Thursday, November 26, 2015

జాగ్రఫీ


అగ్నిపర్వతాలకు ఉదాహరణలు జపాన్‌లోని ఫుజి పర్వతం మరియు ఫిలిప్పీన్స్‌లోని పినాటుబో పర్వతం. ఒక ప్లేట్ మరొక ప్లేట్ క్రిందకు లేదా మధ్య-సముద్ర శిఖరం లేదా హాట్‌స్పాట్ వద్ద నెట్టబడినప్పుడు అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. 
మడత పర్వతాలు: రెండు పలకలు ఢీకొన్నప్పుడు మడత పర్వతాలు ఏర్పడతాయి: బాల్కన్ పర్వతాలు[యూరప్] మరియు జురా పర్వతాలు[ఫ్రెంచ్-స్విస్ సరిహద్దు] మడత పర్వతాలకు ఉదాహరణలు

1.ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు? లేక్ సుపీరియర్
ప్రపంచంలోకెల్ల "లోతైన" మంచినీటి సరస్సు: లేక్ బైకాల్, సైబీరియా
ప్రపంచంలో అతి "పెద్ద" మంచినీటి సరస్సు:లేక్ సుపీరియర్, నార్త్ అమెరికా

2.డెల్టాలలో ఉండే మట్టి? ఒండ్రు

3.భారత ద్వీపకల్పంలోని ఏ పర్వతశ్రేణిని సహ్యాద్రిపర్వత శ్రేణిగా పిలుస్తారు? 
పశ్చిమకనుమలు
పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యం చాలా ఉంటుంది. ఎన్నో రకాల పక్షులు జంతువులకి అడ్రెస్ ఈ ప్లేస్. వర్షాకాలంలో ఈ కనుమలు చాలా అందంగా ఉంటాయ్. యునెస్కో ఈ పశ్చిమకనుమలని 8 "హాటెస్ట్ హాట్‌స్పాట్స్" లో ఒకటిగా గుర్తించింది [వార్ల్డ్ హెరిటేజ్ గుర్తింపు]. ఈ కొండల్లో అత్యంత ఎత్తైన "అనెముడి" కేరళలో ఉంది.
4.వెస్ట్‌బెంగాళ్ లో ఉత్పత్త్పి అగు ప్రధానఖనిజం [ఏపీపీఎస్‌సీ, 2011] .బొగ్గు
5.
 తూర్పు నుండి పడమరకి ప్రవహించే నది? తపతి 
6.ఏ మట్టిలో బంక మట్టి ఎక్కువగా ఉండి, నీళ్ళలోని తేమని తనలో దాచుకొనే శక్తి ఉంటుంది? నల్లరేగడి నేలలు
7.
 నల్లరేగడి నేలలు ఏ పంటకి అనుకూలం? పత్తి
8.అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుంది? ఫిలిప్పైన్స్ 

9.భారత్-ఆఫ్ఘనిస్తాన్ లని వేరు చేయునది? 
డ్యూరాండ్ రేఖ
11.ఏ రకపు మేఘాలు ఉన్నపుడు వాతావరణం సరిగా ఉండదు? క్యుములోనింబస్
12.గురు శిఖరం ఉన్న రాష్ట్రం ఏది? 
రాజస్థాన్
ఆరావళి పర్వతాలలో, మౌంట్ అబూ దగ్గర గల ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖరం[రాజస్థాన్]. 
13.భారతదేశపు ఉత్తరపు చిట్టచివరి సరిహద్దు ఏది?
ఇందిరా కాల్ 
సియాచిన్ మంచు ప్రాంతపు ఎత్తైన ప్రదేశం ఇందిరా కాల్ ఇది కారకోరం శ్రేణుల్లో ఉంది.ఇందిరా పాయింట్ వేరు అది దక్షిణంలో ఉంది.
14.దేశంలో నేలల క్రమక్షయానికి ప్రధానకారణం? నదీ ప్రవాహాలు 
15.పినాకిని నదికి మరో పేరు? పెన్నా

