Tuesday, November 24, 2015

మెడిసిన్, సైన్స్ & టెక్నాలజీ


1.వేసవికాలంలో "క్యుమ్యులొనింబస్" మేఘాలవల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులూ వస్తుంటాయి. ఇలాంటి వర్షాలని ఏమని పిలుస్తారు.
1.సంవహన వర్షపాతం 2.పర్వతీయవర్షపాతం 3.చక్రవాతం 4.ఏదీకాదు.
జవాబు:1

2.జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు? 
[ రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ISRO,DRDO, వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనా వెళ్ళవచ్చు. సమయం తదితర వివరాలు ఆయా సంస్థలు ప్రకటిస్తాయి]
1.ఫిబ్రవరి 14 2.జనవరి 12 3.ఫిబ్రవరి 28 4.ఏదీకాదు.
జవాబు: 3

3.అత్యధిక సహజ ఉపగ్రహాలు లేదా చంద్రులు కలిగి ఉన్నది
1) జుపిటర్ 2) మార్స్ 3) వీనస్ 4) శని
జవాబు:1
ఇప్పటికీ ఎక్కువ ఉపగ్రహాలున్నది "జూపిటర్"కే. జూపిటర్ కి 67 ఉపగ్రహాలూ, శనికి 62 ఉపగ్రహాలూ ఉన్నాయి

4.సౌరకుటుంబంలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి?
1.బుధుడు,శుక్రుడు 2.శుక్రుడు,శని 3.బుధుడు, భూమి 4.ఏదీ కాదు.
జవాబు: 1

5.ఆర్యభట్ట, వరాహమిహిర ఏ సామ్రాజ్య కాలంలో జీవించారు.
[వీళ్ళు ప్రపంచంలోని ఖగోళ సైంటిస్టులందరికీ సుపరిచితం.
ఆర్యభట్ట: ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడూ మరియూ గణిత శాస్త్రజ్ఞుడూ; భూమి తన అక్షం మీద తిరుగుతూ ఉందని కనుగొన్న మహానుభావుడు.సూర్యచంద్ర గ్రహణాలను కచ్చితంగా అధ్యయనం చేశాడు.
వరాహమిహిర:ఖగోళశాస్త్రజ్ఞుడైన ఈయన, పంచసిద్ధాంతం {తనకాలం నాటి అయిదు ఖగోళశాస్త్ర సంబంధమైన గ్రంధాల సారాంశం} రచించాడు.]
1.మౌర్య 2.మగధ 3.గుప్త 4.శిశునాగ
జవాబు: 3

6.న్యూక్లియర్ రియాక్టర్ లో మితకారి [మోడరేటర్] గా పని చేసే భారజలం కి దీనికీ సంభంధం ఉంది
 
1.ప్రోటియం 2.డ్యుటీరియం 3.ట్రిటీయం 4.ఏదీకాదు.
జవాబు:2

7.సోడా నీటిలో ఉండే ఉండే వాయువు?
1.ఆక్సిజన్ 2.నైట్రోజన్ 3.కార్బన్ డై ఆక్సైడ్ 4.ఏదీ కాదు
జవాబు:3

8."క్వినైన్" ఏ వృక్షం నుండి లభిస్తుంది?
1.వేప 2.సింకోనా 3.రావి 4.పైన్
జవాబు:2
క్వినైన్ అనే పదార్ధాన్ని సింకోనా చెట్టు బెరడునుండి తీస్తారు, మలేరియా వ్యాధి నివారణలో ఎక్కువగా వాడతారు.

9.స్టైన్‌లెస్ స్టీల్ అనేది దేనియొక్క మిశ్రమ లోహం?
1.ఇనుము, కార్బన్ మరియు నికెల్ 2.ఇనుము, మాంగనీస్, నికెల్
3.ఇనుము, క్రోమియం, నికెల్ 4.ఏదీ కాదు
జవాబు: 3

10.మన శరీరంలో ఉష్ణోగ్రతా క్రమతా కేంద్రం అని దేన్ని అంటారు?
1.పిట్యుటరీ 2.పీనియల్ 3.హైపోథాలమస్ 4.ఏదీ కాదు.
జవాబు: 3

11.ఊపిరితిత్తుల కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏం అంటారు?
1.కార్డియాలజీ 2.నెప్రాలజీ 3.పూమనాలజీ/ పల్మనాలజీ 4.ఏదీ కాదు
జవాబు:3

