.నీరు
జవాబు:1
12.సిలికోసిస్ అనేది
1.నరాలకి సంభంధిచిన వ్యాధి
2.మూత్రపిండాలకి సంభంధిచిన వ్యాధి
3.ఊపిరితిత్తులకి సంభంధిచిన వ్యాధి
4.రక్తానికి సంభంధిచిన వ్యాధి
జవాబు:3
సన్నటి ఇసుక గాలిద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల కలిగే వ్యాధే 'సిలికోసిస్'. సాధారణంగా ఇల్లుకట్టే కూలీలలో, ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగంలో పనిచేసేవారికి, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి గురైన వారి ఊపిరితిత్తులు వాచి గట్టిపడతాయి
13.వాతావరణ మార్పులు ఎక్కువ ఎక్కడ జరుగుతాయి
1.స్ట్రాటోస్పియర్ 2.ట్రోపోస్పియర్ 3.మీసోస్పియర్ 4.ఎక్సోస్పియర్
జవాబు:2
ఉన్న వాతావరణం అంతా ఇక్కడే ఉంది
14.నాషనల్ డిజాస్టర్ మానెజ్‌మెంట్ చట్టం-2005 వల్ల నియమించబడినది ఏది?1.డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 2.డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ 3.NIDM మరియు NDRF 4.అన్నీ
జవాబు:4
15.అజంతా చిత్రాల్లో వర్ణించిన కథలు?1.రామాయణం 2.మహాభారతం 3.జాతకకథలు 4.పంచతంత్రం
జవాబు:3
16.కార్బెట్ నాషనల్ పార్క్ ఎక్కడుంది?1.తెలంగాణా 2.చత్తీస్గడ్ 3.ఉత్తరాఖండ్ 4.మధ్యప్రదేశ్
జవాబు:3
భారత్‌లోని గొప్ప పురాతనమైన పార్క్ ఇది.జిమ్ కార్బెట్ టైగర్ రిసర్వ్ అని కూడా పిలుస్తారు
17.ఆసియాఖండంలో మొదటిసారి నోబుల్ బహుమతి పొందింది ఎవరు? UPSC, Aug-151.హరబిందో ఖురానా 2.సీవీ రామన్ 3.రబీంద్రనాథ్ ఠాగోర్ 4.మదర్ థెరిసా
జవాబు:3
18.క్వాంటస్ [QANTAS] అను అంతర్జాతీయ విమానసంస్థ ఏదేశానికి చెందింది? UPSC, Aug-151.బెల్జియం 2.జెర్మని 3.ఆస్ట్రేలియా 4.స్పైన్
జవాబు:3
19.50వ జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత ఎవరు?
1.కేదర్‌నాథ్ సింగ్ 2.బాలచంద్ర నెమడె 3.రావూరి భరద్వాజ 4.చంద్రశేఖర కంబార
జవాబు:2
20.
కింద ఉన్న కొన్ని సంస్థలని పరిశీలించండి.A.సార్క్ B.అపెక్ C.ఆసియాన్ D.బ్రిక్
పైన ఉన్న సంస్థలలో భారత్‌కి దేనిలో సభ్యత్వం లేదు?
1.A&B 2.B&D 3.A&D 4.B&C
జవాబు:4
21.SAARC /సార్క్ లో ఉన్న సభ్యదేశాల సంఖ్య?1.6 2.7 3.8 4.ఏదీ కాదు.
జవాబు:3
22.ప్రస్తుత యూపీఎస్‌సీ చైర్మన్ ఎవరు?1.దీపక్ గుప్తా 2.రఝ్ని రఝ్దన్ 3.వినయ్ మిట్టల్ 4.అల్క సిరోహి
జవాబు:1
23.ఆధార్ గుర్తింపుకార్డులో ఎన్ని డిజిట్స్ ఉంటాయి?1.9 2.10 3.12 4.15
జవాబు:3
24.నానాజాతి సమితి రూపకర్త ?
