Thursday, November 26, 2015

బౌద్ధుడు, జైనుడు -పోలికలు



1.బుద్ధుడు, మహావీరుడూ ఇద్దరూ సమకాలికులే. బుద్ధుడు BC 563 లో పుడితే మహావీరుడు 540 BC లో పుట్టాడు.
2.ఇద్దరూ పుట్టుకతో అత్యంత ధనవంతులు!
3.ఇద్దరికీ ఒకే భార్య .బుద్ధుడి కుమారుడు "రాహుల్" లేదా "రాహుల". మహావీరుడుకి మాత్రం కుమార్తె. మహావీరుడి మొదటి శిష్యుడు ఈయన అల్లుడే [పేరు జమేలి]
4.బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు, జ్ఞానం పొంది బుద్దుడైనాడు. మహావీరుడు వర్థమానుడు, జ్ఞానంపొంది జీనుడు/తీర్థంకరుడు అయినాడు.
5.బుద్ధమతంలో శాఖలు =2 హీనయానం, మహాయానం. జైనమతంలోనూ శాఖలు = 2 శ్వేతాంబర [వైట్ డ్రెస్], దిగంబర [దిగంబర=దిక్కులనే అంబరముగా చేస్కున్నవాడు]
6.బుద్ధుడు 35వ యేట జ్ఞానం పొందాడు, మహావీర కొంచెం లేటు వయసులో 42వ యేట జ్ఞానం పొందాడు.

1.బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థ, మహావీరుడి నాన్న పేరు సిద్ధార్థ
2.బుద్ధుడి భార్య పేరు యశోధర, మహావీరుడి భార్య పేరు యశోధ
3.బుద్ధుడు 29వ యేట మోక్షం కోసం ఇల్లువదిలివెళ్ళాడు, మహావీర 30 వ యేట ఇల్లు వదిలాడు
4.బుద్ధుడు తన సన్యాస జీవితంలో "అలార కలామ" అనే వ్యక్తి దగ్గర తపస్సు రహస్యాలు తెలుసుకున్నాడు, ఇతడే ఈయన గురువు. మహావీర తన సన్యాసజీవితంలో 'మఖలి గోసల" తో గడిపాడు ఇతను ఈయన గురువు కాకపోయినా "అజీవక శాఖ" అని ఒక శాఖ స్థాపించి చాలా మందికి గురువు అయ్యాడు.
5.బుద్ధుడు నిరంజన నదీ ఒడ్డున, రావిచెట్టుకింద జ్ఞానంపొందాడు.మహావీర రజపాలిక నదీ ఒడ్డున జ్ఞానం పొందాడు.
6.బుద్ధుడు 80వ యెట కుశీనగరంలో [ఉత్తరప్రదేశ్] శరీరత్యాగం చేశాడు. మహావీర 72వ యేట పావాపురి [బీహార్] లో శరీరత్యాగం చేశాడు.
7.బుద్ధుడు ఎన్నో జన్మలు ఎత్తాడు, బుద్దుడైనాడు.. ఇక జన్మలు లేవు..మహావీర 24వ తీర్థకరుడు.. ఈయనా చివరివాడే, 25వ తీర్థకరుడు ఎవరూ లేరు.
8.బౌద్ధమత పవిత్రగ్రంధం = "త్రిపీఠకాలు", జైన మతానికి పవిత్రగ్రంథం గా "కల్పసూత్ర" ని చెప్తారు.
9.బౌద్ధ కౌన్సిల్స్ 4 జరిగాయి. జైన కౌన్సిల్స్ 2 మాత్రమే



జాగ్రఫీ


అగ్నిపర్వతాలకు ఉదాహరణలు జపాన్‌లోని ఫుజి పర్వతం మరియు ఫిలిప్పీన్స్‌లోని పినాటుబో పర్వతం. ఒక ప్లేట్ మరొక ప్లేట్ క్రిందకు లేదా మధ్య-సముద్ర శిఖరం లేదా హాట్‌స్పాట్ వద్ద నెట్టబడినప్పుడు అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. 
మడత పర్వతాలు: రెండు పలకలు ఢీకొన్నప్పుడు మడత పర్వతాలు ఏర్పడతాయి: బాల్కన్ పర్వతాలు[యూరప్] మరియు జురా పర్వతాలు[ఫ్రెంచ్-స్విస్ సరిహద్దు] మడత పర్వతాలకు ఉదాహరణలు

1.ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు? లేక్ సుపీరియర్
ప్రపంచంలోకెల్ల "లోతైన" మంచినీటి సరస్సు: లేక్ బైకాల్, సైబీరియా
ప్రపంచంలో అతి "పెద్ద" మంచినీటి సరస్సు:లేక్ సుపీరియర్, నార్త్ అమెరికా

2.డెల్టాలలో ఉండే మట్టి? ఒండ్రు

3.భారత ద్వీపకల్పంలోని ఏ పర్వతశ్రేణిని సహ్యాద్రిపర్వత శ్రేణిగా పిలుస్తారు? 
పశ్చిమకనుమలు
పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యం చాలా ఉంటుంది. ఎన్నో రకాల పక్షులు జంతువులకి అడ్రెస్ ఈ ప్లేస్. వర్షాకాలంలో ఈ కనుమలు చాలా అందంగా ఉంటాయ్. యునెస్కో ఈ పశ్చిమకనుమలని 8 "హాటెస్ట్ హాట్‌స్పాట్స్" లో ఒకటిగా గుర్తించింది [వార్ల్డ్ హెరిటేజ్ గుర్తింపు]. ఈ కొండల్లో అత్యంత ఎత్తైన "అనెముడి" కేరళలో ఉంది.
4.వెస్ట్‌బెంగాళ్ లో ఉత్పత్త్పి అగు ప్రధానఖనిజం [ఏపీపీఎస్‌సీ, 2011] .బొగ్గు
5.
 తూర్పు నుండి పడమరకి ప్రవహించే నది? తపతి 
6.ఏ మట్టిలో బంక మట్టి ఎక్కువగా ఉండి, నీళ్ళలోని తేమని తనలో దాచుకొనే శక్తి ఉంటుంది? నల్లరేగడి నేలలు
7.
 నల్లరేగడి నేలలు ఏ పంటకి అనుకూలం? పత్తి
8.అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుంది? ఫిలిప్పైన్స్ 

9.భారత్-ఆఫ్ఘనిస్తాన్ లని వేరు చేయునది? 
డ్యూరాండ్ రేఖ
11.ఏ రకపు మేఘాలు ఉన్నపుడు వాతావరణం సరిగా ఉండదు? క్యుములోనింబస్
12.గురు శిఖరం ఉన్న రాష్ట్రం ఏది? 
రాజస్థాన్
ఆరావళి పర్వతాలలో, మౌంట్ అబూ దగ్గర గల ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖరం[రాజస్థాన్]. 
13.భారతదేశపు ఉత్తరపు చిట్టచివరి సరిహద్దు ఏది?
ఇందిరా కాల్ 
సియాచిన్ మంచు ప్రాంతపు ఎత్తైన ప్రదేశం ఇందిరా కాల్ ఇది కారకోరం శ్రేణుల్లో ఉంది.ఇందిరా పాయింట్ వేరు అది దక్షిణంలో ఉంది.
14.దేశంలో నేలల క్రమక్షయానికి ప్రధానకారణం? నదీ ప్రవాహాలు 
15.పినాకిని నదికి మరో పేరు? పెన్నా

16.దూరం యొక్క ప్రమాణాలన్నిటిలో పెద్దది? పార్‌సెక్

17.లక్షద్వీప్ రాజధాని? కవరత్తి 
18.అడవుల్లో గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఏం వ్యవసాయం అని పిలుస్తారు? 
పోడు 
ఇది చాలా మోటు వ్యవసాయం.
19.ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్ క్రింది వాటిలో ఏది? 
నార్వే 
మన భూమి 23.5 డిగ్రీస్ వాలి సూర్యుడి చుట్టూ తిరగటంవల్ల మనకి భూగోళం మొత్తం మీద కాంతి ఒకేలా ఉండదు. నార్వే దేశం మన భూమి కి ఉత్తరంలో ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉంది.[దీన్ని టెక్నికల్ గా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటారు..ఇంకా కొంచెం ఉత్తర వెళ్తే ఉత్తర ధృవం వస్తుంది. ఇది 90 డిగ్రీల ఉత్తర ధృవం.] అందుకే ఈదేశంలో వేసవిలో [మే,జూన్,జులై లలో] సూర్యుడు పూర్తిగా అస్తమించడు. అర్థరాత్రి లేచినా అస్తమించే సూర్యుడిలాగానే ఉంటాడు. అందుకే ఈ దేశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. అలాగే చలికాలంలో కూడా ఇంటే, సూర్యుడు ఇక్కడ 24 హౌర్స్ పూర్తిగా ఉదయించడు, ఎక్కువగా చీకటే.
స్వీడెన్, ఫిన్లాండ్ లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి.
మరి దక్షిణ గోళంలో అంటార్కిటికాలో కూడా పరిస్థితి ఇదే అయితే, ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించరు 
20.ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫంట్స్? 
థాయీలాండ్ 
థాయిలండ్ ప్రజలు ఏనుగుల్ని ప్రేమిస్తారు. వీళ్ళ దేశానిదీ, ఏనుగుల్ది విడదీయరాని సంభంధం.
ఆగ్నేయ ఆసియాఖండంలో యూరప్ వారిచే పరిపాలించబడని దేశం ఏదైనా ఉంది అంటే అది థాయీనే. ఇలా పాశ్చాత్యులు పరిపాలించని దేశాల్లో సంస్కృతి అనేది ప్రభావితం కాదు. మనదేశంలో యూరప్ పరిపాలనవల్ల మన సంస్కృతిలో చాలా మార్పులొచ్చాయి. చైనా, జపాన్,భూటాన్ లంటి దేశాలుకూడా పాశ్చాత్యుల పాలన కిందికి రాలేదు. అందుకే వాటి సంస్కృతి చాలా ఘనమైనది.
నిజానికి లవ్స్[లావోస్ అని పిలుస్తూ ఉంటాం] దేశాన్ని లాండ్ ఆఫ్ 1000 ఎలిఫంట్స్ అని పిలుస్తారు.వీళ్ళ అధికార ముద్రలపైన ఏనుగు బొమ్మలు ఉంటాయి. తెల్ల ఏనుగొకటి కొన్ని నెలల కిందట మయన్మార్ లో కనిపించింది. ఇండియాలో ముఖ్యంగా కేరళలో పండగలకి ఏనుగుల సందడే ఎక్కువ. 
21.ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్ ఏది?.స్విట్జర్లాండ్ 
22.
 ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఏది? జపాన్ 
23.కేరళ? స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా 
24.ప్రకాశవంతంగా కంటికి కనిపించేవి ఆకాశంలో వరుసగా? సూర్యుడు-చంద్రుడు - శుక్ర - గురు
25.జత 
1.సిటీ ఆఫ్ నవాబ్స్ - లక్నౌ/లక్నో
2.సిటీ ఆఫ్ టెంపుల్స్ - బుబనేష్వర్
3.ద లాండ్ ఆఫ్ జువల్ [Jewel] - మణిపూర్


1. కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాలగుండా ప్రయాణిస్తుంది? 
1)8  2)10  3)5  4)6
జవాబు:1

అవి పడమర నుండి తూర్పుకి వరుసగా:
గుజరాత్ >రాజస్థాన్ >మధ్యప్రదేశ్ > చత్తీస్‌గడ్> ఝార్కండ్ >వెస్ట్‌బెంగాళ్ > త్రిపుర> మిఝోరం

2. భారత్‌లో ఏ రాష్ట్రం ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది?
1.రాజస్థాన్  2.జమ్ముకశ్మీర్  3.మధ్యప్రదేశ్  4.ఉత్తర్‌ప్రదేశ్
జవాబు:4
ఉత్తర్‌ప్రదేశ్ 8 రాష్ట్రాలతో బార్డర్ పంచుకుంటుంది.
అవి: ఉత్తరాఖండ్ >హిమాచల్‌ప్రదేశ్> హర్యానా> రాజస్థాన్> మధ్యప్రదేశ్> చత్తీస్‌గడ్ >ఝార్ఖండ్ >బిహార్