12.వేడికి అతి త్వరగా నశించిపోయే విటమిన్?
1.ఏ 2.బీ 3.సీ 4.డీ
జవాబు:3

13.డీ.పీ.టీ వ్యాక్సిన్ వల్ల ఏయే వ్యాధుల నుండి రక్షణ?
1.డయేరియా, పోలియో, టెటానస్ 2.డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం
3.డయేరియా, పోలియో, టీబీ 4.ఏదీ కాదు
జవాబు:2

14.హైడ్రాలిక్ బ్రేక్స్ ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తాయి?
1. పాస్కల్ నియమం 2.న్యూటన్ 3వ నియమం 3.బెర్నౌలీ నియమం 4.ఏదీ కాదు
జవాబు:1

15.పీడనం/ప్రెషర్ పెరిగితే?
1.నీటి భాష్పీభవన స్థానం పెరుగుతుంది 2.నీటి భాష్పీభవన స్థానం తగ్గుతుంది 3.రెండూ 4.రెండూ కాదు.
జవాబు: 1
కొంచెం కంఫ్యూస్ చేసే ప్రశ్న.
మనం క్రమంగా భూమి నుండి పై పైకి పోయేకొద్దీ వాతావరణ పీడనం/ప్రెషర్ తుగ్గుతుంది. అప్పుడు నీరు త్వరగా మరిగి ఆవిరవుతుంది. పీడనాన్ని పెంచినపుడు, నీరు మరిగే ఉష్ణోగ్రత/భాష్పీభవన స్థానం కూడా పెరుగుతుంది. ఇదే ప్రెషర్ కుక్కర్ పనిచేసే సూత్రం.అందుకే ఎత్తయిన ప్రదేశాల్లో వంట చేసేటప్పుడు ప్రెజర్ కుక్కర్‌ను వాడుతారు.

16.సీఎఫ్ఎల్ బల్బులు ఎలక్ట్రిసిటి తక్కువ వినియోగం అయ్యేలా ఉండటానికి వాడుకుంటున్నాం. ఈ సీ.ఎఫ్.ఎల్. పూర్తి పేరు?
1.కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ 2.కాంపాక్ట్ ఫిలమెంట్ ల్యాంప్ 3.కండెన్స్డ్ ఫిలమెంట్ ల్యాంప్ 4.ఏదీ కాదు.
జవాబు: 1


17.
 క్రిందివాటిలో విధ్య్దయస్కాంతతరంగాల జత కానిది?
1.రేడియో, ఎక్స్-రే 2.మైక్రో, గామా 3.అల్ట్రా వయొలెట్, గామా 4.మైక్రో, బీటా
జవాబు: 4
రేడియో, మైక్రో, ఇన్‌ఫ్రారెడ్, (విసిబుల్), అల్ట్రా వయొలెట్, ఎక్స్, గామా మాత్రమే ఉన్నాయి. బీటా లేదు.

18.టీవీ రిమోట్ కంట్రోలర్ ఏ విద్యుతయస్కాంత తరంగాలని వాడుకుంటుంది?
1.ఇన్‌ఫ్రారెడ్ 2.రేడియో 3.మైక్రో 4.ఏదీ కాదు
జవాబు:1

19.కిందివాటిలో హైడ్రోజన్ యొక్క ఐసోటొప్స్ ఏవి?
1.ప్రోటియం 2.డ్యుటీరియం 3.ట్రీటియం 4.అన్నీ
జవాబు:4

20.వెల్లుల్లి వాసన ఉన్న మూలకం?
1.పాస్పరస్ 2.హైడ్రోజన్ 3.కార్బన్ 4.ఏదీ కాదు
జవాబు:1


21.హైడ్రోజన్‌/ఉదజని మూలకంలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య?
1)2 2)1 3)0 4)ఏదీ కాదు
జవాబు:2

22.గబ్బిలాలు రాత్రివేళలో సంచరించడానికి సహాయపడేవి?
1.వరారుణ/ఇంఫ్రారెడ్ కిరణాలు 2.అతిలీలలోహిత/అల్ట్రావయొలెట్ కిరణాలు 3.అతిధ్వని/అల్ట్రాసానిక్ తరంగాలు 4.ఏదీ కాదు
జవాబు:3