1.రూజ్‌వెల్ట్ 2.లెనిన్ 3.ఉడ్రో విల్సన్ 4.కెన్నడీ
జవాబు:3
25.ఆగష్ట్ 29ని "నాషనల్ స్పోర్ట్స్ డే " గా ఎవరికి గుర్తుగా జరుపుకుంటాం?1.ధ్యాన్ చంద్ 2.మిల్కా సింగ్ 3.సీకే నాయుడు 4.విల్సన్ జోన్స్
జవాబు: 1
1.భారత్‌లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టబడింది?1.1835 2.1935 3.1938 4.1858
జవాబు:1
2.INSAT అంటే?
1.ఇంటర్నాషనల్ సాటిలైట్ 2.ఇండియన్ సాటిలైట్ 3.ఇంటర్నాషనల్ సాటిలైట్ సిస్టం 4.ఇండియన్ నాషనల్ సాటిలైట్ సిస్టం
జవాబు:4
3.జాతీయ మహిళా సాధికారత పాలసీ ఏ సంవత్సరంలో ప్రకటించబడింది?
1.2001 2.2005 3.2011 4.ఏదీ కాదు
జవాబు:1
4.భారత్‌లో ఏ సముద్రంలో తుఫాన్‌లు ఎక్కువగా సంభవిస్తాయి/ఎక్కువగా చెడు ప్రభావం చూపుతాయి?
1.అరేబియా 2.హిందూ 3.బంగాళాఖాతం 4.ఏదీ కాదు
జవాబు:3
5.హిరాకుడ్ ప్రాజెక్ట్ ఏ నది పైన కట్టబడింది?
1.మహానది 2.సట్లెజ్ 3.దామోదర్ 4.చంబల్
జవాబు:1
ఒడిషా
6.2005లో కట్రినా అనే హరికేన్ వల్ల ఏ దేశంలో 1800 మందికి పైగా చనిపోయారు?
1.జపాన్ 2.చైనా 3.మాల్దీవ్స్ 4.అమెరికా
జవాబు:4
7.ఏ సైక్లోన్ కారణంగా వెస్ట్ బెంగాళ్ మరియు బాంగ్లాదేశ్‌లో కలిపి 3 నుండి 5 లక్షల మంది చనిపోయారు?
1.భోలా, 1970 2.కట్రినా, 2005 3.సునామి, 2004 4.ఏదీ కాదు
జవాబు:1
8.
భాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నది పైన నిర్మిచబడింది?1.మహానది 2.సట్లెజ్ 3.దామోదర్ 4.చంబల్
జవాబు:2
హిమాచల్ ప్రదేశ్
9.రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి భారతీయ గవర్నర్ ఎవరు?
1.బెనెగల్ రామా రావ్ 2.సీ డీ దేశ్‌ముఖ్ 3.సీ రంగరాజన్ 4.పీ సీ భట్టాచార్య
జవాబు:2
10.పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలని కలిపేది ఏది?1.మధ్యధరా సముద్రం 2.సూయజ్ కాలువ 3.పనామా కాలువ 4.ఏదీ కాదు.
జవాబు:3
11.అతిచిన్న ఖండం ఏది?1.ఆస్ట్రియా 2.ఆస్టేలియా 3.ఆర్కిటికా 4.అంటార్కిటిక
జవాబు:2
12.
ఏసియా ఖండంలో చిన్న దేశం ఏది?1.న్యూజీల్యాండ్ 2.శ్రీలంక 3.నేపాల్ 4.మాల్దీవ్స్
జవాబు:4
13.మొదటి ప్రపంచం ముగిసేనాటికి జరిగిన ఒప్పందం?