3. 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాలగుండా పోతుంది?
1)5  2)6  3)7  4)8
జవాబు:1
ఉత్తర్‌ప్రదేశ్ >మధ్యప్రదేశ్ >చత్తీస్‌గడ్ >ఒడిషా >ఆంధ్రప్రదేశ్

4. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలని కలిపేది ఏది?
1.మధ్యధరా సముద్రం 2.సూయజ్ కాలువ 3.పనామా కాలువ 4.ఏదీ కాదు.
జవాబు:3

5. అతిచిన్న ఖండం ఏది?
1.ఆస్ట్రియా 2.ఆస్టేలియా 3.ఆర్కిటికా 4.అంటార్కిటిక
జవాబు:2


6. 
 ఏసియా ఖండంలో చిన్న దేశం ఏది?
1.న్యూజీల్యాండ్ 2.శ్రీలంక 3.నేపాల్ 4.మాల్దీవ్స్
జవాబు:4

7. కిందపేర్కొన్న కాలువలలో పెద్ద కాలువ ఏది?
1.ఇందిరాగాంధీ కాలువ 2.బకింగ్‌హ్యాం కాలువ 3.శారదా కాలువ 4.సట్లెజ్ యమున లింక్ కాలువ
జవాబు:1

8. నార్త్ అమెరికానీ, యూరప్‌నీ విడదీసే సముద్రం ఏది?
1.మధ్యధరా 2.ఆర్కిటిక్ 3.అట్లాంటిక్ 4.పసిఫిక్
జవాబు:3
అట్లాంటిక్ ఇటు నార్త్ అమెరికానీ, యూరప్‌నీ
అటు సౌత్ అమెరికానీ, ఆఫ్రికానీ వేరు చేస్తుంది.


9. సింధూనది ఉపనదులలో తప్పుగా ఇవ్వబడింది ఏది?
1.జీలం 2.చీనాబ్ 3.రావి 4.లోహిత్
జవాబు:4
జీలం, రావి, బియాస్, సట్లెజ్, చినాబ్ అనేవి ముఖ్యమైన సింధూనది ఉపనదులు.

10. కెనరా తీరప్రాంతం ఎక్కడుంది?
1.గోవా 2.మహారాష్ట్ర 3.కేరళ 4.కర్ణాటక
జవాబు:4


11. 
 బ్రహ్మపుత్రనదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారు?
1.జమున 2.పద్మ 3.సాంగ్‌పో 4.సియాంగ్
జవాబు:3

12. ఉత్కళ తీరప్రాంతం ఏ రాష్ట్రానికి సంభంధించింది? [ఈ ప్రాంతం ఉత్కళ రాజ్యం గా పిలవబడేది..మన జాతీయగీతంలో  'ఉత్కళ ' అని చెప్పబడిన ఒకప్పటి ఉత్కళ ప్రాంతం]
1.పశ్చిమ బెంగాళ్ 2.మద్రాస్ 3.ఉత్తర్‌ప్రదేశ్ 4.ఒడిషా
జవాబు:4

13. లూనీ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?
1.బిహార్ 2.ఉత్తర్‌ప్రదేశ్ 3.పంజాబ్ 4.రాజస్తాన్
జవాబు:4


14. 
 విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది?
1.తిరువనంతపూర్,కేరళ 2.శ్రీహరికోట, నెల్లూర్ 3.అలహాబాద్, ఉత్తర్‌ప్రదేశ్ 4.యెంలూరు, బెంగళూరు
జవాబు:1

15. కరేవా మృత్తికలు వీటి ద్వారా నిక్షేపించబడినవి..
1.తరంగాలు 2.పవనాలు 3.నదులు 4.హిమానీ నదులు
జవాబు:4

16.సమానమైన ఎత్తుగల ప్రదేశాలని కలుపుతూ గీసే రేఖలని ఏమంటారు? [ఇవి ఊహా జనితమైనవి]
1.అక్షాంష రేఖలు 2.కాంటూర్ రేఖలు 3.ఐసో హ్యూం రేఖలు 4.ఐసో్‌నెఫ్ రేఖలు
జవాబు:2

17.భారత్‌లో మొదటగా వేసవి ఋతుపవనాలు ఏ ప్రాంతాన్ని తాకుతాయి
1.గంగా మైదానాలు 2.తూర్పు కనుమలు 3.పశ్చిమకనుమలు 4.హిమాలయాలు
జవాబు:3
భారత్‌లో వేసవి ఋతుపవనాలు ముందుగా పశ్చిమకనుమలని తాకుతాయి [ముందు తాకే రాష్ట్రం కేరళ].

18.కొండప్రాంతాలలో వచ్చే వర్షపాతాలని ఏ పేరుతో పిలుస్తారు?
1.తుఫాన్లు 2.సాంప్రదాయకవర్షాలు 3.ఫ్రంటల్ వర్షపాతం 4.ఓరోగ్రాఫిక్ వర్షపాతం
జవాబు:4

19."ఝూం" అనేది ఒక
1.ఒక మొక్క యొక్క శాస్త్రీయ నామం
2.పొడిప్రదేశంలో ఉన్న నదీ లోయ
3.ఒకరకమైన వ్యవసాయ పద్ధతి
4.ఏదీ కాదు
జవాబు:3

20.కాంటూర్ రేఖలకి మరోపేరు?
1.ఐసోపొటెన్షియల్ 2.ఐసోబార్స్ 3.ఐసోహైప్ 4.ఐసోహయట్
జవాబు:3

21.అరుణాచల్‌ప్రదేశ్‌లో శివాలిక్ శ్రేణులని ఏమని పిలుస్తారు?
1.జమ్ము కొండలు 2.కచార 3.మిష్మి 4.రాణిఖేత్
జవాబు:3


22.
 నిమ్న హిమాలయాలు, శివాలిక్ హిమాలయాల మధ్యలో ఉండే లోయలని ఏమని పిలుస్తారు?
1.డూన్స్ 2.డోన్స్ 3.పూర్వాంచల్ 4.ఉత్తరాంచల్
జవాబు:1

23.చిత్తడి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1.బాబర్ 2.భంగర్ 3.టెరాయ్ 4.ఖాదర్
జవాబు:3

24.ఆకురాల్చు అరణ్యాలలో పెరిగే వృక్షం?
1.కార్క్ 2.టేకు 3.ఓక్ 4.ఏదీకాదు
జవాబు:2

25.కిందివాటిలో భిన్నమైనదానిని గుర్తించండి?
1.ముస్సోరీ 2.సింలా 3.ఊటీ 4.నైనిటాల్
జవాబు:3
ఊటీ సౌత్ ఇండియాలో ఉంది.. మిగతావన్నీ నార్త్ ఇండియాలో ఉన్నాయి. మరీ ముఖ్యమైన పోలిక ఏమంటే మిగతా 3 హిమాలయాలతో సంభంధం ఉన్న ప్రాంతాలు. ఊటీకి హిమాలయాలతో అసలు సంభంధం లేదు.


1.కన్‌హా/కణ్ణా నేషనల్ పార్క్ ఎక్కడుంది?
మధ్యప్రదేశ్ 
మధ్యప్రదేశ్ లోని మరికొన్ని నాషనల్ పార్క్స్:
బాంధవ్గడ్ నాషనల్ పార్క్
సాత్పూర నాషనల్ పార్క్
పన్నా నాషనల్ పార్క్
పెంచ్ నాషనల్ పార్క్

2.ఏలక్కాయల (కార్డమం)పర్వతాలు ఎక్కడున్నాయి [2011 Group2]
కాంబోడియా
గ్వాటెమల [సెంట్రల్ అమెరికాలోని చిన్న దేశం] ఈ కార్డమం ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. తర్వాతి స్థానం ఈండియాది. ఇండియాలో 70% ఉత్పత్తి కేరళలోనే[ఇడుక్కి జిల్లా] జరుగుతుంది. ప్రపంచంలో అత్య్ధికంగా దిగుమతి చేస్కొనే దేశం సౌదీ అరేబియా, తర్వాతి స్థానం కువైట్. ప్రపంచొలో మొత్తం ఉత్పత్తిలో 66% గ్వాటెమలలోనే ఉత్పత్తి అవుతుంది. 

3.అపోలోగా పిలిచే గ్రహం? బుధ 
4.బాంగ్లాదేశ్ లో గంగానదిని ఏమని పిలుస్తారు? 
పద్మ 
5.రూర్ ఆఫ్ ఇండియా ఏది? చొటా నాగ్పూర్ పీఠభూమి.
రూర్ వ్యాలీ జర్మనీలో ఉంది. ఛోటానాగపూర్ పీఠభూమిని ఖనిజ సంపద విషయంలో జర్మనీలోని 'రూర్' ప్రాంతంతో పోలుస్తారు.

6."నిర్డ్" [NIRD] ఎక్కడ ఉంది? హైదరాబద్
National Institute of Rural Development

7.న్యూయార్క్ ఏనది ఒడ్డున ఉన్నది?
హడ్సన్ 

లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
థేంస్

9.మన్నార్ సింధుశాఖ ఏ ప్రాంతాలమధ్య విస్తరించి ఉన్నది.
ఇండియా-శ్రీలంక 

10.క్వీన్ ఆఫ్ అరేబియా ఏ ఓడరేవు?
కొచ్చిన్ 

11.82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంషం ఎన్ని రాష్ట్రాలగుండా పోతుంది?
UP, MP, Chhattisgarh, Orissa and Andhra Pradesh.






Tuesday, November 24, 2015

మెడిసిన్, సైన్స్ & టెక్నాలజీ


1.వేసవికాలంలో "క్యుమ్యులొనింబస్" మేఘాలవల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులూ వస్తుంటాయి. ఇలాంటి వర్షాలని ఏమని పిలుస్తారు.
1.సంవహన వర్షపాతం 2.పర్వతీయవర్షపాతం 3.చక్రవాతం 4.ఏదీకాదు.
జవాబు:1

2.జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు? 
[ రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ISRO,DRDO, వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనా వెళ్ళవచ్చు. సమయం తదితర వివరాలు ఆయా సంస్థలు ప్రకటిస్తాయి]
1.ఫిబ్రవరి 14 2.జనవరి 12 3.ఫిబ్రవరి 28 4.ఏదీకాదు.
జవాబు: 3

3.అత్యధిక సహజ ఉపగ్రహాలు లేదా చంద్రులు కలిగి ఉన్నది
1) జుపిటర్ 2) మార్స్ 3) వీనస్ 4) శని
జవాబు:1
ఇప్పటికీ ఎక్కువ ఉపగ్రహాలున్నది "జూపిటర్"కే. జూపిటర్ కి 67 ఉపగ్రహాలూ, శనికి 62 ఉపగ్రహాలూ ఉన్నాయి

4.సౌరకుటుంబంలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి?
1.బుధుడు,శుక్రుడు 2.శుక్రుడు,శని 3.బుధుడు, భూమి 4.ఏదీ కాదు.
జవాబు: 1

5.ఆర్యభట్ట, వరాహమిహిర ఏ సామ్రాజ్య కాలంలో జీవించారు.
[వీళ్ళు ప్రపంచంలోని ఖగోళ సైంటిస్టులందరికీ సుపరిచితం.
ఆర్యభట్ట: ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడూ మరియూ గణిత శాస్త్రజ్ఞుడూ; భూమి తన అక్షం మీద తిరుగుతూ ఉందని కనుగొన్న మహానుభావుడు.సూర్యచంద్ర గ్రహణాలను కచ్చితంగా అధ్యయనం చేశాడు.
వరాహమిహిర:ఖగోళశాస్త్రజ్ఞుడైన ఈయన, పంచసిద్ధాంతం {తనకాలం నాటి అయిదు ఖగోళశాస్త్ర సంబంధమైన గ్రంధాల సారాంశం} రచించాడు.]
1.మౌర్య 2.మగధ 3.గుప్త 4.శిశునాగ
జవాబు: 3

6.న్యూక్లియర్ రియాక్టర్ లో మితకారి [మోడరేటర్] గా పని చేసే భారజలం కి దీనికీ సంభంధం ఉంది
 
1.ప్రోటియం 2.డ్యుటీరియం 3.ట్రిటీయం 4.ఏదీకాదు.
జవాబు:2

7.సోడా నీటిలో ఉండే ఉండే వాయువు?
1.ఆక్సిజన్ 2.నైట్రోజన్ 3.కార్బన్ డై ఆక్సైడ్ 4.ఏదీ కాదు
జవాబు:3

8."క్వినైన్" ఏ వృక్షం నుండి లభిస్తుంది?
1.వేప 2.సింకోనా 3.రావి 4.పైన్
జవాబు:2
క్వినైన్ అనే పదార్ధాన్ని సింకోనా చెట్టు బెరడునుండి తీస్తారు, మలేరియా వ్యాధి నివారణలో ఎక్కువగా వాడతారు.