23.గోబర్ గ్యాస్‌లో ఉండేది?
1.బ్యూటేన్ 2.మీథేన్ 3.ప్రొపేన్ 4.ఏమీ కాదు
జవాబు:2

24.సహజ రబ్బర్ అనేది ఒక
1.కొల్లాయిడ్ 2.పాలిమర్ 3.జెల్ 4.సాలిడ్ సొల్యూషన్
జవాబు:2

25.MRI స్కానింగ్ లో R అంటే?
1.రెసనెన్స్ 2.రాపిడ్ 3.ర్యాండం 4.ఏదీ కాదు
జవాబు: 1
Magnetic Resonance Imaging

1.న్యూటన్ సుప్రసిద్ద 3వ సిద్ధాంతంలో చర్య, ప్రతి చర్యలు
1.వివిధ వస్తువుల మీద ప్రభావం చూపుతాయి
2.ఒకటే వస్తువు మీద ప్రభావం చూపుతాయి
3.ఎప్పుడూ సమానంగా ఉండవు
4.ఎప్పుడూ సమానంగా ఉంటాయి
జవాబు:4

2.విటమిన్ "డి" లోపం వల్ల వచ్చు వ్యాధి?
1.బెరి-బెరి 2.స్కర్వి 3.రికెట్స్ 4.రేచీకటి
జవాబు:3

3.కోబాల్ట్ 60 ని రేడియేషన్ చికిత్సలో వాడటంలో ముఖ్య ఉద్దేశ్యం అవి కింది కిరణాలని ప్రసరింపచేస్తాయని.
1.ఎక్స్-కిరణాలు 2.ఆల్ఫాట్ 3.గామా 4.బీటా
జవాబు:3

4.వేలిముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రానికి పేరు?
1. డాక్టిలోగ్రఫీ 2.న్యూమెస్ మాటిక్స్ 3.ఎథ్నోగ్రఫీ 4.ఏదీ కాదు
జవాబు:1

5.శూన్యవాదాన్ని ప్రతిపాదించింది?
1.ఐన్‌స్టీన్ 2.ఆచార్య నాగార్జున 3.మక్కలి గోసలిపుత్ర 4.సోక్రటిస్
జవాబు:2

6.జీ.పీ.ఎస్ అంటే?
1.గ్లోబల్ ప్లాంట్ సిస్టం 2.జియోగ్రాఫికల్ పొసిషనింగ్ సిస్టం 3.గ్లోబల్ పొసిషనింగ్ సిస్టం 4.జియో పొలిటికల్ సిస్టం.
జవాబు:3

7.పొడి మంచు అనేది కింది వాటిలో ఏది?
1.ఘన H2O 2.ఘన CO2 3.ఘన NO2 4.ఏదీ కాదు
జవాబు:2

8.కిందివాటిలో రంగులేని రక్తం ఉన్న జీవి ఏది?
1.వానపాము 2.పీత 3.బొద్దింక 4.గొంగళిపురుగు
జవాబు:3
మన శరీరంలో రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హిమోగ్లోబిన్. రక్తంలోని ఎర్ర రక్తకణాలలో హిమోగ్లోబిన్ ఉంటుంది.కేవలం ఒక్క ఎర్ర రక్త కణంలోనే దాదాపు 280 మిల్లిఒన్ హెమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయ్.వీటికి ఉన్న ముఖ్యమైన పని ఆక్సిజన్ ని ఊపిరితిత్తుల్లోంచి మోస్కొని వెళ్ళి టిష్యూలకి అందజేయటం, అక్కడనుండి మళ్ళీ కార్బన్-డై-ఆక్సైడ్ ని ఊపిరితిత్తుల్లోకి మోసుకెల్లడం.ఈ సిస్టం బొద్దింకలో లేదు అందుకే దాని రక్తం తెల్లరంగులో ఉంటుంది.

9.వర్ణాంధత్వం[కలర్ బ్లైండ్‌నెస్] కి సంభంధించిన విషయాల్లో / ఈ వ్యాధి ఉన్న రోగికి సంభంధించిన విషయంలో ఒక లక్షణం వీళ్ళు కొన్ని రంగులు చూడలేక పోవటం. అందులో ప్రధానమైన కలర్స్?
1.రెడ్ మరియు బ్లూ 2.గ్రీన్, పింక్ 3.రెడ్, గ్రీన్ 4.బ్లూ, పింక్
జవాబు:3

10.కృత్రిమంగా తయారుచేసిన సిల్క్/పట్టు ని ఇలా కూడా పిలుస్తారు
1.రేయాన్ 2.నైలాన్ 3.డెక్రాన్ 4.ఫైబర్ గ్లాస్
జవాబు:1