1. వెర్సైల్స్ ఒప్పందం 2.పాట్స్‌డ్యాం ఒప్పందం 3.పారిస్ ఒప్పందం 4.ఏదీ కాదు
జవాబు:1
1919లో మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన ఈ ఒప్పందం బ్రిటన్ [దాని మిత్రదేశాలు కూడా]యుద్ధంలో ఓడిపోయిన దేశాలతో చేస్కున్న సంధి ఇది.వెర్సైల్స్ ఒప్పందం జర్మనీ ఆర్థిక పరిస్థితిపైన తీవ్ర ప్రభావం చూపింది.యుద్ధంలో గెలిచిన దేశాలకి భారీగా డబ్బు చెల్లించాల్సి వచ్చింది. జర్మనీ భూభాగంలోని కొంత భాగాన్ని ఫ్రాన్స్, ఇతర దేశాలకి పంచాల్సి వచ్చింది
14.కిందపేర్కొన్న కాలువలలో పెద్ద కాలువ ఏది?1.ఇందిరాగాంధీ కాలువ 2.బకింగ్‌హ్యాం కాలువ 3.శారదా కాలువ 4.సట్లెజ్ యమున లింక్ కాలువ
జవాబు:1
15.లైట్ ఆఫ్ ఏసియా అని బుద్దుడిని గురించి కిందివారిలో రాసిందెవరు?1.ఎడ్విన్ అర్నాల్డ్ 2.ఎడ్విన్ ఆల్డ్రిన్ 3.అశోకుడు 4.జే సీ బ్రౌన్
జవాబు:1
16."గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" నవలా రచయిత?
1. ఎం ఎన్ రాయ్ 2.ఆర్ కే నారాయణ్ 3.అరుంధతీ రాయ్ 4.చేతన్ భగత్
జవాబు:3
17.నార్త్ అమెరికానీ, యూరప్‌నీ విడదీసే సముద్రం ఏది?1.మధ్యధరా 2.ఆర్కిటిక్ 3.అట్లాంటిక్ 4.పసిఫిక్
జవాబు:3
అట్లాంటిక్ ఇటు నార్త్ అమెరికానీ, యూరప్‌నీ
అటు సౌత్ అమెరికానీ, ఆఫ్రికానీ వేరు చేస్తుంది
18.కింది వారిలో ఆగష్ట్ 15 నాడు పుట్టినది ఎవరు?
1.బాలగంగాధర్ తిలక్ 2.అరబిందో ఘోష్ 3.దాదాభాయ్ నౌరోజీ 4.రబీంద్రనాథ్ ఠాగోర్
జవాబు:2
ఇతనుకూడా స్వతంత్ర్య సమరం చేసినవాడే, కానీ తర్వాత "ఫిలాసఫీ" మార్గంలోకి వెళ్ళాడు.
19.సింధూనది ఉపనదులలో తప్పుగా ఇవ్వబడింది ఏది?
1.జీలం 2.చీనాబ్ 3.రావి 4.లోహిత్
జవాబు:4
జీలం, రావి, బియాస్, సట్లెజ్, చినాబ్ అనేవి ముఖ్యమైన సింధూనది ఉపనదులు.
20.కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు?1.పులికాట్ 2.రామప్ప 3.హంసల సరస్సు 4.కొల్లేరు
జవాబు:4
21.లక్షదీవులకి పాతపేరు?
1.లక్కదీవ్ 2.మినికాయ్ 3.అమ్ని దీవులు 4.లక్కదీవ్,మినికాయ్,అమిందివి దీవులు
జవాబు:4
1973లో లక్కదీవ్,మినికోయ్ మరియు అమిందివి ఐలాండ్స్ చట్టం ద్వారా "లక్షద్వీప్"గా మార్చారు.
22.కెనరా తీరప్రాంతం ఎక్కడుంది?1.గోవా 2.మహారాష్ట్ర 3.కేరళ 4.కర్ణాటక
జవాబు:4
23.