9.స్టైన్‌లెస్ స్టీల్ అనేది దేనియొక్క మిశ్రమ లోహం?
1.ఇనుము, కార్బన్ మరియు నికెల్ 2.ఇనుము, మాంగనీస్, నికెల్
3.ఇనుము, క్రోమియం, నికెల్ 4.ఏదీ కాదు
జవాబు: 3

10.మన శరీరంలో ఉష్ణోగ్రతా క్రమతా కేంద్రం అని దేన్ని అంటారు?
1.పిట్యుటరీ 2.పీనియల్ 3.హైపోథాలమస్ 4.ఏదీ కాదు.
జవాబు: 3

11.ఊపిరితిత్తుల కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏం అంటారు?
1.కార్డియాలజీ 2.నెప్రాలజీ 3.పూమనాలజీ/ పల్మనాలజీ 4.ఏదీ కాదు
జవాబు:3

12.వేడికి అతి త్వరగా నశించిపోయే విటమిన్?
1.ఏ 2.బీ 3.సీ 4.డీ
జవాబు:3

13.డీ.పీ.టీ వ్యాక్సిన్ వల్ల ఏయే వ్యాధుల నుండి రక్షణ?
1.డయేరియా, పోలియో, టెటానస్ 2.డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం
3.డయేరియా, పోలియో, టీబీ 4.ఏదీ కాదు
జవాబు:2

14.హైడ్రాలిక్ బ్రేక్స్ ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తాయి?
1. పాస్కల్ నియమం 2.న్యూటన్ 3వ నియమం 3.బెర్నౌలీ నియమం 4.ఏదీ కాదు
జవాబు:1

15.పీడనం/ప్రెషర్ పెరిగితే?
1.నీటి భాష్పీభవన స్థానం పెరుగుతుంది 2.నీటి భాష్పీభవన స్థానం తగ్గుతుంది 3.రెండూ 4.రెండూ కాదు.
జవాబు: 1
కొంచెం కంఫ్యూస్ చేసే ప్రశ్న.
మనం క్రమంగా భూమి నుండి పై పైకి పోయేకొద్దీ వాతావరణ పీడనం/ప్రెషర్ తుగ్గుతుంది. అప్పుడు నీరు త్వరగా మరిగి ఆవిరవుతుంది. పీడనాన్ని పెంచినపుడు, నీరు మరిగే ఉష్ణోగ్రత/భాష్పీభవన స్థానం కూడా పెరుగుతుంది. ఇదే ప్రెషర్ కుక్కర్ పనిచేసే సూత్రం.అందుకే ఎత్తయిన ప్రదేశాల్లో వంట చేసేటప్పుడు ప్రెజర్ కుక్కర్‌ను వాడుతారు.

16.సీఎఫ్ఎల్ బల్బులు ఎలక్ట్రిసిటి తక్కువ వినియోగం అయ్యేలా ఉండటానికి వాడుకుంటున్నాం. ఈ సీ.ఎఫ్.ఎల్. పూర్తి పేరు?
1.కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ 2.కాంపాక్ట్ ఫిలమెంట్ ల్యాంప్ 3.కండెన్స్డ్ ఫిలమెంట్ ల్యాంప్ 4.ఏదీ కాదు.
జవాబు: 1


17.
 క్రిందివాటిలో విధ్య్దయస్కాంతతరంగాల జత కానిది?
1.రేడియో, ఎక్స్-రే 2.మైక్రో, గామా 3.అల్ట్రా వయొలెట్, గామా 4.మైక్రో, బీటా
జవాబు: 4
రేడియో, మైక్రో, ఇన్‌ఫ్రారెడ్, (విసిబుల్), అల్ట్రా వయొలెట్, ఎక్స్, గామా మాత్రమే ఉన్నాయి. బీటా లేదు.

18.టీవీ రిమోట్ కంట్రోలర్ ఏ విద్యుతయస్కాంత తరంగాలని వాడుకుంటుంది?
1.ఇన్‌ఫ్రారెడ్ 2.రేడియో 3.మైక్రో 4.ఏదీ కాదు
జవాబు:1

19.కిందివాటిలో హైడ్రోజన్ యొక్క ఐసోటొప్స్ ఏవి?
1.ప్రోటియం 2.డ్యుటీరియం 3.ట్రీటియం 4.అన్నీ
జవాబు:4

20.వెల్లుల్లి వాసన ఉన్న మూలకం?
1.పాస్పరస్ 2.హైడ్రోజన్ 3.కార్బన్ 4.ఏదీ కాదు
జవాబు:1


21.హైడ్రోజన్‌/ఉదజని మూలకంలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య?
1)2 2)1 3)0 4)ఏదీ కాదు
జవాబు:2

22.గబ్బిలాలు రాత్రివేళలో సంచరించడానికి సహాయపడేవి?
1.వరారుణ/ఇంఫ్రారెడ్ కిరణాలు 2.అతిలీలలోహిత/అల్ట్రావయొలెట్ కిరణాలు 3.అతిధ్వని/అల్ట్రాసానిక్ తరంగాలు 4.ఏదీ కాదు
జవాబు:3


23.గోబర్ గ్యాస్‌లో ఉండేది?
1.బ్యూటేన్ 2.మీథేన్ 3.ప్రొపేన్ 4.ఏమీ కాదు
జవాబు:2

24.సహజ రబ్బర్ అనేది ఒక
1.కొల్లాయిడ్ 2.పాలిమర్ 3.జెల్ 4.సాలిడ్ సొల్యూషన్
జవాబు:2

25.MRI స్కానింగ్ లో R అంటే?
1.రెసనెన్స్ 2.రాపిడ్ 3.ర్యాండం 4.ఏదీ కాదు
జవాబు: 1
Magnetic Resonance Imaging

1.న్యూటన్ సుప్రసిద్ద 3వ సిద్ధాంతంలో చర్య, ప్రతి చర్యలు
1.వివిధ వస్తువుల మీద ప్రభావం చూపుతాయి
2.ఒకటే వస్తువు మీద ప్రభావం చూపుతాయి
3.ఎప్పుడూ సమానంగా ఉండవు
4.ఎప్పుడూ సమానంగా ఉంటాయి
జవాబు:4

2.విటమిన్ "డి" లోపం వల్ల వచ్చు వ్యాధి?
1.బెరి-బెరి 2.స్కర్వి 3.రికెట్స్ 4.రేచీకటి
జవాబు:3

3.కోబాల్ట్ 60 ని రేడియేషన్ చికిత్సలో వాడటంలో ముఖ్య ఉద్దేశ్యం అవి కింది కిరణాలని ప్రసరింపచేస్తాయని.
1.ఎక్స్-కిరణాలు 2.ఆల్ఫాట్ 3.గామా 4.బీటా
జవాబు:3

4.వేలిముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రానికి పేరు?
1. డాక్టిలోగ్రఫీ 2.న్యూమెస్ మాటిక్స్ 3.ఎథ్నోగ్రఫీ 4.ఏదీ కాదు
జవాబు:1

5.శూన్యవాదాన్ని ప్రతిపాదించింది?
1.ఐన్‌స్టీన్ 2.ఆచార్య నాగార్జున 3.మక్కలి గోసలిపుత్ర 4.సోక్రటిస్
జవాబు:2

6.జీ.పీ.ఎస్ అంటే?
1.గ్లోబల్ ప్లాంట్ సిస్టం 2.జియోగ్రాఫికల్ పొసిషనింగ్ సిస్టం 3.గ్లోబల్ పొసిషనింగ్ సిస్టం 4.జియో పొలిటికల్ సిస్టం.
జవాబు:3

7.పొడి మంచు అనేది కింది వాటిలో ఏది?
1.ఘన H2O 2.ఘన CO2 3.ఘన NO2 4.ఏదీ కాదు
జవాబు:2

8.కిందివాటిలో రంగులేని రక్తం ఉన్న జీవి ఏది?
1.వానపాము 2.పీత 3.బొద్దింక 4.గొంగళిపురుగు
జవాబు:3
మన శరీరంలో రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హిమోగ్లోబిన్. రక్తంలోని ఎర్ర రక్తకణాలలో హిమోగ్లోబిన్ ఉంటుంది.కేవలం ఒక్క ఎర్ర రక్త కణంలోనే దాదాపు 280 మిల్లిఒన్ హెమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయ్.వీటికి ఉన్న ముఖ్యమైన పని ఆక్సిజన్ ని ఊపిరితిత్తుల్లోంచి మోస్కొని వెళ్ళి టిష్యూలకి అందజేయటం, అక్కడనుండి మళ్ళీ కార్బన్-డై-ఆక్సైడ్ ని ఊపిరితిత్తుల్లోకి మోసుకెల్లడం.ఈ సిస్టం బొద్దింకలో లేదు అందుకే దాని రక్తం తెల్లరంగులో ఉంటుంది.

9.వర్ణాంధత్వం[కలర్ బ్లైండ్‌నెస్] కి సంభంధించిన విషయాల్లో / ఈ వ్యాధి ఉన్న రోగికి సంభంధించిన విషయంలో ఒక లక్షణం వీళ్ళు కొన్ని రంగులు చూడలేక పోవటం. అందులో ప్రధానమైన కలర్స్?
1.రెడ్ మరియు బ్లూ 2.గ్రీన్, పింక్ 3.రెడ్, గ్రీన్ 4.బ్లూ, పింక్
జవాబు:3

10.కృత్రిమంగా తయారుచేసిన సిల్క్/పట్టు ని ఇలా కూడా పిలుస్తారు
1.రేయాన్ 2.నైలాన్ 3.డెక్రాన్ 4.ఫైబర్ గ్లాస్
జవాబు:1

11.మన కిచెన్ లో వాడే గ్యాస్‌స్టౌ లలో ఉండే వాయువు/వాయువులు ఏది/ఏవి?
1.మీథేన్ 2.బ్యూటేన్,ప్రోపేన్ 3.కార్బన్ మోనాక్సైడ్,డై ఆక్సైడ్ 4.ఆక్సిజన్,కారబన్-డై-ఆక్సైడ్
జవాబు:2

12.గాలులూ, తరంగాల ద్వారా వచ్చే శక్తి?
1.కైనెటిక్ 2.ఎలక్ట్రికల్ 3.పొటెన్షియల్ 4.కైనెటిక్ & ఎలక్ట్రికల్
జవాబు: 1


13.
ద్రవపదార్థాలలో అత్యధిక ఉష్ణవాహకం [కండక్టర్] గలది ఏది?
1.ఆసిడ్ 2.ఆల్కహాల్ 3.మర్క్యురి 4.నీరు
జవాబు: 3

14.100వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? [జనవరి 2013]
1.హైదరాబాద్ 2.ముంబాయ్ 3.కోల్‌కతా 4.జైపూర్
జవాబు: 3

15.సౌరశక్తిని మార్చడానికి ఉపయోగ పడే మూలకం?
1.అల్ట్రా ప్యోర్ కార్బన్ 2.బెరీలియం 3.టాంటలుం 4.సిలికాన్
జవాబు: 4