11.మన కిచెన్ లో వాడే గ్యాస్‌స్టౌ లలో ఉండే వాయువు/వాయువులు ఏది/ఏవి?
1.మీథేన్ 2.బ్యూటేన్,ప్రోపేన్ 3.కార్బన్ మోనాక్సైడ్,డై ఆక్సైడ్ 4.ఆక్సిజన్,కారబన్-డై-ఆక్సైడ్
జవాబు:2

12.గాలులూ, తరంగాల ద్వారా వచ్చే శక్తి?
1.కైనెటిక్ 2.ఎలక్ట్రికల్ 3.పొటెన్షియల్ 4.కైనెటిక్ & ఎలక్ట్రికల్
జవాబు: 1


13.
ద్రవపదార్థాలలో అత్యధిక ఉష్ణవాహకం [కండక్టర్] గలది ఏది?
1.ఆసిడ్ 2.ఆల్కహాల్ 3.మర్క్యురి 4.నీరు
జవాబు: 3

14.100వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? [జనవరి 2013]
1.హైదరాబాద్ 2.ముంబాయ్ 3.కోల్‌కతా 4.జైపూర్
జవాబు: 3

15.సౌరశక్తిని మార్చడానికి ఉపయోగ పడే మూలకం?
1.అల్ట్రా ప్యోర్ కార్బన్ 2.బెరీలియం 3.టాంటలుం 4.సిలికాన్
జవాబు: 4

16.మలేరియా వ్యాధి వ్యాప్తికి 'ఆడ ఎనాఫిలిస్‌' దోమ కారణమని పరిశోధనల ద్వారా మొదటగా గుర్తించినది?
1.రోనాల్డ్‌ రాస్‌ 2.లూయి పాశ్చర్ 3.చార్లెస్‌ ఎల్టన్‌ 4.ఎవరూ కాదు
జవాబు:1

17.రక్తం యొక్క గ్రూప్ ఏబీ[AB] గా ఉన్నవారు కొన్ని సమయాలలో యూనివర్సల్ స్వీకర్త గా పిలువబడుతున్నారు. డీనికి కారణం?
1.అంటీబాడీస్ ఉండటం వలన 2.అంటీబాడీస్ లేకపోవటం వలన 3.ఆంటిజెన్స్ లేకపోవటం వలన 4.ఆంటీబాడీస్, ఆంటీజెన్స్ రెండూ లేకపోవటంవల్ల
జవాబు:2


18.
ఎలక్ట్రిక్ బల్బ్‌లో వాడే వాయువు?
1.ఆక్సిజన్ 2.హైడ్రోజన్ 3.నైట్రోజన్ 4.కార్బన్-డై-ఆక్సైడ్
జవాబు:3

19."ది అడాసిటీ ఆఫ్ హోప్" [ఆశ యొక్క తెగువ/ధైర్యం] రచయిత ఎవరు?
1.దలై లామా 2.కలాం 3.బరాక్ ఒబామా 4.బాన్-కీ-మూన్
జవాబు:3

20.ప్రజా ప్రయోజన వ్యాజ్యం [కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ] ఏ దేశంలో ప్రారంభం అయ్యింది?
1.భారత్ 2.జర్మనీ 3.అమెరికా 4.ఐర్లాండ్
జవాబు:3

21.విస్తృత సంఖ్యలో నక్షత్రాలు సహజ గురుత్వాకర్షణతో ఒకే దగ్గరకి రావడాన్ని ఏం అంటారు?
1.నెబ్యులా 2.యూనివర్స్ 3.గాలక్సీ 4.కాన్స్టలేషన్
జవాబు:3

22.సాధారణ మానవునిలో ఉండే క్రోమోజోం సంఖ్య?
1.23 2.46 3.48 4.42
జవాబు:2

23.యూరియా రసాయన నామం?
1.కోరోథీన్ 2.ఎన్యూరిన్ 3.నైట్రిన్ 4.కార్బమైడ్
జవాబు:4

24.యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం?
1.రష్యా 2.అమెరికా 3.ఆస్ట్రేలియా 4.కెనడా
జవాబు:3

25.వైరల్ ఇంఫెక్షన్ ద్వారా సంక్రమి0చబడు వ్యాధి?
1.జాండిస్ 2.టైఫాయిడ్ 3.టెటనస్ 4.జలుబు
జవాబు:4





No comments:

Post a Comment