బ్రహ్మపుత్రనదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారు?1.జమున 2.పద్మ 3.సాంగ్‌పో 4.సియాంగ్
జవాబు:3
24.ఉత్కళ తీరప్రాంతం ఏ రాష్ట్రానికి సంభంధించింది? [ఈ ప్రాంతం ఉత్కళ రాజ్యం గా పిలవబడేది..మన జాతీయగీతంలో 'ఉత్కళ' అని చెప్పబడిన ఒకప్పటి ఉత్కళ ప్రాంతం]1.పశ్చిమ బెంగాళ్ 2.మద్రాస్ 3.ఉత్తర్‌ప్రదేశ్ 4.ఒడిషా
జవాబు:4
25.మౌంట్ అబూ పైన ఉన్నదేవాలయం?1.వైష్ణోదేవి ఆలయం 2.తారా తరిణి ఆలయం 3.దిల్వారా దేవాలయం 4.అజ్మెర్ దర్గా షరిఫ్
జవాబు:3
1.కన్‌హా/కణ్ణా నేషనల్ పార్క్ ఎక్కడుంది?మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లోని మరికొన్ని నాషనల్ పార్క్స్:
బాంధవ్గడ్ నాషనల్ పార్క్
సాత్పూర నాషనల్ పార్క్
పన్నా నాషనల్ పార్క్
పెంచ్ నాషనల్ పార్క్
2.ఏలక్కాయల (కార్డమం)పర్వతాలు ఎక్కడున్నాయి [2011 Group2]కాంబోడియా
గ్వాటెమల [సెంట్రల్ అమెరికాలోని చిన్న దేశం] ఈ కార్డమం ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. తర్వాతి స్థానం ఈండియాది. ఇండియాలో 70% ఉత్పత్తి కేరళలోనే[ఇడుక్కి జిల్లా] జరుగుతుంది. ప్రపంచంలో అత్య్ధికంగా దిగుమతి చేస్కొనే దేశం సౌదీ అరేబియా, తర్వాతి స్థానం కువైట్. ప్రపంచొలో మొత్తం ఉత్పత్తిలో 66% గ్వాటెమలలోనే ఉత్పత్తి అవుతుంది.
3.అపోలోగా పిలిచే గ్రహం? బుధ
4.బాంగ్లాదేశ్ లో గంగానదిని ఏమని పిలుస్తారు?
పద్మ 5.రూర్ ఆఫ్ ఇండియా ఏది? చొటా నాగ్పూర్ పీఠభూమి.
రూర్ వ్యాలీ జర్మనీలో ఉంది. ఛోటానాగపూర్ పీఠభూమిని ఖనిజ సంపద విషయంలో జర్మనీలోని 'రూర్' ప్రాంతంతో పోలుస్తారు.
6."నిర్డ్" [NIRD] ఎక్కడ ఉంది? హైదరాబద్National Institute of Rural Development
7.న్యూయార్క్ ఏనది ఒడ్డున ఉన్నది?
హడ్సన్
లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
థేంస్
9.మన్నార్ సింధుశాఖ ఏ ప్రాంతాలమధ్య విస్తరించి ఉన్నది.
ఇండియా-శ్రీలంక
10.క్వీన్ ఆఫ్ అరేబియా ఏ ఓడరేవు?కొచ్చిన్
11.82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంషం ఎన్ని రాష్ట్రాలగుండా పోతుంది?
UP, MP, Chhattisgarh, Orissa and Andhra Pradesh.
6. 610 జీవో ఏ సంవత్సరం జారీ అయ్యింది?1985
7. భారత్ లో "బెస్ట్ ప్లాన్డ్ సిటీ" గా పిలవబడే సిటీ? చంఢీగడ్
8. "మధుబని" అనే ఒక రకమైన ప్రసిద్ధి గాంచిన జానపద పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంభంధించింది?బీహార్
9.భారత్‌లో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పడింది?
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ [ఇప్పటి మన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ], 1982 లో
10.జాతీయ ఆహారభధ్రత రక్షణ చట్టం -2013
1.మధ్యాహ్న భోజనపథకం 2.సమగ్ర శిశు అభివృద్ధి 3.ప్రజా పంపిణీ వ్యవస్థ
11."మండల్ కమీషన్" ఏ ప్రధాని కాలంలో ఏర్పడింది?