16.మలేరియా వ్యాధి వ్యాప్తికి 'ఆడ ఎనాఫిలిస్‌' దోమ కారణమని పరిశోధనల ద్వారా మొదటగా గుర్తించినది?
1.రోనాల్డ్‌ రాస్‌ 2.లూయి పాశ్చర్ 3.చార్లెస్‌ ఎల్టన్‌ 4.ఎవరూ కాదు
జవాబు:1

17.రక్తం యొక్క గ్రూప్ ఏబీ[AB] గా ఉన్నవారు కొన్ని సమయాలలో యూనివర్సల్ స్వీకర్త గా పిలువబడుతున్నారు. డీనికి కారణం?
1.అంటీబాడీస్ ఉండటం వలన 2.అంటీబాడీస్ లేకపోవటం వలన 3.ఆంటిజెన్స్ లేకపోవటం వలన 4.ఆంటీబాడీస్, ఆంటీజెన్స్ రెండూ లేకపోవటంవల్ల
జవాబు:2


18.
ఎలక్ట్రిక్ బల్బ్‌లో వాడే వాయువు?
1.ఆక్సిజన్ 2.హైడ్రోజన్ 3.నైట్రోజన్ 4.కార్బన్-డై-ఆక్సైడ్
జవాబు:3

19."ది అడాసిటీ ఆఫ్ హోప్" [ఆశ యొక్క తెగువ/ధైర్యం] రచయిత ఎవరు?
1.దలై లామా 2.కలాం 3.బరాక్ ఒబామా 4.బాన్-కీ-మూన్
జవాబు:3

20.ప్రజా ప్రయోజన వ్యాజ్యం [కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ] ఏ దేశంలో ప్రారంభం అయ్యింది?
1.భారత్ 2.జర్మనీ 3.అమెరికా 4.ఐర్లాండ్
జవాబు:3

21.విస్తృత సంఖ్యలో నక్షత్రాలు సహజ గురుత్వాకర్షణతో ఒకే దగ్గరకి రావడాన్ని ఏం అంటారు?
1.నెబ్యులా 2.యూనివర్స్ 3.గాలక్సీ 4.కాన్స్టలేషన్
జవాబు:3

22.సాధారణ మానవునిలో ఉండే క్రోమోజోం సంఖ్య?
1.23 2.46 3.48 4.42
జవాబు:2

23.యూరియా రసాయన నామం?
1.కోరోథీన్ 2.ఎన్యూరిన్ 3.నైట్రిన్ 4.కార్బమైడ్
జవాబు:4

24.యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం?
1.రష్యా 2.అమెరికా 3.ఆస్ట్రేలియా 4.కెనడా
జవాబు:3

25.వైరల్ ఇంఫెక్షన్ ద్వారా సంక్రమి0చబడు వ్యాధి?
1.జాండిస్ 2.టైఫాయిడ్ 3.టెటనస్ 4.జలుబు
జవాబు:4





ఎకానమి


1.జాతీయాభివృద్ది మండలిని ఎప్పుడు ఏర్పాటు చేసారు?
1.1950 2.1951 3.1952 4.ఏదీ కాదు
జవాబు:3

2.ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్థాపించడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య [మినిమం]?
1.ఒకటి 2.రెండు 3.అయిదు 4.ఏడు
జవాబు:4

3.8వ పంచవర్ష కాలంలో మొదటిసారి ఏ అభివృద్దికి ప్రాధాన్యం ఇచ్చారు?
1.మాతా,శిశు 2.వ్య్వసాయ 3.మానవ వనరుల 4.కుఠీర పరిశ్రమల
జవాబు:3

4."గరీబీ హఠావో" ఏ ప్రణాళికా కాలపు నినాదం?
1.4వ 2.5వ 3.3వ 4.2వ
జవాబు:1

5.నాగార్జున్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఏ ప్రణాళికా కాలంలో మొదలైంది?
1.1వ 2.2వ 3.3వ 4.4వ
జవాబు:1

6.సెంట్రల్ ఆసియాకి చెందిన అబ్దుల్ రఝాక్ అనే యాత్రికుడు కింది వస్తువులని కొని, తనతో తీస్కెల్లడానికి విజయనగర సామ్రాజ్యం వచ్చాడు
1.దంతపు వస్తువులు 2.చిత్రలేఖనాలు 3.మందులు 4.వస్త్రాలు
జవాబు:4

7.ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకశక్తికి గీటు రాయి?
1.GDP 2.GNP 3.NNP 4.NDP
జవాబు:2
ఒక దేశ ఆర్థిక పరిస్థితికి ఇదే ఇండికేటర్. GDP దేశంలో ఉత్పత్తిని చెప్తుంది. కానీ GNP ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీ విదేశాల్లో చేసిన ఉత్పత్తిని కూడా అకౌంట్ లోకి తీస్కుంటుంది. ఒక దేశపు GDP మరియు GNP తేడా ఎక్కువ ఉంటే ఆ దేశం "అంతర్జాతీయ" వర్తకం, ఉత్పత్తి ఎక్కువ అని అర్థం.

8.ఉత్పత్తి కారకాలలో తప్పుగా ఇవ్వబడింది ఏది?
1.భూమి 2.కార్మికులు 3.పారిశ్రామిక చొరవ 4.ఏదీ కాదు
జవాబు:4
ఆప్షన్స్ 3 కూడా ఉత్పత్తికారకాలే

9.అమర్థ్యసేన్ కి ఆర్థికశాస్త్రంలో నోబుల్ ఎప్పుడు వచ్చింది? [ఇప్పటికీ ఆర్థిక శాస్త్రంలో ఇండియానుండి నోబుల్ ఈయనదే!]
1.2000 2.1998 3.1996 4.1994
జవాబు:2

10.జాతీయాదయం విషయంలో సరి కానిది?
1.బదిలీ చెల్లింపులు లెక్కలోకి తీస్కోకూడదు 2.చట్టవ్యతిరేకంగా పొందిన ఆదాయాన్ని జాతీయాదాయంలో కలపరాదు 3.ఉచిత సేవలు జాతీయాదాయంలో కలపాలి 4.అంతిమ వస్తువులన్నింటినీ పరిగణలోకి తీస్కోవాలి.
జవాబు:3


11.
 "డిస్పోసబుల్ ఇన్‌కం" అంటే ఏమిటి?
1.మందిరాలకి విరాళం గా ఇచ్చే ఆదాయం 2.ప్రభుత్వానికి పన్నులు కట్టగా మిగిలిన ఆదాయం 3.ప్రభుత్వం వృద్దులకి పెన్షన్ రూపంలో ఇచ్చేది 4. ఏదీ కాదు
జవాబు:2

12.భారత్ లో జాతీయాదాయాన్ని లెక్కగట్టేది?
1.ఆర్థిక సంఘం 2.ప్రణాళికా సంఘం 3.కేంద్ర గణాంక సంస్థ 4.కేంద్ర అభివృద్ది మండలి
జవాబు:3
CSO

13."వినియోగదారులు మానవ వనరుల నుండి లేదా భౌతికవనరులనుండి పోందే వస్తుసేవల మొత్తమే జాతీయాదాయం" అన్నదెవరు?
1.పిగూ 2.మార్షల్ 3.రాజ్ కృష్ణ 4.ఏదీ కాదు
జవాబు:4
ప్రొ. ఫిషర్ గారు ఉత్పత్తి కి బదులు "వినియోగాన్ని" బేస్ చేస్కొని డెఫినిషన్ ఇచ్చారు.
మార్షల్ గారు "ఉత్పత్తి" ని బేస్ చేస్కొని జాతీయాదాయం కి డెఫినిషన్ ఇచ్చారు. [ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన వస్తువులు మరియు సేవల సమూహమే జాతీయాదాయం]
పిగూ: పిగూ ఉద్దశ్యంలో "ద్రవ్యంతో కొల్వగల వస్తు, సేవల ఉత్పత్తి మొత్తమే జాతీయాదాయం" [ఒక భార్య భర్తకి చేసే సేవలు జాతీయ ఆదాయం కాదు. కానీ అదే స్త్రీ, ఒక టీచర్ గా చేసే సేవ జాతీయ ఆదాయం కిందకి వస్తుంది.]

14.ఒక దేశ జాతీయ ఆదాయం 110 కోట్లు, ఆ దేశ జనాభా 11 కోట్లు. ఆ దేశ తలసరి ఆదాయం ఎంత?
1.99 2.10 3.11 4.ఏదీ కాదు
జవాబు:2
తలసరి ఆదాయం = జాతీయాదాయం/దేశజనాభా

15.భారత్‌లో శాస్త్రీయంగా జాతీయాదాయాన్ని లెక్కగట్టింది ఎవరు?
1.నౌరోజీ 2.వీ.కే.ఆర్.వీ రావ్ 3.మహాలనోబిస్ 4.ఏదీ కాదు
జవాబు:2
నౌరోజీ గారి లెక్కలు అశాస్త్రీయమైనవి.

16.ఆర్థిక వ్యవస్థ లోని ప్రధాన రంగాలలోని "ప్రాథమిక రంగంలో" తప్పుగా ఇవ్వబడినది ఏది?
1.వ్యవసాయం 2.అటవీసంపద 3.గనుల తవ్వకం 4.ఏదీ కాదు
జవాబు:4
గనుల తవ్వకం ప్రాథమిక రంగంలోకే వస్తుంది.
ప్రాథమిక రంగం:
1.వ్య్వసాయం, 2.అటవీ సంపద 3.మత్స్య సంపద 4.గనుల తవ్వకం.
సహజవనరులని ప్రత్యక్షంగా ఉపయోగించుకొనేది ప్రాథిమిక రంగం.రెండో రంగం వస్తువులని తయారుచేస్తుంది. మూడో రంగం సేవలని తయారు చేస్తుంది.
మనకి సాధారణంగా 3 రంగాలున్నాయ్. అవి 3 కాకుండా ఇంకో రెండు కూడా ఉన్నాయ్.
1.పారిశ్రామిక రంగం: ప్రాథమిక రంగంలోని గనుల తవ్వకం తీసి ద్వితీయ రంగానికి కలిపితే వస్తుంది.
2.వ్యవసాయ రంగం: ప్రాథమిక రంగంలోని గనుల తవ్వకం తీసి వేస్తే వ్యవసాయ రంగం వస్తుంది.

17.అర్థశాస్థ్రంలో తొలి నోబుల్ బహుమతి ఎవరిది?
1.అమర్యసేన్ 2.రగ్నార్ ఫ్రిష్ 3.మార్షల్ 4.ఫిషర్
జవాబు:2

18.మనీ లాండరింగ్ అంటే?
1.ప్రభుత్వ అనుమతి లేకుండా డబ్బు విదేశాలలో దాచుకోడం
2.బ్లాక్ మనీ ని వైట్ మనీగా మార్చుకోడం
3.చట్టవ్యతిరేకంగా వచ్చిన డబ్బును అప్పులకి తిప్పడం
4.ఏదీ కాదు?
జవాబు:1

1."సమ్మిళిత వృద్ధి" లక్ష్య సాధనకి ఏ ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారు?
1.6వ 4.7వ 3.11వ 4.7వ
జవాబు:3

2.వాస్తవిక వేతనం అంటే ?
1. యజమాని శ్రామికుడికి చెల్లించే ద్రవ్యవేతనం
2. శ్రామికుడు పొందిన వేతనానికి ఉండే కొనుగోలు శక్తి
3. శ్రామికుడి శ్రమకు యజమాని చెల్లించే నిజ వేతనం
4. యజమాని పొందిన వాస్తవ ఆదాయంలో శ్రామికుడి వాటా
జవాబు:2

3.1933లో అర్థశాస్త్రంలో "మైక్రో, మాక్రో" అను పదాలని ఉపయోగించిన శాస్త్రవేత్త?
1.జేమ్‌స్ టోబిన్ 2.రగ్నార్ ఫ్రిస్క్ 3.ఫిషర్ 4.గర్లీ
జవాబు:2