16.దూరం యొక్క ప్రమాణాలన్నిటిలో పెద్దది? పార్‌సెక్

17.లక్షద్వీప్ రాజధాని? కవరత్తి 
18.అడవుల్లో గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఏం వ్యవసాయం అని పిలుస్తారు? 
పోడు 
ఇది చాలా మోటు వ్యవసాయం.
19.ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్ క్రింది వాటిలో ఏది? 
నార్వే 
మన భూమి 23.5 డిగ్రీస్ వాలి సూర్యుడి చుట్టూ తిరగటంవల్ల మనకి భూగోళం మొత్తం మీద కాంతి ఒకేలా ఉండదు. నార్వే దేశం మన భూమి కి ఉత్తరంలో ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉంది.[దీన్ని టెక్నికల్ గా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటారు..ఇంకా కొంచెం ఉత్తర వెళ్తే ఉత్తర ధృవం వస్తుంది. ఇది 90 డిగ్రీల ఉత్తర ధృవం.] అందుకే ఈదేశంలో వేసవిలో [మే,జూన్,జులై లలో] సూర్యుడు పూర్తిగా అస్తమించడు. అర్థరాత్రి లేచినా అస్తమించే సూర్యుడిలాగానే ఉంటాడు. అందుకే ఈ దేశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. అలాగే చలికాలంలో కూడా ఇంటే, సూర్యుడు ఇక్కడ 24 హౌర్స్ పూర్తిగా ఉదయించడు, ఎక్కువగా చీకటే.
స్వీడెన్, ఫిన్లాండ్ లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి.
మరి దక్షిణ గోళంలో అంటార్కిటికాలో కూడా పరిస్థితి ఇదే అయితే, ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించరు 
20.ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫంట్స్? 
థాయీలాండ్ 
థాయిలండ్ ప్రజలు ఏనుగుల్ని ప్రేమిస్తారు. వీళ్ళ దేశానిదీ, ఏనుగుల్ది విడదీయరాని సంభంధం.
ఆగ్నేయ ఆసియాఖండంలో యూరప్ వారిచే పరిపాలించబడని దేశం ఏదైనా ఉంది అంటే అది థాయీనే. ఇలా పాశ్చాత్యులు పరిపాలించని దేశాల్లో సంస్కృతి అనేది ప్రభావితం కాదు. మనదేశంలో యూరప్ పరిపాలనవల్ల మన సంస్కృతిలో చాలా మార్పులొచ్చాయి. చైనా, జపాన్,భూటాన్ లంటి దేశాలుకూడా పాశ్చాత్యుల పాలన కిందికి రాలేదు. అందుకే వాటి సంస్కృతి చాలా ఘనమైనది.
నిజానికి లవ్స్[లావోస్ అని పిలుస్తూ ఉంటాం] దేశాన్ని లాండ్ ఆఫ్ 1000 ఎలిఫంట్స్ అని పిలుస్తారు.వీళ్ళ అధికార ముద్రలపైన ఏనుగు బొమ్మలు ఉంటాయి. తెల్ల ఏనుగొకటి కొన్ని నెలల కిందట మయన్మార్ లో కనిపించింది. ఇండియాలో ముఖ్యంగా కేరళలో పండగలకి ఏనుగుల సందడే ఎక్కువ. 
21.ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్ ఏది?.స్విట్జర్లాండ్ 
22.
 ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఏది? జపాన్ 
23.కేరళ? స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా 
24.ప్రకాశవంతంగా కంటికి కనిపించేవి ఆకాశంలో వరుసగా? సూర్యుడు-చంద్రుడు - శుక్ర - గురు
25.జత 
1.సిటీ ఆఫ్ నవాబ్స్ - లక్నౌ/లక్నో
2.సిటీ ఆఫ్ టెంపుల్స్ - బుబనేష్వర్
3.ద లాండ్ ఆఫ్ జువల్ [Jewel] - మణిపూర్


1. కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాలగుండా ప్రయాణిస్తుంది? 
1)8  2)10  3)5  4)6
జవాబు:1

అవి పడమర నుండి తూర్పుకి వరుసగా:
గుజరాత్ >రాజస్థాన్ >మధ్యప్రదేశ్ > చత్తీస్‌గడ్> ఝార్కండ్ >వెస్ట్‌బెంగాళ్ > త్రిపుర> మిఝోరం

2. భారత్‌లో ఏ రాష్ట్రం ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది?
1.రాజస్థాన్  2.జమ్ముకశ్మీర్  3.మధ్యప్రదేశ్  4.ఉత్తర్‌ప్రదేశ్
జవాబు:4
ఉత్తర్‌ప్రదేశ్ 8 రాష్ట్రాలతో బార్డర్ పంచుకుంటుంది.
అవి: ఉత్తరాఖండ్ >హిమాచల్‌ప్రదేశ్> హర్యానా> రాజస్థాన్> మధ్యప్రదేశ్> చత్తీస్‌గడ్ >ఝార్ఖండ్ >బిహార్

3. 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాలగుండా పోతుంది?
1)5  2)6  3)7  4)8
జవాబు:1
ఉత్తర్‌ప్రదేశ్ >మధ్యప్రదేశ్ >చత్తీస్‌గడ్ >ఒడిషా >ఆంధ్రప్రదేశ్

4. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలని కలిపేది ఏది?
1.మధ్యధరా సముద్రం 2.సూయజ్ కాలువ 3.పనామా కాలువ 4.ఏదీ కాదు.
జవాబు:3

5. అతిచిన్న ఖండం ఏది?
1.ఆస్ట్రియా 2.ఆస్టేలియా 3.ఆర్కిటికా 4.అంటార్కిటిక
జవాబు:2


6. 
 ఏసియా ఖండంలో చిన్న దేశం ఏది?
1.న్యూజీల్యాండ్ 2.శ్రీలంక 3.నేపాల్ 4.మాల్దీవ్స్
జవాబు:4

7. కిందపేర్కొన్న కాలువలలో పెద్ద కాలువ ఏది?
1.ఇందిరాగాంధీ కాలువ 2.బకింగ్‌హ్యాం కాలువ 3.శారదా కాలువ 4.సట్లెజ్ యమున లింక్ కాలువ
జవాబు:1

8. నార్త్ అమెరికానీ, యూరప్‌నీ విడదీసే సముద్రం ఏది?
1.మధ్యధరా 2.ఆర్కిటిక్ 3.అట్లాంటిక్ 4.పసిఫిక్
జవాబు:3
అట్లాంటిక్ ఇటు నార్త్ అమెరికానీ, యూరప్‌నీ
అటు సౌత్ అమెరికానీ, ఆఫ్రికానీ వేరు చేస్తుంది.


9. సింధూనది ఉపనదులలో తప్పుగా ఇవ్వబడింది ఏది?
1.జీలం 2.చీనాబ్ 3.రావి 4.లోహిత్
జవాబు:4
జీలం, రావి, బియాస్, సట్లెజ్, చినాబ్ అనేవి ముఖ్యమైన సింధూనది ఉపనదులు.

10. కెనరా తీరప్రాంతం ఎక్కడుంది?
1.గోవా 2.మహారాష్ట్ర 3.కేరళ 4.కర్ణాటక
జవాబు:4


11. 
 బ్రహ్మపుత్రనదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారు?
1.జమున 2.పద్మ 3.సాంగ్‌పో 4.సియాంగ్
జవాబు:3

12. ఉత్కళ తీరప్రాంతం ఏ రాష్ట్రానికి సంభంధించింది? [ఈ ప్రాంతం ఉత్కళ రాజ్యం గా పిలవబడేది..మన జాతీయగీతంలో  'ఉత్కళ ' అని చెప్పబడిన ఒకప్పటి ఉత్కళ ప్రాంతం]
1.పశ్చిమ బెంగాళ్ 2.మద్రాస్ 3.ఉత్తర్‌ప్రదేశ్ 4.ఒడిషా
జవాబు:4

13. లూనీ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?
1.బిహార్ 2.ఉత్తర్‌ప్రదేశ్ 3.పంజాబ్ 4.రాజస్తాన్
జవాబు:4


14. 
 విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది?
1.తిరువనంతపూర్,కేరళ 2.శ్రీహరికోట, నెల్లూర్ 3.అలహాబాద్, ఉత్తర్‌ప్రదేశ్ 4.యెంలూరు, బెంగళూరు
జవాబు:1

15. కరేవా మృత్తికలు వీటి ద్వారా నిక్షేపించబడినవి..
1.తరంగాలు 2.పవనాలు 3.నదులు 4.హిమానీ నదులు
జవాబు:4

16.సమానమైన ఎత్తుగల ప్రదేశాలని కలుపుతూ గీసే రేఖలని ఏమంటారు? [ఇవి ఊహా జనితమైనవి]
1.అక్షాంష రేఖలు 2.కాంటూర్ రేఖలు 3.ఐసో హ్యూం రేఖలు 4.ఐసో్‌నెఫ్ రేఖలు
జవాబు:2

17.భారత్‌లో మొదటగా వేసవి ఋతుపవనాలు ఏ ప్రాంతాన్ని తాకుతాయి
1.గంగా మైదానాలు 2.తూర్పు కనుమలు 3.పశ్చిమకనుమలు 4.హిమాలయాలు
జవాబు:3
భారత్‌లో వేసవి ఋతుపవనాలు ముందుగా పశ్చిమకనుమలని తాకుతాయి [ముందు తాకే రాష్ట్రం కేరళ].