మొరార్జీ దేశాయి
12.
సుదూరప్రాంతాలకు సరుకులు చేరవేయటంలో అత్యంత చవకైన రవాణామార్గం?జలమార్గం
13.జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) ఛైర్మన్‌గా వ్యవహరించేది ?
ప్రధానమంత్రి
14.ఓజోన్ పొర పలుచబడటానికి కారణమైన గ్యాస్ కిందివాటిలో ఏది? [ఎస్.ఎస్.సీ 2015]
1.క్లోరోఫ్లోరో కార్బన్స్
15."ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం" ఎవరి రచన?
స్టీఫెన్ హాకింగ్
16.ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు?
జూన్ 5
17."గోవు" ఏ దేశపు జాతీయ జంతువు?
నేపాల్
24.TASK అంటే?1.తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్
1. 2011 జనాభాలెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత విషయంలో అట్టడుగున ఉన్న జిల్లా?[తెలంగాణాలో]1.ఆదిలాబాద్ 2.మహబూబ్‌నగర్ 3.నిజామాబాద్ 4.మెదక్
జవాబు:2
2.
"తెలంగాణా ఇంజినియర్స్ డే" ఎప్పుడు?1) జనవరి 12 2) జులై 11 3) మే 14 4) ఫిబ్రవరి 14
జవాబు:2
3.
తెలంగాణాప్రభుత్వపు ప్రతిష్టాత్మక "వాటర్ గ్రిడ్" పథకాన్ని దేశమంతటా ప్రవేశపెట్టలని అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి ఎవరు?1.నితీశ్ కుమార్ 2.అఖిలేశ్ యాదవ్ 3.బిజు పట్నాయక్ 4.జయలలిత
జవాబు:2
4.
సికింద్రాబాద్ బోనాల సంధర్భంగా భక్తులు సమర్పించే బోనాలు ఏ దేవతకి?1.ఉజ్జయిని మహంకాళి 2.కలకత్తా కాళి 3.పెద్దమ్మ 4.రేణుక
జవాబు:1
5. ఇటీవల ప్రచురించబడ్డ "ఉనికి" అనే పుస్తకం రచయిత?
1.సీహెచ్ విద్యాసాగర్ 2.జీ వెంకటస్వామి 3.ఎం కోదండ రాం 4.ఎవరూ కాదు
జవాబు:1
6.
విటికల్చర్ దేనికి సంభంధించింది?1.ద్రాక్ష పంట 2.తేనె తయారీ 3.పట్టుపురుగుల పెంపకం 4.చెరుకు రసం తయారీ
జవాబు:1
7. ఖాజీరంగ నాషనల్ పార్క్ ఎక్కడుంది?
1.అసోం 2.వెస్ట్‌బెంగాళ్ 3.అరుణాచల్ ప్రదేశ్ 4.ఏదీ కాదు
జవాబు:1
8. బీహర్ రాష్ట్ర దుఃఖదాయిని?1.కోసి 2.రాంగంగ 3.గండక్ 4.సోన్
జవాబు:1
9. తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీ ఎగువ పరిమితి ఎంత?1. లక్ష రూపాయలు 2.రెండు లక్షలు 3.రెండున్నర లక్షలు 4.మూడు లక్షలు
జవాబు:1
10. "లోపలి మనిషి" ఎవరి రచన?1.కేసీఆర్ 2.అల్లం నారాయణ 3.పీవీ నరసిమ్హారావ్ 4.దాశరథి కృష్ణమాచార్య
జవాబు:3
11. భారత్‌లో "థియోసాఫికల్ సొసైటీ" ఎక్కడ స్థాపించబడింది?