4.
వస్తువు ధరలో మార్పు ఫలితంగా దాని వినియోగంలో మార్పు రానట్లయితే. వస్తువు డిమాండ్‌ ఏ విధంగా ఉంటుంది?
1. సంపూర్ణ వ్యాకోచత్వం 2. సంపూర్ణ అవ్యాకోచత్వం
3. అసంపూర్ణ వ్యాకోచత్వం 4. అసంపూర్ణ అవ్యాకోచత్వం
జవాబు:2

5.కిందివాటిలో దేనికి సంభంధించిన ఆదాయాన్ని లెక్కపెట్టడానికి "వ్యయ పద్దతి" పాటిస్తారు?
1.వ్య్వసాయరంగం 2.గనుల రంగం 3.నిర్మాణ రంగం 4.రవాణారంగం
జవాబు:3


6.
కిందివాటిలో "ద్వితీయ రంగంలోనికి" రానిది?
1.విద్యుత్, నీటి సరఫరా 2.నిర్మాణ రంగం 3.గనుల క్వారీయింగ్ 4.ఉత్పాదక రంగం
జవాబు:3


7.
జీ.డీ.పీ + విదేశాలనుండి వచ్చే నికర కారకాల ఆదాయం = ?
1.స్థూల జాతీయోత్పత్తి 2.నికర జాతీయోత్పత్తి 3.నికర దేశీయోత్పత్తి 4.తలసరి ఆదాయం
జవాబు:1


8.
ఏ పరిస్థితులలో ప్రస్థుత ధరల వద్ద జాతీయాదాయం, స్థిర ధరల వద్ద జాతీయాదాయం కంటే ఎక్కువ?
1.పెరుగుతున్న ధరలు 2.తగ్గుతున్న ధరలు 3.స్థిరంగా ఉన్న ధరలు 4.మారుతున్న ఖర్చులు
జవాబు:1


9.
భారతదేశంలో వ్యవసాయ రంగంలోని ఉత్పత్తి విలువని లెక్కపెట్టడానికి కిందివాటిలోని ఏ పద్దతి ఉపయోగిస్తారు?
1.నికర ఆదాయ పద్దతి 2.నికర ఆదాయ మరియు వ్యయ పద్దతి 3.నికర ఉత్పత్తి పద్దతి 4.నికర ఉత్పత్తి మరియు ఆదాయ పద్దతి.
జవాబు:3


10.
జాతీయాదాయం అంటే?
1.ప్రభుత్వ ఆదాయం 2.ప్రభుత్వ బడ్జెట్ 3.ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు 4.అన్ని కారకాల మొత్తం ఆదాయం
జవాబు:4


11.
ఒక దేశ తలసరి ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది?
1.జీ.ఎన్.పీ, జనాభా పెరుగుదల రేటు సమానంగా ఉన్నపుడు
2.జీ.ఎన్.పీ, జనాభా రెండూ తగ్గినపుడు
3.జనాభాతో పోలిస్తే జీ.ఎన్.పీ వేగంగా వృద్దిచెందినపుడు
4.జనాభా కన్నా జీ.ఎన్.పీ తక్కువగా వృద్ది చెందినపుడు
జవాబు:3

12.నికర దేశీయోత్పత్తి ఎల్లపుడూ స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు?
1.మూలధన దిగుబడులని పూర్తిగా నిషేధించలేననందువల్ల
2.పరోక్ష నిరుద్యోగం కారణంగా స్థూల దేశీయోత్పత్తికి గండి పడటం.
3.మూలధన పరికరాలు తరుగుదలకి గురవటం వలన
4.మూలధనం ఉత్పత్తి నిష్పత్తి తక్కువ ఉండటం వలన
జవాబు:3

13.కిందివాటిలో దేన్ని జీ.డీ.పీ లెక్కించడానికి కలుపుతారు?
1.ప్రభుత్వం ప్రజలకి "బాండ్" ని అమ్మిన ధర 2.గృహిని కుటుంబానికి అందించిన సేవలు
3.వాడిన కార్ల డీలర్ అందించిన సేవలు 4.వృద్దులకి చెల్లించే పెన్షన్
జవాబు:3

14.ఒకదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందుతున్నకొద్దీ, జాతీయాదాయంలో సేవారంగం వాటా?
1.పెరుగుతుంది 2.తగ్గుతుంది 3.స్థిరం అవుతుంది 4.ఏదీ కాదు
జవాబు:1


15.
మొత్తం జాతీయ వినియోగం అంటే?
1.ప్రభుత్వ వినియోగం 2.ప్రైవేట్ వినియోగం 3.ఎగుమతులు మాత్రమే 4.ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగాల మొత్తం
జవాబు:4


16.
స్థూల జాతీయోత్పత్తిని గణించేటప్పుడు దేనిని పరిగణలోకి తీసుకోరు?
1.నికర విదేశీ పెట్టుబడులు 2.ప్రైవేట్ పెట్టుబడులు 3.దేశప్రజల తలసరి ఆదాయం 4.ప్రభుత్వం కొనుగోలుచేసే వస్తువులు
జవాబు:3


17.
కిందివాటిలో జాతీయాదాయం అంటే?
1.మార్కెట్ ధరలవద్ద స్థూల దేశీయోత్పత్తి 2.ఉత్పత్తికారకాలదృష్ట్యా నికర జాతీయోత్పత్తి
3.ఉత్పత్తికారకాలదృష్ట్యా నికర దేశీయోత్పత్తి 4.మార్కెట్ ధరలవద్ద నికర జాతీయోత్పత్తి
జవాబు:2

18. i)2014-15 GDP ని 5.4-5.9 మధ్య ఉండవచ్చు అని మన కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది.
మన GSDP 5.3 అని అంచనా వేశారు
ii)భారతదేశ తలసరి ఆదాయం:88,533, రాష్ట్ర తలసరి ఆదాయం: 1,03,889 గా ఉంది

19.ఏ కమిటీ సిఫారసులమేరకు నాబార్డ్ ని ఏర్పాటు చేశారు?
1.శివరామన్ 2.రంగరాజన్ 3.వంచూ 4.నరసిమ్హన్
జవాబు:1

20.భారత ఆర్థిక వ్యవస్థ ఏరకమైనది?
1.సామ్యవాద ఆర్థిక 2.పెట్టుబడీదారి ఆర్థిక 3.మిశ్రమ ఆర్థిక 4. ఏదీకాదు
జవాబు:3

21."గ్రామీణ మహిళల స్థితిగతులని మెరుగుపరచడం" అనే ఉద్దేశ్యంతో మొదలైంది?
1.DWCRA 2.DPAP 3.SFDA 4.JRY
జవాబు:1

22.నరసిమ్హం కమిటీ దేనికి సంభంధించింది?
1.బ్యాంకింగ్ రంగం 2.ఎనర్జీ రంగం 3.రోడ్ సేఫ్టీ 4.పన్ను సంస్కరణలు
జవాబు: 1

23.ఆర్థిక సంఘం విషయంలో సరికానిది?
1.భారత రాజ్యాంగం యొక్క 280వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.
2.ప్రతి ఐదేళ్ళకోసారి నియమిస్తారు. ఈ సంఘంలో ఒక చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు.
3.ఈ కమిషన్, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధాల పై ప్రధానంగా పనిచేస్తుంది.
4.13వ ఆర్ధిక సంఘం వైవి రెడ్డి నేతృత్వంలో 2015 నుండి 2020 వరకు కొనసాగనుంది.
జవాబు:4
14వ సంఘం వైవీ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైంది. 13కి విజయ్ కేల్కర్ నేతృత్వం వహించారు.
మెంబర్స్ రిక్వెస్ట్ వల్ల ఎకానమీని ఈ గ్రూప్‌లో కవర్ చెయ్యట్లేదు.కింద కొంత ఇంఫర్మేషన్ ఇచ్చాను.గ్రూప్1 వారికి పనిచేస్తుంది.
ఈ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది అయితే కొన్ని కేంద్ర పథకాలను రాష్ర్టాలకు అప్పచెప్పింది.ఇది ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో తీస్కోడమే అని విమర్శించే వాళ్ళూ ఉన్నారు. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రకి రూ. 385 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి 149.87 కోట్లు విడుదల చేసింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ సర్కారు 1.15[1,15,689] లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపొందించింది.బడ్జెట్‌లో కేంద్రం నుండి వచ్చే పన్నుల వాటాను[2015-16 అంచనా] 12,823.25 కోట్ల రూపాయలుగా లెక్క చూపారు. వాస్తవానికి కేంద్రం పెంచిన 42 శాతం పెంచిన వాటా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి పన్నుల ఆదాయం కింద 15,198 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 14వ ఆర్థిక సంఘం నిబంధనలతో అది 12,823 కోట్లకు తగ్గిపోయిందని సంబంధిత అధికారవర్గాల అభిప్రాయం.తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకూ 2.939 శాతం చొప్పున సేవా పన్నుల్లో వాటా రాగా, 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం అది 2.50 శాతానికి కోత పడినట్లు లెక్క అని వీళ్ళ అభిప్రాయం.వాటర్‌ గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ తదితర పథకాల అమలులో ఈ కోతయొక్క ప్రభావం ఉంటుందని కూడా అనుకుంటున్నారు. దీనికి తోడు మన రాష్ట్ర అప్పు 61,711 కోట్లు గా ప్రస్తుతం చూపించారు. పూర్తిగా ఆంధ్ర, తెలంగాణా అప్పులు విభజించబడలేదు. విభజించాక ఈ అప్పు పెరగొచ్చు. ఈ అప్పుకు కట్టే వడ్డీ 7958 కోట్లు! అంటే బడ్జెట్‌లో 7% వడ్డీలకే వెల్తుంది!!
తెలంగాణా బడ్జెట్ 2015-16:
-వార్షిక బడ్జెట్: రూ.1,15,689 కోట్లు
-ప్రణాళిక వ్యయం: రూ.52,383 కోట్లు
-ప్రణాళికేతర వ్యయం: రూ.63,306 కోట్లు
-ఆర్థిక మిగులు: రూ.531 కోట్లు
-మిషన్ కాకతీయ, చిన్ననీటిపారుదల: 2083 కోట్లు
-వాటర్‌గ్రిడ్: రూ.4,000 కోట్లు

24.ప్రణాళికాసంఘం మొదటి అధ్యక్షుడు?
1.బాబూ రాజేంద్రప్రసాద్ 2.టీ.ఎన్ శేషు 3.నెహ్రూ 4.మోంటెక్ సింగ్ అహ్లువాలియా
జవాబు: 3

25.మొదటి పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందిచబడింది?
1.మహలనోబిస్ 2.గాడ్గిల్ 3.నెహ్రూ 4.హరాడ్-డోమర్
జవాబు: 4

Monday, November 2, 2015

భారతరాజ్యాంగం & రాజనీతి శాస్త్రం

1. భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని వర్ణించింది ఎవరు?
1.కేసీ వేర్ 2.కేటీ షా 3.డీఎన్ బెనర్జీ 4.అంబేడ్కర్
జవాబు:3

2. "కుడి అరసు" [ప్రజల ప్రభుత్వం] అను తమిళ పత్రిక ప్రారంభించింది?
1.రామస్వామి నాయికర్/ పెరియార్ రామస్వామి 2. సుబ్రహ్మణ్య భారతియార్ 3.తిరుప్పుర్ కుమారణ్ 4.చిదంబరం పిళ్ళై
జవాబు:1


3. 
 SNDP [శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం] అనే సంస్థని 1903లో, కేరళ రాష్ట్రంలో స్థాపిoచింది ఎవరు?
[ఎజవా అను వెనుకబడిన తరగతికి చెందినవారి అభ్యున్నతికోసం]

1.పెరియార్ రామస్వామి 2.నారాయణగురు 3.త్యాగరాయ శెట్టి 4.టీ.ఎం నాయర్
జవాబు:2

4. స్థానిక ప్రభుత్వ లక్షణాలలో నిజం కానిది ఏది?
1.స్థానిక ప్రభుత్వాలు చట్టబద్ధమైన హోదా కలిగి ఉండాలి
2.ఈ ప్రభుత్వాలు శాసనసభ రూపొందించిన ప్రత్యేక చట్టంద్వారా ఏర్పడతాయి
3.కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ హోదాలకంటే తక్కువ హోదా కలిగి ఉంటాయి.
4.ప్రజలపైన, సంస్థలపైనా దావా చేయడానికి అధికారం కలిగి ఉంటాయి
జవాబు:4