18.కొండప్రాంతాలలో వచ్చే వర్షపాతాలని ఏ పేరుతో పిలుస్తారు?
1.తుఫాన్లు 2.సాంప్రదాయకవర్షాలు 3.ఫ్రంటల్ వర్షపాతం 4.ఓరోగ్రాఫిక్ వర్షపాతం
జవాబు:4

19."ఝూం" అనేది ఒక
1.ఒక మొక్క యొక్క శాస్త్రీయ నామం
2.పొడిప్రదేశంలో ఉన్న నదీ లోయ
3.ఒకరకమైన వ్యవసాయ పద్ధతి
4.ఏదీ కాదు
జవాబు:3

20.కాంటూర్ రేఖలకి మరోపేరు?
1.ఐసోపొటెన్షియల్ 2.ఐసోబార్స్ 3.ఐసోహైప్ 4.ఐసోహయట్
జవాబు:3

21.అరుణాచల్‌ప్రదేశ్‌లో శివాలిక్ శ్రేణులని ఏమని పిలుస్తారు?
1.జమ్ము కొండలు 2.కచార 3.మిష్మి 4.రాణిఖేత్
జవాబు:3


22.
 నిమ్న హిమాలయాలు, శివాలిక్ హిమాలయాల మధ్యలో ఉండే లోయలని ఏమని పిలుస్తారు?
1.డూన్స్ 2.డోన్స్ 3.పూర్వాంచల్ 4.ఉత్తరాంచల్
జవాబు:1

23.చిత్తడి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1.బాబర్ 2.భంగర్ 3.టెరాయ్ 4.ఖాదర్
జవాబు:3

24.ఆకురాల్చు అరణ్యాలలో పెరిగే వృక్షం?
1.కార్క్ 2.టేకు 3.ఓక్ 4.ఏదీకాదు
జవాబు:2

25.కిందివాటిలో భిన్నమైనదానిని గుర్తించండి?
1.ముస్సోరీ 2.సింలా 3.ఊటీ 4.నైనిటాల్
జవాబు:3
ఊటీ సౌత్ ఇండియాలో ఉంది.. మిగతావన్నీ నార్త్ ఇండియాలో ఉన్నాయి. మరీ ముఖ్యమైన పోలిక ఏమంటే మిగతా 3 హిమాలయాలతో సంభంధం ఉన్న ప్రాంతాలు. ఊటీకి హిమాలయాలతో అసలు సంభంధం లేదు.


1.కన్‌హా/కణ్ణా నేషనల్ పార్క్ ఎక్కడుంది?
మధ్యప్రదేశ్ 
మధ్యప్రదేశ్ లోని మరికొన్ని నాషనల్ పార్క్స్:
బాంధవ్గడ్ నాషనల్ పార్క్
సాత్పూర నాషనల్ పార్క్
పన్నా నాషనల్ పార్క్
పెంచ్ నాషనల్ పార్క్

2.ఏలక్కాయల (కార్డమం)పర్వతాలు ఎక్కడున్నాయి [2011 Group2]
కాంబోడియా
గ్వాటెమల [సెంట్రల్ అమెరికాలోని చిన్న దేశం] ఈ కార్డమం ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. తర్వాతి స్థానం ఈండియాది. ఇండియాలో 70% ఉత్పత్తి కేరళలోనే[ఇడుక్కి జిల్లా] జరుగుతుంది. ప్రపంచంలో అత్య్ధికంగా దిగుమతి చేస్కొనే దేశం సౌదీ అరేబియా, తర్వాతి స్థానం కువైట్. ప్రపంచొలో మొత్తం ఉత్పత్తిలో 66% గ్వాటెమలలోనే ఉత్పత్తి అవుతుంది. 

3.అపోలోగా పిలిచే గ్రహం? బుధ 
4.బాంగ్లాదేశ్ లో గంగానదిని ఏమని పిలుస్తారు? 
పద్మ 
5.రూర్ ఆఫ్ ఇండియా ఏది? చొటా నాగ్పూర్ పీఠభూమి.
రూర్ వ్యాలీ జర్మనీలో ఉంది. ఛోటానాగపూర్ పీఠభూమిని ఖనిజ సంపద విషయంలో జర్మనీలోని 'రూర్' ప్రాంతంతో పోలుస్తారు.

6."నిర్డ్" [NIRD] ఎక్కడ ఉంది? హైదరాబద్
National Institute of Rural Development

7.న్యూయార్క్ ఏనది ఒడ్డున ఉన్నది?
హడ్సన్ 

లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
థేంస్

9.మన్నార్ సింధుశాఖ ఏ ప్రాంతాలమధ్య విస్తరించి ఉన్నది.
ఇండియా-శ్రీలంక 

10.క్వీన్ ఆఫ్ అరేబియా ఏ ఓడరేవు?
కొచ్చిన్ 

11.82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంషం ఎన్ని రాష్ట్రాలగుండా పోతుంది?
UP, MP, Chhattisgarh, Orissa and Andhra Pradesh.






No comments:

Post a Comment