1.అడయార్, మద్రాస్ 2.రామకృష్ణాపురం, ఢిల్లీ 3.దాదర్, ముంబాయ్ 4.ఏదీకాదు
జవాబు:1
12. కోయిల్‌సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?1.నల్గొండ 2.కరీంనగర్ 3.మహబూబ్‌నగర్ 4.ఖమ్మం
జవాబు:3
మహబూబ్‌నగర్ మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్ట్ ఇది. 1945-48 లో నిజాం పరిపాలనా కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనది. కృష్ణానది ఉపనది అయిన పెదవాగు నది పైన నిర్మించబడింది[దేవరకద్ర మండలం]. జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఐన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేస్తారు.
14. లోకాయుక్తని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం?
1.కేరళ 2.కర్ణాటక 3.మహారాష్ట్ర 4.రాజస్థాన్
జవాబు:3
15. ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి?
1.బొగ్గు గనులు 2.పేపర్ పరిశ్రమ 3.పంచదార పరిశ్రమ 4.ఏదీ కాదు
జవాబు:1
16.
తెలంగాణాలో గోదావరినది ఎన్ని జిల్లాలగుండా ప్రయాణిస్తుంది?1.4 2.5 3.6 4.3
జవాబు:2
నిజామాబాద్, ఆదిలాబాద్,కరీంనగర్, వరంగల్,ఖమ్మం
17. నిజామాబాద్‌లోని అలీ సాగర్‌కి ఎవరి జ్ఞాపకార్థం ఆ పేరువచ్చింది?
1.అలీ యావర్ జంగ్ 2.అలీ నవాజ్ జంగ్ 3.అలీ నూర్ జంగ్ 4.ఎవరూకాదు
జవాబు:2
18. "నా జైలు అనుభవాలు-జ్ఞాపకాలు" రచయిత ఎవరు?
1.రావి నారాయణ రెడ్డి 2.స్వామీ రామానంద తీర్థ 3.సంఘం లక్ష్మీ భాయి 4.దాశరథి కృష్నమాచార్య
జవాబు:3
19. గుజరాత్ సాంప్రదాయక పేరు
సౌరాష్ట్ర
1. మౌంట్ అబూ పైన ఉన్నదేవాలయం?1.వైష్ణోదేవి ఆలయం 2.తారా తరిణి ఆలయం 3.దిల్వారా దేవాలయం 4.అజ్మెర్ దర్గా షరిఫ్
జవాబు:3
2. "స్ట్రేంజర్" గ్యాస్ ఏది? [విచిత్రప్రవర్తన గలది]
1.నైట్రస్ ఆక్సైడ్ 2.గ్ఝినాన్ 3.నియాన్ 4.హీలియం
జవాబు:2
3. సెంటిగ్రేడ్ మరియు ఫారన్‌హీట్ ప్రమాణాలు రెండూ ఒకె రీడింగ్‌ని ఏ డిగ్రీల వద్ద చూపుతాయి?
1.-32డిగ్రీలు 2.-40డిగ్రీలు 3.0డిగ్రీలు 4.101డిగ్రీలు
జవాబు:2
4. ఆసియా అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు ఇటీవల ఎమర్జింగ్ మార్కెట్స్ పత్రిక ప్రకటించింది. ఈ అవార్డ్ గెలుచుకున్నది?
1.లావ్ జివీ 2.తరో అసో 3.కొర్న్ చతికవంజి 4.అరుణ్ జైట్లీ
జవాబు:4
"టాన్ బ్రౌన్ గ్రానైట్"కు ప్రసిద్ధి చెందిన తెలంగాణ జిల్లా? 1.కరీంనగర్ 2.వరంగల్ 3.ఖమ్మం 4.నల్గొండ
6.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్ని జోన్లు ఉంటాయి?1)5 2)6 3)7 4)8
7."గోవు" ఏ దేశపు జాతీయ జంతువు?