5.61వ రాజ్యాంగ సవరణ జరిగిన సమయంలో భారత్ ప్రధానమంత్రి ఎవరు?
1.ఇందిరాగాంధి 2.రాజివ్ గాంధి 3.పీవీ నరసిమ్హారావు 4.మొరార్జీ దేశాయ్
జవాబు:2


6. "జై భీం" అంటే?
1.అంబేడ్కర్ ప్రేరణతో బౌద్ధ మతం స్వీకరించిన దళితులకి సంభంధించిన పదం
2.స్వాత్రంత్ర్యానంతరం అంబేడ్కర్ ష్తాపించిన మతం
3.కొమరం భీం స్మారకార్థం పేరు మార్చబడిన ఒక నీటిపారుదల ప్రాజెక్ట్
4.ఏదీ కాదు
జవాబు:1

7. పంచాయితీరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారి ప్రవేశ పెట్టబడింది ఎక్కడ?
1.నాగ్‌పూర్ 2.నాగౌర్ 3. శ్రీకాకుళం 4.జునాగడ్
జవాబు:2

8. పంచాయతీరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారిగా 1959, అక్టోబర్ 2న ఏ రాష్ట్రంలో అమలు చేయబడింది ?
1) ఆంధ్ర ప్రదేశ్ 2) మహారాష్ట్ర 3) రాజస్థాన్ 4) గోవా
జవాబు:3) రాజస్థాన్

9. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో "సామ్యవాద, లౌకిక" పదాలతో పాటూ చేర్చిన మరో పదం?
1.సమగ్రత 2.ఏకత 3.ఆర్థిక న్యాయం 4.సోదరభావం
జవాబు: సమగ్రత

10. భారత రాజ్యాంగం పైన వ్యాఖ్యానించే అధికారం ఎవరికుంది? 
[Group1, 1994]
1.రాష్ట్రపతి 2.పార్లమెంట్ 3.సుప్రీంకోర్ట్ 4.లోక్ సభ అధ్యక్షుడు
జవాబు: సుప్రీం కోర్టుకి ఉంది
రాష్ట్రపతి రాజ్యంగ అధిపతి.
రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఉంది.
ఆప్షన్స్ మళ్ళీ చూస్కొండి

11. భారతరాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు.
1) 63,96,729 2)1 కోటి 90 లక్షలు  3) 2 కోట్ల 2లక్షల 2వందలు 4) 3, 55, 676
[గ్రూప్2, 2003] [వివరణ:.ఈ కమిటీ 1946 లో ఇండియా సందర్శించి స్వాతంత్ర్యానంతరం తమను తాము పరిపాలించుకోడానికి అవసరమైన కమిటీ ఏర్పాటుపైన ప్రతిపాదన చేసింది.ఇదే ప్రశ్నని 2003 లోనే గ్రూప్2 బ్యాక్ లాగ్ పొస్టులు భర్తీ చేసేటప్పుడు వెరే లా అడిగారు."ప్రశ్నలో అడగబడ్డ కమిటీ ని ఇండియాకి పంపడంలో అసలు ఉద్దేశ్యం ఎమిటి అని అడిగారు" సమాధనం , "రాజ్యాంగ సమస్యకి సరైన పరిష్క

14. "ఆదేశిక సూత్రాలు ముందు తేదీ కలిగి ఉన్న చెక్కు లంటివి "అని వ్యాఖ్యానించింది? [A cheque on bank payable at the convenience of the bank]
1. కే.టీ షా 2.కే.సీ. వేర్ 3.నెహ్రూ 4.ఎం.ఎన్ రాయ్.
జవాబు:1. కే.టీ షా


15. భారత దేశంలో సర్వోన్నతమైనది గా దేనిని పేర్కొంటారు?
1.పార్లమెంట్ 2.భారత ప్రభుత్వం 3.రాజ్యాంగం 4.భారత ప్రజలు
జవాబు:3.రాజ్యాంగం


16. ఎన్నో షెడ్యూల్‌లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలను పేర్కొన్నారు ?
1) 2వ షెడ్యూల్ 2) 4వ షెడ్యూల్ 3) 6వ షెడ్యూల్ 4) 7వ షెడ్యూల్
జవాబు: 4) 7వ షెడ్యూల్
7వ షెడ్యూల్ లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలకు సంభంధించిన జాబితాలను ఇందులో పేర్కొన్నారు. ఆర్తికల్ 246 ఈ అంశాలను తెలుపుతుంది. కేంద్ర జాబితాలో 99 అంశాలు. రాష్ట్ర జాబితాలో 61 అంశాలు. ఉమ్మడి జాబితాలో 52 అంశాలుంటాయి

17. రాజ్యాంగంలో ఏ ప్రకరణ [ఆర్టికల్] జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోంది ? 
[అంబేద్కర్ గారు ఈ అర్టికల్ డ్రాఫ్ట్ చేయడానికి ఇష్టపదలేదనీ, తర్వాత గోపాల స్వామి అయ్యంగార్ గారు ద్రాఫ్ట్ చేసారనీ అంటారు.]
1)ప్రకరణ 370 2)ప్రకరణ 368 3)ప్రకరణ 375 4)ప్రకరణ 386
జవాబు:1

18. రాజ్యాంగం లోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపు నిరోదక సూత్రాలను తెలుపుతుంది? 
[1985 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోదక చట్టం చేస్తూ, 10వ షెద్యూల్ లొ చేర్చింది. రాజకీయ పార్టీ అనే పదం ఈ షెడ్యూల్ లో మాత్రమే ఉంది] 
[సివిల్స్ 2005 ప్రిలింస్ లో అడిగారు]
1.9వ 2.10వ 3.11వ 4.12వ
జవాబు:2.10వ
రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ని చేర్చింది. రాజకీయపార్టీల గుర్తుతో గెలిచిన వారు మరొక పార్టీలో చేరితే సభాధిపతులు వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.

19. భారత రాజ్యాంగం పైన వ్యాఖ్యానించే అధికారం ఎవరికుంది? 
[Group1, 1994]
1.రాష్ట్రపతి 2.పార్లమెంట్ 3.సుప్రీంకోర్ట్ 4.లోక్ సభ అధ్యక్షుడు
జవాబు:3.సుప్రీంకోర్ట్
రాజ్యాంగాన్ని అధికారకంగా వ్యాఖ్యానించే అధికారం సుప్రీం కోర్ట్ కి ఉంది.
రాష్ట్రపతి-రాజ్యాంగానికి అధిపతి.
పార్లమెంట్ - కి రాజ్యాంగ సవరణాధికారం ఉంది

20. 'చింతన, భావప్రకటన, విశ్వాసం, ప్రార్ఠనా స్వేఛ్చ ' అనే పదాలు రాజ్యాంగం లో ఏ భాగంలో ప్రస్తావించారు.[Grop2, 2000]
1.పీఠిక 2.కేంద్ర న్యాయస్థానం 3.ఆదేశిక సూత్రాలు 4.ప్రాథమిక హక్కులు.
జవాబు:1
పీఠిక : భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన (చింతన), భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల లోస్వాతంత్య్రాన్ని (ప్రార్థనా స్వేచ్చ. అందుకే మనది లౌకిక రాజ్యం. అధికార మతం అంటూ ఏదీ లేదు), అంతస్థుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాం

21. భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం?
1)11 నెలల 18 రోజులు 2)18 నెలల 11 రొజులు 3)11 నెలల 12 రొజులు  4) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
జవాబు:4

22. భారత్ రాజ్యంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విద్యుక్త అంశాలున్నాయి?
1)29 2)18 3)26 4)28
ఇది 2008 గ్రూప్2 లో అడిగిన ప్రశ్న.
జవాబు:1)29

23. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకి చట్టం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం ఉంది? (2008, Accounts officer exam, appsc)
1.6 2.5 3.4 4.3
జవాబు:4; Article 3

24. భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం?
1)11 నెలల 18 రోజులు
2)18 నెలల 11 రొజులు
3)11 నెలల 12 రొజులు 
4) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
జవాబు:4

25. భారత రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి?
1.రెండు  2.మూడు  3.నాలుగు  4.ఏదీకాదు
జవాబు:2. మూడు
రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు రాజ్యాంగంలో పొందుపరిచారు. అవి 3

1)జాతీయ అత్యవసరాలు 2)రాష్ట్రపతి పాలన 3)ఆర్థిక అత్యవసరాలు



1.జీరో అవర్‌ కాలపరిమితి ఎంత
1) నిర్ణిత కాలపరిమితి ఉండదు 2) ఒకగంట 3) 45 నిమిషాలు 4) అర్థగంట
జవాబు:1
ప్రశ్నోత్తరాల సమ్యం తర్వాత "జీరో అవర్" ఉంటుంది. 12 గంటలకి మొదలవటం వల్ల ఈ పేరు రావొచ్చు. స్పీకర్ కి సభ్యులు ముందే నోటిస్ ఇచ్చి, ఏ విషయం పైన మాట్లాడలుకుంటున్నారో క్లియర్ గా నోటిఫై చేస్తారు. ఇది పార్లమెట్ అధికారిక ప్రొసీజర్ గా గుర్తించబడనందున ఎన్ని విషయాలపైన, ఎంత సేపు మాట్లాడాలి అనే దానిపైన ఏ విధమైన రూల్స్ లేవు. [స్పీకర్ నిర్ణయం].

2.ఇటీవల నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఎన్ని సీట్లు రిజర్వ్‌ చేశారు
1) 111 2) 121 3) 131 4) 141
జవాబు:3
మొత్తం సీట్స్=543 [+2]
రిసర్వ్డ్ సీట్స్ = 131 [ముందు 120 ఉండేవి]
ఇందులో:
ఎస్.సీ = 84 [ముందు 79]
ఎస్.టీ = 47 [ముందు 41]
3.మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ ఆర్డినెన్సులు జారీ చేయటం ఏ రకమైన అధికారం
1) శాసన అధికారం 2) కార్యనిర్వహణ అధికారం 3) విచక్షణ అధికారం 4) అత్యవసర అధికారం
జవాబు: 1
రాష్ట్రశాసనసభ సమావేశంలో లేనపుడు, ప్రత్యేక అవసరాల్లో ప్రభుత్వ అవసరాల కోసం సీ.ఎం, మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. [ఆర్టికల్ 213].
ఈ ఆర్డినెన్స్ ని ఉభయసభలూ సమావేశం అయిన తర్వాత 6 వారాల్లో ఆమోదింపబడాలి లేదంటే, ఇది రద్దవుతుంది. ఈలోపు గవర్న్మెంట్ ఆర్డినెన్స్ స్థానంలో బిల్ ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ లో పేర్కొన్న అంశాలపైన శాసనసభ అమోదం పొందవచ్చు. ఈ ఆర్డినెన్స్ కి చట్టానికున్న హోదా, అధికారం ఉంటాయ్.
ఆర్డినెన్స్ జారీ చేయటం అనేది మంత్రిమండలి "సలహా" తోనే చేయటంవల్ల విచక్షణ అధికారంగా దీన్ని లెక్కలోకి తీస్కోవద్దు. "మంత్రి మండలి సలహాలు తీస్కోకుండా తీస్కొనేవి" విచక్షణాధికారాలు.[ఉదాహరణ: రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన కేంద్రానికి నివేదికలు పంపటం]
శాసన అధికారాలు = రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించినవి
కార్యనిర్వాహక అధికారాలు = పరిపాలన, నియామకాలు, తొలగింపులు మొదలైనవి.

4.అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానమంత్రి
1) ఇందిరాగాంధీ 2) మన్మోహన్‌సింగ్‌ 3) రాజీవ్‌గాంధీ 4) జవహర్‌లాల్‌ నెహ్రు
జవాబు:4
5.
 దేశంలో మొదటి మహిళా గవర్నర్‌
1) పద్మజానాయుడు 2) దుర్గాభారు దేశ్‌ముఖ్‌ 3) సరోజినీ నాయుడు 4)నయనతార సెహగల్‌
జవాబు:3

6.ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలోను, రాష్ట్రాల్లోను మంత్రి మండలి సభ్యుల సంఖ్యను లోక్‌సభ, విధానసభ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదనీ నిర్ణయించారు?
1) 90 వ సవరణ 2) 91వ సవరణ 3) 92వ సవరణ 4) ఏదీ కాదు
జవాబు:2
7.ఒక బిల్లు స్వభావాన్ని బట్టి నిబంధన 110 ప్రకారం బిల్లు సాధారణ బిల్లు లేదా ఆర్థిక బిల్లు అని ఎవరు నిర్ణయిస్తారు
1) రాష్ట్రపతి 2) కేంద్ర ఆర్థిక మంత్రి 3) లోక్‌సభ స్పీకర్‌ 4) అటార్నీ జనరల్‌
జవాబు:3
8.భారత్‌ రాజ్యాంగాన్ని అర్థ సమాఖ్యగా వర్ణించింది? [గ్రూప్2, 2003]
 
1.అంబేడ్కర్ 2.ఐవర్ జెన్నింగ్స్ 3.కేసీ వేర్ 4.ఎవరూ కాదు.
జవాబు:3
9.భారత్ వాస్తవానికి ఒక
1.వాస్తవిక సమాఖ్య వ్యవస్థ 2.అర్థ సమాఖ్య 3.కేంద్రీకృత ధోరణి గల సమాఖ్య 4.రాష్ట్రాల కలయిక
జవాబు:4
రాజ్యాంగం మొత్తం వెతికినా "సమాఖ్య" అనే పదం ఉండదు.ఆర్టికల్ 1, మనదేశాన్ని భారత్ అనీ, భారత్ అంటే రాష్ట్రాల కలయిక అనీ చెప్తుంది
10.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభంధించి రాజ్యాంగంలోని నిభంధనలని ఏవిధంగా సవరించవచ్చు?[సివిల్స్-1997]
1.పార్లమెంటుకు మెజారిటీ సభ్యులు హాజరై వారిలో 2/3 వంతు మెజారిటీతో అమోదించడం
2.మెజారిటీ రాష్ట్ర శాసన వ్య్వస్థలు అమోదించిన పార్లమెంట్ తీర్మానంతో
3.పార్లమెంట్ ఒక్కొక్క సభ సాధారణ మెజారిటితో 
4.పార్లమెంట్ ఒక్కొక్క సభ 3/4 వంతు మెజారిటీతో
జవాబు:3
11.కమ్యూనల్ ఎలెక్టొరేట్ పితామహుడు?
1. లార్డ్‌మింటో 2. చేమ్స్‌ఫర్డు 3.మాంటేంగ్‌ 4.ఎవరూ కాదు
జవాబు:1
1909 మింటో మార్లే సంస్కరణలు ముస్లిం వాళ్ళు ముస్లిం సభ్యులని ఎన్నుకొనే విధానం ని ప్రవేశ పెట్టాయి.
లార్డ్‌మింటో : ఈయన ఈ సంస్కరణల సమయంలో ఇండియాకి వైస్రాయి. అందుకే ఈ పేరు.

12.రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు దీనితో ప్రత్యేక సంభంధం ఉంది
1.మింటో మార్లే 2. క్యాబినెట్ ప్రతిపాదనలు 3. మౌంట్ బాటన్ ప్రతిపాదనలు 4.అట్లి ప్రకటన
జవాబు:2

13.రాష్ట్రపతి/గవర్నర్ పదవిలో ఉండగా నేర విచారణ జరుపరాదని అర్థం ఇచ్చే ఆర్టికల్ ఏది?
1.నేర విచారణకి అందరూ హాజరు కావాల్సిందే 2.ఆర్టికల్ 361 3.ఆర్టికల్ 308 4.ఏదీ కాదు.
జవాబు:2
14.కొత్తసంవత్సరం నాడు ప్రతిజ్ఞ చేసి తెల్లారే మరిచిపోయే "నూతన సంవత్సర నిర్ణయాలవంటివి" ఆదర్శసూత్రాలు అన్నదెవరు?
1.నసీరుద్దీన్ 2.కేటీ షా 3.కేసీ వేర్ 4.ఎవరూ కాదు.
జవాబు:1
15.ప్రాథమిక విధులని ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1.బల్వంతరాయ్ కమిటీ 2.స్వరణ్ సింగ్ కమిటీ 3.సర్కారియా కమీషన్ 4.వాంచూ కమిటీ
జవాబు:2
16.ఆదేశసూత్రాలన్నీ అమలైతే ఈ దేశం భూతల స్వర్గం అవుతుంది అన్నదెవరు.
1.ఎం సీ చాగ్లా 2.అంబేడ్కర్ 3.గంధీ 4.ఎవరూ కాదు.
జవాబు:1

1.రాష్ట్ర కంటిన్‌జెన్సీ నిధి [అనిశ్చయమైన నిధి] ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?
1.ముఖ్యమంత్రి 2.ఆర్థికమంత్రి 3.గవర్నర్ 4.హైకోర్ట్
జవాబు:3

2.లోక్‌సభ అమోదంపొందిన ద్రవ్య బిల్లు ఎన్ని రోజులలోపు రాజ్యసభలో అమోదం పొందాలి?
1.15 2.30 3.28 4.14
జవాబు:4

3.పంచాయితీరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారి ప్రవేశ పెట్టబడింది ఎక్కడ?
1.నాగ్‌పూర్ 2.నాగౌర్ 3. శ్రీకాకుళం 4.జునాగడ్
జవాబు:2

4.స్థానిక ప్రభుత్వ లక్షణాలలో నిజం కానిది ఏది?
1.స్థానిక ప్రభుత్వాలు చట్టబద్ధమైన హోదా కలిగి ఉండాలి
2.ఈ ప్రభుత్వాలు శాసనసభ రూపొందించిన ప్రత్యేక చట్టంద్వారా ఏర్పడతాయి
3.కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ హోదాలకంటే తక్కువ హోదా కలిగి ఉంటాయి.
4.ప్రజలపైన, సంస్థలపైనా దావా చేయడానికి అధికారం కలిగి ఉంటాయి
జవాబు:4

5.61వ రాజ్యాంగ సవరణ జరిగిన సమయంలో భారత్ ప్రధానమంత్రి ఎవరు?
1.ఇందిరాగాంధి 2.రాజివ్ గాంధి 3.పీవీ నరసిమ్హారావు 4.మొరార్జీ దేశాయ్
జవాబు:2
61వ సవరణ ద్వారా, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వయొజన ఓటుహక్కు వయస్సుని 18 తగ్గించారు.

6.చీఫ్ ఎలక్షన్ కమీషనర్
1.పార్లమెంట్ చే ఎన్నుకోబడతాడు 2.ప్రధానిచే నియమించబడతాడు 3.రాష్ట్రపతిచే నియమించబడతాడు 4.కేంద్ర హోం మంత్రిచే నియమించబడతాడు
జవాబు:3

7.రాష్ట్ర సంక్షోభ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు?
1.చీఫ్ సెక్రెటరి 2.చీఫ్ మినిస్టర్ 3.ఫైనాన్స్ మినిస్టర్ 4.ఫైనాన్స్ సెక్రెటరీ
జవాబు:1


8.
 "యు మే హావ్ ద బాడీ"/మనిషిని కోర్ట్ ముందు హాజరు పరచు అనేది ఏది?
1.హెబియస్ కార్పస్ 2.మాండమస్ 3.కో-వారంటో 4.సర్షియారో
జవాబు:1

9.స్వతంత్ర్య భారత్ 2వ రాష్ట్రపతి?
1.ఎస్.రాధాకృష్ణ 2.జాకిర్ హుస్సేన్ 3.హిదయతుల్లా 4.వెంకటగిరి
జవాబు:1

10.భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని వర్ణించింది ఎవరు?
1.కేసీ వేర్ 2.కేటీ షా 3.డీఎన్ బెనర్జీ 4.అంబేడ్కర్
జవాబు:3


11.భారత రాజ్యాంగం సమాఖ్య నమూనాని ఏ దేశం నుండి గ్రహించింది?
1.ఇంగ్లాండ్ 2.ఐర్లాండ్ 3.కెనడా 4.అమెరికా
జవాబు:3
ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీస్ కమీషన్ "డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్" ఎక్సాంలో అడిగిన ప్రశ్న.ఏపీపీఎస్సీ జవాబు3 కే మార్కులు ఇచ్చింది.
సమాఖ్యని ఇటు అమెరికా నుండి, అటు కెనడా[బలమైన ఏకకేంద్ర లక్షణాలున్న సమాఖ్య] నుండి కూడా తీస్కున్నారు . మన వ్యవస్థ అమెరికాకి దగ్గరగా లేదు.
అధికార విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగినప్పటికీ కేంద్రానికే ఎక్కువ అధికారాలున్నాయి [99]. ఇటు ఉమ్మడి జాబితాలో కూడా కేంద్రందే పైచేయి. 249 ఆర్టికల్ ప్రకారం కొన్ని సంధర్భాలలో రాష్ట్ర జాబితా పైన శాసనాలు చేసే ధికారం కూడా కేంద్రంకి ఉంది. అందుకే కేసీ వేర్ భారత రాజ్యాంగాన్ని అర్థసమాఖ్యగా వర్ణించాడు. అయితే కేంద్రం ' రాజ్యాంగ చట్ట పరిధిలో ' వ్యవహరించినపుడు అనేక సంధర్భాలలో రాష్ట్రప్రభుత్వాలమీద ఆధారపడి వాటి సహకారం కోరాలి. అందుకే ప్రొఫెసర్ డీఎన్ బెనర్జీ రాజ్యాంగాన్ని "సహకార సమాఖ్య" అన్నాడు.

12.స్థానిక ప్రభుత్వాలని ఏ జాబితాలో చేర్చారు?
1.ఉమ్మడి 2.కేంద్ర 3.రాష్ట్ర 4.ఏదీ కాదు
జవాబు:3

13.లోక్‌సభ స్పీకర్ ఏ రకమైన ప్రశ్నలకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు?
1.నక్షత్ర మార్క్ 2.నక్షత్రం గుర్తు లేనివి 3.స్వల్ప వ్యవధి 4.ఉపప్రశ్నలు
జవాబు:3

14.రాజ్యాంగసభ మొదటి సమావేశం జరిపిన ప్రాంతం?
1.ముంబాయ్ 2.కోల్‌కత 3.లాహోర్ 4.న్యూఢిల్లీ
జవాబు: 4

15."లిబర్టి, ఈక్వాలిటి, ఫ్రటర్నిటి" అనే పదాలు పీఠికలో చేర్చడానికి మూలం? [స్వేచ్చ,సమానత్వం,సౌభాభృత్వం]
1.రష్యన్ విప్లవం 2.ఫ్రెంచ్ విప్లవం 3.అమెరికా విప్లవం 4.1935 భారత ప్రభుత్వ చట్టం
జవాబు:2

16.రాజ్యాంగంలో "సామ్యవాదం" అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినప్పుడు భారత ప్రధానిగా ఎవరున్నారు?
 