1.నేపాల్ 2.భూటాన్ 3.ఇండియా 4.ఇండోనేషియా
జవాబు:1
10.వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) యొక్క 161 వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం?1.సీషెలీస్ 2.యెమెన్ 3.తజికిస్తాన్ 4.లవ్స్ [లేదా లావోస్]
జవాబు:1
11. హితాచీ సొల్యూషన్స్ అభివృద్ధి కేంద్రం చెన్నైలో ఒకటుంది. కాగా ఇటీవల ఏ రాష్ట్రంలో 2వ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది?1.అమరావతి 2.తెలంగాణ 3.ముంబాయ్ 4.బెంగళూరు
జవాబు:2
12. తగిన వర్షాలు లేని కారణంగా, ఖరీఫ్ పంట రైతులకి ఆశించిన ఫలితాలని అందచేయనందున తెలంగాణా ప్రభుత్వం ఇటీవల రైతులకి విత్తనాల కొనుగోలుకు 50% సబ్సిడీ ప్రకటించింది. ఈ సబ్సిడీ ఏ విత్తనాలపైన?1.శనగ 2.వేరు శనగ 3.జొన్న 4. 1 & 2
జవాబు:4
13. TASK అంటే?1.తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ 2.తెలంగాణ అకాడమీ ఫర్ సాఫ్ట్‌స్కిల్స్స్ నీడెడ్ 3.తెలంగాణ అకాడమీ ఫర్ సాఫ్ట్‌వే అండ్ నాన్-సాఫ్ట్‌వేర్ 4.ఏదీ కాదు
జవాబు:1
17. శిలాజాలను[ఫాసిల్స్] గురించి అధ్యయనంను ఏమంటారు?
1.పెలియంటాలజి 2.ఎటిమాలజీ 3.సైస్మాలజీ 4.ఓర్నిథాలజి
జవాబు:1
18.కంతనపల్లి ప్రాజెక్ట్‌ని ఏ నదిపైన నిర్మించడానికి ప్రణాళిక ఉన్నది?
1.కృష్ణ 2.శబరి 3.గోదావరి 4.మంజీర
జవాబు:3
19. The Origin of Species గ్రంథ రచయిత?
1.చార్లెస్ డార్విన్ 2.లూయిస్ లీకే 3.జేమ్‌స్ వాట్సన్ 4.ఫ్రాన్సిస్ క్రిక్
జవాబు:1
20.
కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు ?1.వసంత మండపం 2. త్రివిజయ 3.భువన విజయం 4. సంగం
జవాబు:3
21. తెలంగాణాలో ఆడ-మగ నిష్పత్తి తక్క్కువగా ఉన్న జిల్లా?1.మహబూబ్‌నగర్ 2.రంగారెడ్డి 3.నల్గొండ 4.హైదరాబాద్
జవాబు:4
22. రామప్ప దేవాలయం ఎవరి పేరు మీదుగా నిర్మింపబడ్డది?1.శ్రీ రామచంద్ర ప్రభువు 2.రామప్ప పంతులు అను పురోహితుడు
3.రామప్ప అను శిల్పి 4.రామ ప్రతాపరుద్ర అను పాలకుడు
జవాబు:3
23. హరితహారం అనే ప్రోగ్రాం ద్వారా అటవీ ప్రాంతాన్ని ఎంతశాతం మేరకు పెంచాలనేది తలంగాణా ప్రభుత్వం యొక్క ప్రయత్నం?1.24% 2.33% 3.45% 4.50%
జవాబు:2
24.
మలేరియా వ్యాధి వ్యాప్తికి 'ఆడ ఎనాఫిలిస్' దోమ కారణమని పరిశోధనల ద్వారా మొదటగా గుర్తించినది?1.రోనాల్డ్ రాస్ 2.లూయి పాశ్చర్ 3.చార్లెస్ ఎల్టన్ 4.ఎవరూ కాదు
జవాబు:1
11. "అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలెజ్ ఆఫ్ ఇండియా" ఎక్కడుంది? [ఏఎస్‌సీఐ]