1.జవహర్‌లాల్ నెహ్రూ 2.ఇందిరా గాంధీ 3.రాజీవ్ గాంధీ 4.మొరార్జీ దేశాయ్
జవాబు:2


17.
 న్యాయసమీక్షాధికారం [శాసన సభ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే రద్దు చేసే అధికారం] ఏ దేశపు రాజ్యాంగం నుండి గ్రహించారు??
1.అమెరికా 2.రష్యా 3.భారత రాజ్యాంగం-1935 4.కెనడా
జవాబు:1


18.
 "మనదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం ఉండదు" దీని అర్థం మన దేశం..?
1.గణతంత్ర్య దేశం 2.లౌకిక రాజ్యం 3.సార్వభౌమాధికారం కలిగిన దేశం 4.సామ్యవాద దేశం
జవాబు:3

19.రాజ్యాంగంలో 'మౌళిక స్వరూపం మారకుండా సవరణలు చేయొచ్చు' అనే అంశంతో సంభంధం ఉన్న కేసు? [రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా 368 అధికరణం ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగమైనా మార్చే అధికారం భారత పార్లమెంటుకు ఉంది]

1.గోలక్‌నాథ్‌ 2.కేశవానంద భారతి 3.మినర్వామిల్స్‌ 4.ఇందిరాసహానీ
జవాబు:2


20.
 రాజ్యాంగానికి ముందుమాట?
1.ప్రియాంబుల్ 2.సివిల్ రేట్స్ 3.సివిల్ డ్యూటీస్ 4.డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ
జవాబు:1

21."భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, _____, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యంగా నిర్మించుకోవడానికి.."
పైన ఇచ్చిన ఖాళీ ని పూరించేది కింది వాటిలో ఏది?
1.సమాఖ్య 2.లౌకిక 3.సామాజిక 4.అర్థ సమాఖ్య
జవాబు:2


22.
 1946 డిసెంబర్‌ 13న రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ ప్రవేశ పెట్టిన ఆశయాల తీర్మానమే రాజ్యాంగపరిషత్‌ అమోదం పొందిన తర్వాత [1947, జనవరి 22న] ఇలా పిలవబడుతుంది.
1.ఆదేశిక సూత్రాలు 2.పౌర విధులు 3.ప్రవేశిక 4.పౌర హక్కులు
జవాబు:3

23.రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకూ జరిగిన "సవరణలు/అమెండ్మెంట్స్ ఎన్ని?
1.సున్నా 2.ఒకే ఒక్క సవరణ 2.మూడు 4.రెండు
జవాబు:2


24.ఒక రాష్ట్ర గవర్నర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు గవర్నర్‌గా వ్యవహరించవచ్చు అని ఏ రాజ్యాంగ స వరణ తెలుపుతుంది ?
1. 1వ రాజ్యాంగ సవరణ 2. 7వ రాజ్యాంగ సవరణ 3. 21వ రాజ్యాంగ సవరణ 4. 42వ రాజ్యాంగ సవరణ
జవాబు:2
ఆర్టికల్ 153 ప్రతిరాష్ట్రానికీ ఒక గవర్నర్ ఉండాలని చెప్తుంది. 7వ సవరణ ద్వారా ఒక గవర్నర్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్ గా ఉండొచ్చు.

25.84వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ సంవత్సరం వరకు ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పు చేయరాదు
1) 2016 2) 2036 3) 2026 4) 2046
జవాబు:3


1. భారత్ రాజ్యంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విద్యుక్త అంశాలున్నాయి?
1)29 2)18 3)26 4)28
ఇది 2008 గ్రూప్2 లో అడిగిన ప్రశ్న.
జవాబు:1)29

2. క్విటిండియా ఉద్యమం నాటి వైస్రాయ్ ఎవరు?
1.లిన్లిత్‌గో   2.డల్‌హౌసీ  3.మౌంట్ బేటన్  4.వేవెల్
జవాబు: 1.లిన్లిత్‌గో

3. "లిబర్టి, ఈక్వాలిటి, ఫ్రటర్నిటి" అనే పదాలు పీఠికలో చేర్చడానికి మూలం? [స్వేచ్చ,సమానత్వం,సౌభాభృత్వం]
1.రష్యన్ విప్లవం 2.ఫ్రెంచ్ విప్లవం 3.అమెరికా విప్లవం 4.1935 భారత ప్రభుత్వ చట్టం
జవాబు:2

4. బ్రిటన్‌లో ఏ తరహా ప్రభుత్వం ఉంది?
1.ఏక కేంద్ర 2.సమాఖ్య 3.ఏక కేంద్ర,సమాఖ్య 4.ఏదీ కాదు.
జవాబు:1

5. "The Indian Constitution, Cornerstone of a Nation" రాసింది ?
1.ఐవర్ జెనింగ్స్ 2.ఏ ఓ హ్యూమ్‌స్ 3.ఎం ఎన్ రాయ్ 4.ఎవరూకాదు
జవాబు:4
గ్రాన్విల్ ఆస్టిన్

6. సమాఖ్య ప్రభుత్వ లక్షణాలలో కిందివాటిలో తప్పుగా జతచేయబడింది ఏది?
1.కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన 2.ద్విసభా విధానం 3.ధృఢమైన రాజ్యాంగ సవరణ విధానం 4. కేంద్ర, రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం
జవాబు:4

7. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు?
1.బాబూ రాజేంద్రప్రసాద్ 2.బీ ఎన్ రావ్ 3.H C ముఖర్జీ 4.జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:3

8. భారత ఉపరాష్ట్రపతి ఎవరిద్వారా ఎన్నుకోబడతాడు?
1.లోక్‌సభ, రాజ్యసభ సభ్యులచేత 2.రాష్ట్రపతి చేత 3.లోక్‌సభ సభ్యులచేత 4.రాజ్యసభలో అధిక మెజారిటీ ఉంటే చాలు.
జవాబు:1

9. భారత్ పార్లమెంట్ ఆర్థిక సంఘం ఏది?
1.గవర్న్‌మెంట్ అస్ష్యూరెన్స్ కమిటీ 2.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 3.లైబ్రరీ కమిటీ 4.ఏదీ కాదు
జవాబు:2

10. కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు?
1.పులికాట్ 2.రామప్ప 3.హంసల సరస్సు 4.కొల్లేరు
జవాబు:4

11."గట్టి బ్రేకులుండి ఇంజన్ లేని మిషిన్" అని నెహ్రూ తీవ్రంగా విమర్శించినది దేనిని?
1.క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2.వేవెల్ ప్రణాళిక 3.1935 భారత ప్రభుత్వ చట్టం 4.మౌంట్‌బేటన్ ప్లాన్
జవాబు:3



1.అంటరానితనం నిషేధం అని తెలిపే ఆర్టికల్?
1)17 2) 19 3)23 4)24
జవాబు:1


2. 
జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని రాజ్యాంగ పరిషత్‌ అమోదించిన తేదీ?
1. 1950 జనవరి 24 2. 1947 ఆగస్టు 15 3. 1950 జనవరి 26 4.1947జనవరి 22
జవాబు:1


3.
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఓటు హక్కుకు కావాల్సిన కనీస వయస్సు?
1.16 2.18 3.21 4.25
జవాబు:2


4.
"భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం" అన్నదెవరు?
1.గాన్‌విల్‌ఆస్టిన్‌ 2. ఐవర్‌ జిన్నింగ్‌ 3. ఠాకుర్‌దాస్‌ భార్గవ్‌ 4. కామత్‌
జవాబు:2

5. ఆర్టికల్ 14 దేనికి సంభంధించింది?
1.చట్టం ముందు సమానత్వం 2.మతస్వేచ్ఛ హక్కు 3.సాంస్కృతిక మరియు విద్యాహక్కు 4.రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:1

6. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
1.సుప్రీంకోర్ట్ జడ్జ్ 2.రాష్ట్రపతి 3.ముఖ్యమంత్రి 4.గవర్నర్
జవాబు:4

7. గవర్నర్ న్యాయాధికారాలకి [రాష్ట్రస్థాయిలో న్యాయస్థానాలు] సంభంధించి సరికానిది ఏది?
1.శిక్షలను తగ్గించవచ్చు
2.క్షమాభిక్ష ప్రసాదించవచ్చు
3.శిక్షను రద్దు చేయవచ్చు
4.ఉరిశిక్షను రద్దు చేయవచ్చు
జవాబు:4

8. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తారు
1. ఆర్టికల్ 155 2.ఆర్టికల్ 125 3.ఆర్టికల్ 133 4.ఆర్టికల్ 364
జవాబు:1


9. 
1956లో రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించిన రాజ్యాంగ సవరణ?
1. 4వ సవరణ 2. 7వ సవరణ 3. 8వ సవరణ 4. 11వ సవరణ
జవాబు:2

10.రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఓటు హక్కుకు కావాల్సిన కనీస వయస్సు?
1.16 2.18 3.21 4.25
జవాబు:3


11."భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం" అన్నదెవరు?
1.గాన్‌విల్‌ఆస్టిన్‌ 2. ఐవర్‌ జెన్నింగ్స్ 3. ఠాకుర్‌దాస్‌ భార్గవ్‌ 4. కామత్‌
జవాబు:2

12.జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని రాజ్యాంగ పరిషత్‌ అమోదించిన తేదీ?
1. 1950 జనవరి 24 2. 1947 ఆగస్టు 15 3. 1950 జనవరి 26 4.1947జనవరి 22
జవాబు:1

13.అంటరానితనం నిషేధం అని తెలిపే ఆర్టికల్?
1)17 2) 19 3)23 4)24
జవాబు:1

14.ఆర్టికల్ 14 దేనికి సంభంధించింది?
1.చట్టం ముందు సమానత్వం 2.మతస్వేచ్ఛ హక్కు 3.సాంస్కృతిక మరియు విద్యాహక్కు 4.రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:1

15.రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
1.సుప్రీంకోర్ట్ జడ్జ్ 2.రాష్ట్రపతి 3.ముఖ్యమంత్రి 4.గవర్నర్
జవాబు:4

17.గవర్నర్ న్యాయాధికారాలకి [రాష్ట్రస్థాయిలో న్యాయస్థానాలు] సంభంధించి సరికానిది ఏది?
1.శిక్షలను తగ్గించవచ్చు
2.క్షమాభిక్ష ప్రసాదించవచ్చు
3.శిక్షను రద్దు చేయవచ్చు
4.ఉరిశిక్షను రద్దు చేయవచ్చు
జవాబు:4

18.ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తారు
1. ఆర్టికల్ 155 2.ఆర్టికల్ 125 3.ఆర్టికల్ 133 4.ఆర్టికల్ 364
జవాబు:1

19.1956లో రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించిన రాజ్యాంగ సవరణ?
1. 4వ సవరణ 2. 7వ సవరణ 3. 8వ సవరణ 4. 11వ సవరణ
జవాబు:2

20. "లిబర్టి, ఈక్వాలిటి, ఫ్రటర్నిటి" అనే పదాలు పీఠికలో చేర్చడానికి మూలం? [స్వేచ్చ,సమానత్వం,సౌభాభృత్వం]
1.రష్యన్ విప్లవం 2.ఫ్రెంచ్ విప్లవం 3.అమెరికా విప్లవం 4.1935 భారత ప్రభుత్వ చట్టం
జవాబు:2

21.బ్రిటన్‌లో ఏ తరహా ప్రభుత్వం ఉంది?
1.ఏక కేంద్ర 2.సమాఖ్య 3.ఏక కేంద్ర,సమాఖ్య 4.ఏదీ కాదు.
జవాబు:1

22."The Indian Constitution, Cornerstone of a Nation" రాసింది ?
1.ఐవర్ జెనింగ్స్ 2.ఏ ఓ హ్యూమ్‌స్ 3.ఎం ఎన్ రాయ్ 4.ఎవరూకాదు
జవాబు:4
గ్రాన్విల్ ఆస్టిన్

23.సమాఖ్య ప్రభుత్వ లక్షణాలలో కిందివాటిలో తప్పుగా జతచేయబడింది ఏది?
1.కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన 2.ద్విసభా విధానం 3.ధృఢమైన రాజ్యాంగ సవరణ విధానం 4. కేంద్ర, రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం
జవాబు:4

24.రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు?
1.బాబూ రాజేంద్రప్రసాద్ 2.బీ ఎన్ రావ్ 3.H C ముఖర్జీ 4.జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:3

25.భారత్ పార్లమెంట్ ఆర్థిక సంఘం ఏది?
1.గవర్న్‌మెంట్ అస్ష్యూరెన్స్ కమిటీ 2.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 3.లైబ్రరీ కమిటీ 4.ఏదీ కాదు
జవాబు:2